బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా దక్షిణ వియత్నాంలోని ఓ జూలో 47 పులులు, మూడు సింహాలు, ఓ పాంథర్ మరణించినట్లు స్థానిక మీడియా బుధవారం ఓ కథనంలో వెల్లడించింది. వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) మీడియా కథనం ప్రకారం.. లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్ , హో చి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ మరణాలు సంభవించాయని పేర్కొంది.
నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్ పరీక్ష ఫలితాల ప్రకారం ఈ జంతువులకు H5N1 రకం A బర్డ్ ఫ్లూ వైరస్ సోకటంతో మృతి చెందినట్లు తెలిపింది. అయితే పులుల మరణాలుపై జూ అధికారుల స్పందించకపోటం గమనార్హం. అదేవిధంగా జంతువులతో సన్నిహితంగా ఉన్న జూ సిబ్బంది ఎవరిలో కూడా శ్వాసకోశ లక్షణాలను బయటపడలేదని తెలుస్తోంది.
⚠️Bird flu kills 47 tigers, 3 lions and a panther in Vietnam zoos, state media reports.
47 tigers, 3 lions and a panther have died in zoos in south Vietnam due to the H5N1 bird flu virus, state media said Wednesday.@ejustin46@mrmickme2@DavidJoffe64https://t.co/P99Dn71HMF— COVID101 (@COVID19info101) October 2, 2024
ఎడ్యుకేషన్ ఫర్ నేచర్ వియత్నాం (ENV) ప్రకారం.. 2023 చివరి నాటికి వియత్నాంలో మొత్తం 385 పులులు జూలో ఉన్నాయి. ఇందులో 310 ప్రైవేట్ అధీనంలోని జూలలో ఉండగా.. మిగిలినవి ప్రభుత్వ అధీనంలోని జూల సంరక్షణలో ఉన్నాయి. 2022 నుంచి బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వేగంగా వ్యాప్తి చెందటం వల్ల పలు క్షీరదాల మరణాలు పెగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఈ H5N1 వైరస్ ఇన్‌ఫెక్షన్‌లు మానవుల్లో కూడా తేలికపాటి నుంచి తీవ్రమైన స్థాయి వరకు ఉండవచ్చని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ప్రపంచ ఆగర్యో సంస్థ పేర్కొంది. మరోవైపు.. గతంలో 2004లో సైతం డజన్ల కొద్దీ పులులు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని వియాత్నం స్థానిక మీడియా తెలిపింది.
చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్
Comments
Please login to add a commentAdd a comment