Remark
-
ఆమెకు వంట మాత్రమే తెలుసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్‌లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?
ఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఉదయనిధిని విమర్శించే క్రమంలో ఇండియా కూటమి స్వభావం ఎంటో స్పష్టమవుతోందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని సీనియర్ నాయకుడు కేసీ వేణు గోపాల్ తెలిపారు. 'సర్వ ధర్మ సమభావన' అని పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. #WATCH | On DMK leader Udhayanidhi Stalin's 'Sanatana dharma' remark, Congress General Secretary KC Venugopal says, "Our view is clear; 'Sarva Dharma Samabhava' is the Congress' ideology. Every political party has the freedom to tell their views....We are respecting everybody's… pic.twitter.com/86Mg265PQT — ANI (@ANI) September 4, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదని స్పష్టం చేశారు. సమాన అవకాశాలు ఇవ్వని మతమేదైనా వ్యాధితో సమానమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఇండియా కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఆక్రమణదారుల దాడులను తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. ఇది దేశానికి పునాది అని మాట్లాడారు. అలాంటి ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పారు. హక్కుల కోసం పోరాడిన అలాంటి సనాతనీయులపై మహారాష్ట్రలో లాఠీ ఛార్జీ చేసిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. సనాతన నిర్మూలన పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 బీజేపీ మండిపాటు.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా ఉంది. ముంబయి వేదికగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండియా కూటమిపై బీజేపీ దాడి చేసింది. ముంబయి భేటీలో ఇదే నిర్ణయించారా? అని ప్రశ్నలు గుప్పించారు. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు. 'కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.' అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. 'సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? ' అని ప్రశ్నించారు. Udhayanidhi Stalin’s hate speech with Hindi subtitles. Rahul Gandhi speaks of ‘मोहब्बत की दुकान’ but Congress ally DMK’s scion talks about eradicating Sanatana Dharma. Congress’s silence is support for this genocidal call… I.N.D.I Alliance, true to its name, if given an… https://t.co/hfTVBBxHQ5 pic.twitter.com/ymMY04f983 — Amit Malviya (@amitmalviya) September 2, 2023 ఉదయనిధి స్టాలిన్ తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. బలహాన వర్గాల పక్షాన తాను మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు పేర్కొన్నారు. I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality. I stand firmly by every word I have spoken. I spoke… https://t.co/Q31uVNdZVb — Udhay (@Udhaystalin) September 2, 2023 'ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.' అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. Bring it on. I am ready to face any legal challenge. We will not be cowed down by such usual saffron threats. We, the followers of Periyar, Anna, and Kalaignar, would fight forever to uphold social justice and establish an egalitarian society under the able guidance of our… https://t.co/nSkevWgCdW — Udhay (@Udhaystalin) September 2, 2023 ఇదీ చదవండి: ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్ -
సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు..
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కించపరుస్తూ పోస్టులు చేసిన వ్యవహారంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూప్‌కు షాహబుద్ధీన్ అన్సారీ అనే వ్యక్తి అడ్మిన్‌గా ఉన్నాడు. ఆ గ్రూప్‌లో సీఎం యోగిని అవమానపరుస్తూ పోస్టూ చేశాడో వ్యక్తి. దీంతో గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం యోగిపై ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిందని.. ఈ అంశంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను అదుపులోకి తీసుకున్నామని కోత్వాలీ పోలీసు స్టేషన్ అధికారి కుమార్ సేత్ తెలిపారు. గ్రూప్ అడ్మిన్‌ను షాహబుద్ధీన్గా గుర్తించారు. పోస్టు చేసిన వ్యక్తిని ముస్లిం అన్సారీగా గుర్తించారు. అయితే.. సీఎం యోగికి కించపరుస్తూ పోస్టు చేసిన వ్యవహారంపై ఫిర్యాదులు అందిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాట్సాప్ గ్రూప్ పేరు 'నగర పాలిక పరిషత్ బదోనీ'గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బదోనీకి సంబంధించిన నగరపాలిక కార్పోరేటర్లు, స్థానికులు ఆ గ్రూప్‌లో ఉన్నారని వెల్లడించారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్యేశంతోనే ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇది కార్పోరేటర్లకు సంబంధించిన అధికారిక గ్రూప్ కాదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
'పాక్ వెళ్లిన అంజు ఘటనలో అంతర్జాతీయ కుట్ర కోణం'
భోపాల్: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు. ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు -
'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్
జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల ప్రవర్తన దిగ్బ్రాంతి చెందేలా ఉంది. లైంగిక వేధింపులతో మానసికంగా నలిగిపోయిన వారు నేరస్తులు కాదని, ఛాంపియన్ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇది చాలా అమానుషం, విచారకరం, సిగ్గుచేటు అంటూ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులు (బీజేపీ) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకపై బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఢిల్లీ పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తిన సంగతి తెలిసిందే. చంపాలనుకుంటే చంపేయండి..! ఈ నేపథ్యంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఉద్వేగభరితంగా మీడియా ముందు.. 'మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి' అంటూ మాట్లాడారు. ఈ రోజులు చూసేందుకేనా మేము పతకాలు గెలిచింది అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి మగవాడికి ఆడవాళ్లను తిట్టే హక్కు ఉందా!.. అని నిలదీశారు. తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపేయండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీకి చేరుకున్న డీసీడబ్ల్యూ చీఫ్: కాగా, ఈ మేరకు జంతర్‌మంతర్ వద్దకు వచ్చిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తనను నిరసన ప్రదేశంలోకి అనుమతించడం లేదని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి, మాలిక్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మాకు చెప్పారని అన్నారు. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయినా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ఢిల్లీ పోలీసులపై పైర్ అయ్యారు స్వాతి మలివాల్ . (చదవండి: శరద్ పవార్ ఆత్మకథ పుస్తకంలో ఆసక్తికర అంశం..మోదీకి అప్పుడే స్పష్టం చేశా!) -
సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు!..
