మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బహిరంగా ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, అందరీ ఖాతాలను లెక్కిస్తా! అంటూ బెందిరింపులకు దిగారు. అంతేగాదు తాను ఎవ్వరిని వదిలిపెట్టను అని కూడా చెప్పారు. అందువల్ల ఎవ్వరూ కూడా తమ దూకుడుకి భయాందోళనలకు గురికావద్దని చెప్పాలనుకుంటున్నా అన్నారు. ఈ విషయాలను ముఖ్యంగా పోలీసు అధికారులందరూ చెవులు రిక్కరించి వినాలనే చెబుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో భారతీయ జనతా పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావల్లా మాజీ సీఎం కమల్‌నాథ్ తన అప్రజాస్వామిక ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ని మరోసారి చూపించుకున్నారంటూ విమర్శించారు. ఆయన ఇలా అధికారులను బెదిరింపులకు గురిచేయడం తొలిసారి కాదని, 2021లో కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. పూనావల్లా కాంగ్రెస్‌కి గట్టి కౌంటరిచ్చేలా.. ఆ పార్టీ ఎప్పుడూ ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌ను, బెదిరింపులు, ప్రతికార రాజకీయాలను విశ్వసిస్తుందని ఎద్దేవా చేశారు.
ఆయన అధికారంలో లేనప్పుడే.. పోలీసు అధికారులను, పరిపాలను బాహటం బెదిరింపులకు గురిచేస్తే..ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయినా ప్రేమతో ఓటర్లను ఆకర్షించాలి గానీ బెదిరింపులతో కాదని కమల్‌నాథ్‌కి సూచించారు. అంతేగాదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రకటనలకు మద్ధతిస్తుందా? లేదా ఖండిస్తుందా? అనే విషయం గురించి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
(చదవండి: మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. అందుకే ఆమె నోరుమెదపరు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..)
Comments
Please login to add a commentAdd a comment