న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఈ మేరకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్ అమెరికాలో అతిపెద్ద టీచర్స్ యూనియన్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌లో ప్రసంగిస్తూ....తన స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వయసుకి సంబంధించి చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించడంతో...అక్కడ ఉన్న ఉపాధ్యాయ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా బైడెన్ వ్యాఖ్యలను తిలకించ సాగారు.
ఇంతలో బైడెన్ అక్కడ ఉన్న ఒక మహిళ ఉపాధ్యాయురాలిని చూస్తూ...తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడూ 12 ఏళ్ల బాలికతో స్నేహం చేశానని చెప్పారు. వయసు భేదం ఉన్నప్పటికీ ఆమె నాకు చాలా పనుల్లో సహయం చేసింది అన్నారు. అంతే ఆ సమావేశంలో ఒక్కసారిగా అందరి ముఖాలపై నవ్వులు విరబూశాయి. అతేకాదు ఆ సమావేశంలో రిపబ్లికన్ అబార్షన్ నిషేధం బిల్లు గురించి ప్రస్తావించారు. పైగా ఆ బిల్లు తన వద్దకు వస్తే వీటో చేస్తానని హామీ కూడా ఇచ్చారు.
వాస్తవానికి ఈ బిల్లు విషయంలో ఆశా, ఐక్యత, ఆశావాదం, విభజన, భయం, చీకటి వంటి వాటికి సంబంధించినసరైన ఎంపికగా అభివర్ణించారు. అలాగే అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతి పట్ల కూడా మాటల దాడి చేశారు. ఐతే ఆయన తన ప్రసంగం ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. తనకు 30 ఆమెకు 12 అంటే ఎవరామె అంటూ ఆసక్తకర చర్చ సాగింది. దీంతో కొంత మంది వినియోగదారులు 30 అంటే బైడెన్ గురువు అని 12 అంటే బైడెన్ వయసు అయ్యి ఉంటుందని ఒకరు, మరోకరేమో! ఏమైంటుందా అంటూ.. తెగ చించేసుకుంటూ ట్విట్‌లు పెట్టడం ప్రారంభించారు.
Biden: “She was 12 I was 30.”
— Charles R Downs (@TheCharlesDowns) September 23, 2022
D.C. Crowd: haahahahahaha
And Democrats call Republicans brainwashed?
pic.twitter.com/wB2EKHREg6
(చదవండి: కదన రంగంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులు! షాక్‌లో ఉక్రెయిన్)
Comments
Please login to add a commentAdd a comment