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..) -
ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో కాంగ్రెస్ పార్టీ విభేదిస్తుందని తేల్చి చెప్పారు. తాము దిగ్విజయ్ సింగ్ అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని కరాఖండీగా చెప్పారు. తాను ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పారు. అయినా సాయుధ దళాలు ఒక పనిని చాల అనుహ్యంగా చేయగలవు, వారి సామర్థ్యం గురించి కూడా తనకు తెలుసనని అన్నారు. దీనికి ఆర్మీ ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విమర్శలు రావడంతో రాహుల్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా, దిగ్విజయ్ సింగ్ మాటిమాటికి సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇంతమందిని చంపాం అంటూ కేంద్రం కబుర్లు చెబుతోందే గానీ వాటికి ఆధారాలు చూపించలేకపోయిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో బీజేపీ పెద్ద ఎత్తున కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. రాహుల్ సూచన మేరకే దిగ్విజయ్ సింగ్ అలా విషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు చేసింది. ఆర్మీపై గట్టి విశ్వాసం ఉండాలని, అది రాజకీయాలకు అతీతమైనదంటూ తిట్టిపోసింది బీజేపి. అయినా పదేపదే సర్జికల్ స్ట్రైక్ గరించి పూఫ్ అడుగుతున్నారు, అసలు ఆర్మీపై మీకు నమ్మకమే లేదనేది స్పష్టమవుతోందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు. అయినా కాంగ్రెస్‌కి ఇలా భాద్యతరహితమైన ప్రకటనలు ఇవ్వడం పరిపాటిగా మారిందంటూ మండిపడ్డారు. భారత సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేదే లేదని గట్టి వార్నింగ్ ఇచ్చారు. రాహుల్, దిగ్విజయ్‌లకు నరేంద్ర మోదీ పట్ల ఉన్న ద్వేషం కళ్లకు కట్టినట్లు అర్థమవుతోందని బాటియా దుయ్యబట్టారు. (చదవండి: వాటికి ప్రూఫ్ ఏంటి?: దిగ్విజయ్ సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు) -
బాహాటంగా పోలీసు అధికారులపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బహిరంగా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరీ ఖాతాలను లెక్కిస్తా! అంటూ బెందిరింపులకు దిగారు. అంతేగాదు తాను ఎవ్వరిని వదిలిపెట్టను అని కూడా చెప్పారు. అందువల్ల ఎవ్వరూ కూడా తమ దూకుడుకి భయాందోళనలకు గురికావద్దని చెప్పాలనుకుంటున్నా అన్నారు. ఈ విషయాలను ముఖ్యంగా పోలీసు అధికారులందరూ చెవులు రిక్కరించి వినాలనే చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాజీ సీఎం కమల్‌నాథ్ తన అప్రజాస్వామిక ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ని మరోసారి చూపించుకున్నారంటూ విమర్శించారు. ఆయన ఇలా అధికారులను బెదిరింపులకు గురిచేయడం తొలిసారి కాదని, 2021లో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పూనావల్లా కాంగ్రెస్‌కి గట్టి కౌంటరిచ్చేలా.. ఆ పార్టీ ఎప్పుడూ ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను, బెదిరింపులు, ప్రతికార రాజకీయాలను విశ్వసిస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలో లేనప్పుడే.. పోలీసు అధికారులను, పరిపాలను బాహటం బెదిరింపులకు గురిచేస్తే..ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయినా ప్రేమతో ఓటర్లను ఆకర్షించాలి గానీ బెదిరింపులతో కాదని కమల్‌నాథ్‌కి సూచించారు. అంతేగాదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రకటనలకు మద్ధతిస్తుందా? లేదా ఖండిస్తుందా? అనే విషయం గురించి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. (చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..) -
ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యల దుమారం... ఏక్నాథ్ షిండ్‌పై విమర్శలు
ముంబై: ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలా ఎలా చూస్తూ... కూర్చొన్నారంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. గవర్నర్ భగత్ సింగ్‌ని తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కూడా రాజీనామ చేయాలంటూ డిమాండ్ చేశారు. గవర్నర్ భగత్ సింగ్ ఈ ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ నినాదం ఇచ్చి మరీ శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు ప్రస్తుతం ఆ ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు. ఇంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా శివాజీ మహారాజ్ ఔరంగజేబుకు ఐదు సార్లు క్షమాపణలు చెప్పారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు మహారాష్ట్రకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే గవర్నర్‌ని తొలగించాలి అని ఒత్తిడి చేశారు . తాము కాంగ్రెస్ నాయకుడు రాహల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించి తమ పార్టీ నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ బహిరంగంగానే శివాజీ మహారాజ్‌ని పలుమార్లు విమర్మించిందన్నారు. కాబట్టి షిండే రాజీనామ చేయాలని, బీజేపీతో కలిసి ప్రభుత్వంలో కొనసాగకూడదంటూ సీరియస్ అయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.... శివాజీ మహారాజ్ పాత విగ్రహాలు అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉద్ధవ ఠాక్రే వర్గానికి చెందిన వ్యక్తులకు గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు మింగుడుపడం లేదు. దీంతో గవర్నర్ గొప్ప గొప్ప వ్యక్తులను అగౌరవపరిచే వ్యక్తి అంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. రాహుల్ వీర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ బూట్లతో దాడి చేస్తోంది. మరీ ఇప్పుడూ గవర్నర్ చేసిన పనికి రాజ్‌భన్‌పైకి చెప్పులతో వెళ్లాలంటూ మండిపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలు ప్రకారం కృష్ణుడు, రాముడు పాత్ర విగ్రహాలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అలాగే శివసేన పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే ఛత్రపతి శివాజీ మహారాజ్ మా ఆరాధ్యదైవం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికి ఆదర్శప్రాయుడని అన్నారు. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
వెనక్కి తగ్గేదేలే! రాజీపడం అంటున్న తైవాన్.... చైనాకి స్ట్రాంగ్ వార్నింగ్
తైపీ: బీజింగ్‌లో ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై బలప్రయోగాన్ని ఎప్పటికి వదులుకోమని కరాఖండిగా చెప్పారు. అలాగే హాంకాంగ్‌పై పట్టు సాధించి నియంత్రణలోకి తెచ్చుకున్నామని తర్వాత తైవానే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తైవాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. తన సార్వభౌమాధికారం, స్వేచ్ఛపై రాజీపడేదే లేదని, వెనక్కి తగ్గమని తెగేసీ చెప్పింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని కాపాడుకోవటం ఇరుపక్షాల భాద్యత అని నొక్కిచెప్పింది. యుద్ధం ఒక్కటే ఆప్షన్ కాదని తేల్చి చెప్పింది. తైవాన్‌లో సుమారు 23 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారని, వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. అలాగే తాము బీజింగ్ ఏకపక్ష నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెగేసి చెప్పింది. వాస్తవానికి 2016లో ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ తొలిసారిగా ఎన్నికైనప్పటి నుంచి చైనాతో ఉన్న సంబంధాలను కట్టడి చేసింది. రాజీకీయాలతో దిగ్బంధం చేసి సైనిక బలగాలతో బలవంతంగా అధీనంలోకి తెచ్చుకోవాలనే కుట్రలను విడిచిపెట్టాలని చైనీస్ కమ్యూనిస్ట్ అధికారులకు పిలుపినిచ్చింది తైవాన్. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్ విషయంలో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయని, తైవాన్‌ని స్వతంత్ర దేశంలా ఉంచే క్రమంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ ఆరోపణలు చేశారు. పైగా శాంతియుత పునరేకీకరణ కోసం ప్రయత్నిస్తాం కానీ యుద్ధం చేయమని హామీ ఇవ్వం అని చెప్పారు. (చదవండి: హాంకాంగ్‌పై నియంత్రణ సాధించాం.. తర్వాత తైవానే.. జిన్‌పింగ్ కీలక ప్రకటన) -
నాకు 30 ఆమెకు 12 అంటూ..షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఈ మేరకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్ అమెరికాలో అతిపెద్ద టీచర్స్ యూనియన్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌లో ప్రసంగిస్తూ....తన స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వయసుకి సంబంధించి చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించడంతో...అక్కడ ఉన్న ఉపాధ్యాయ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా బైడెన్ వ్యాఖ్యలను తిలకించ సాగారు. ఇంతలో బైడెన్ అక్కడ ఉన్న ఒక మహిళ ఉపాధ్యాయురాలిని చూస్తూ...తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడూ 12 ఏళ్ల బాలికతో స్నేహం చేశానని చెప్పారు. వయసు భేదం ఉన్నప్పటికీ ఆమె నాకు చాలా పనుల్లో సహయం చేసింది అన్నారు. అంతే ఆ సమావేశంలో ఒక్కసారిగా అందరి ముఖాలపై నవ్వులు విరబూశాయి. అతేకాదు ఆ సమావేశంలో రిపబ్లికన్ అబార్షన్ నిషేధం బిల్లు గురించి ప్రస్తావించారు. పైగా ఆ బిల్లు తన వద్దకు వస్తే వీటో చేస్తానని హామీ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ బిల్లు విషయంలో ఆశా, ఐక్యత, ఆశావాదం, విభజన, భయం, చీకటి వంటి వాటికి సంబంధించినసరైన ఎంపికగా అభివర్ణించారు. అలాగే అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతి పట్ల కూడా మాటల దాడి చేశారు. ఐతే ఆయన తన ప్రసంగం ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. తనకు 30 ఆమెకు 12 అంటే ఎవరామె అంటూ ఆసక్తకర చర్చ సాగింది. దీంతో కొంత మంది వినియోగదారులు 30 అంటే బైడెన్ గురువు అని 12 అంటే బైడెన్ వయసు అయ్యి ఉంటుందని ఒకరు, మరోకరేమో! ఏమైంటుందా అంటూ.. తెగ చించేసుకుంటూ ట్విట్లు పెట్టడం ప్రారంభించారు. Biden: “She was 12 I was 30.” D.C. Crowd: haahahahahaha And Democrats call Republicans brainwashed? pic.twitter.com/wB2EKHREg6 — Charles R Downs (@TheCharlesDowns) September 23, 2022 (చదవండి: కదన రంగంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులు! షాక్‌లో ఉక్రెయిన్) -
పుతిన్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పను: బైడెన్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండటానికి తగరంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై తన ఆక్రోశాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబించాయన్నారు. అందుకు క్షమాపణ చెప్పడం గానీ, వాటిని వెనక్కు తీసుకోవడం గానీ చేయబోనన్నారు. రష్యాలో తానేమీ నాయకత్వ మార్పు కోరడం లేదనిస్పష్టం చేశారు. అది అమెరికా విధానం కాదన్నారు. ‘ఉక్రెయిన్‌పై మతిలేని యుద్ధంతో పుతిన్ ఇప్పటికే ప్రపంచమంతటా అంటరాని వ్యక్తిగా మారారు. స్వదేశంలో ఆయన పరిస్థితి ఏం కానుందో! చెడ్డ వ్యక్తులు చెడు పనులు చేయడాన్ని అనుమతించొద్దు. నా వ్యాఖ్యలను ఆ ఉద్దేశంతోనే చూడాలి. అంతే తప్ప పుతిన్‌ను తప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్నది నా వ్యాఖ్యల ఉద్దేశం కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు!
న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు స్థానిక కోర్టు సమన్లు పంపింది. పది నెల్లక్రితం పోలీసులను ఉద్దేశించి ఆయన వాడిన అభ్యంతరకర పదాలపై ఇద్దరు పోలీసులు కోర్టుకు ఫిర్యాదు చేయడంతో విచారించిన కోర్టు కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. గతంలో ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ పోలీసులను ''తుల్లా'' గా పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళు కోర్టుకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో టెలివిజన్ ఇంటర్వ్యూ ప్రసారం అనంతరం పోలీసులను ఉద్దేశించి కేజ్రీవాల్ వాడిన పదంపై నగరంలోని రెండు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వడంతోపాటు, కోర్టులో పరువునష్టం దావా కూడ వేశారు. ఈ కేసు నగరంలోని అనేకమంది సీనియర్ పోలీసు అధికారులను కూడ ఆకర్షించింది. ఇద్దరు ఢిల్లీ కానిస్టేబుళ్ళ ఫిర్యాదు మేరకు గత జూలై 14న కేజ్రీవాల్ స్వయంగా కోర్టు హాజరు కావాల్సి వచ్చింది. సీఎం కేజ్రీవాల్ వాడిన పదం ఒక్క పోలీసులను మాత్రమే కాదని, ఢిల్లీ పౌరుల పరువుకు కూడ భంగం కలిగించడమేనంటూ కానిస్టేబుళ్ళు కపూర్ సింగ్ ఛికారా, హర్వీందర్ సింగ్ లు తమ ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే కేజ్రీవాల్, ఆప్ సభ్యులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. గత డిసెంబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కోవార్డ్, సైకోపాత్ అంటూ ట్వీట్ చేసి వివిధ వర్గాలనుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడ ఎదుర్కొన్నారు.