
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌నాథ్ పార్టీని వీడనున్నట్టు సమాచారం. ఆయన కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కొద్ది రోజులుగా ఈ కథనాలు వెలువడుతున్నప్పటికీ తాజాగా.. నకుల్ నాథ్ తన ట్వీటర్ బయో నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు.
దీంతో తండ్రీ, కుమారులిద్దరూ బీజేపీలోకి వెళ్లడం దాదాపు ఖాయమైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం పార్లమెంటు ఎన్నికలకు ముందు ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడటంతో దీంతో ఆ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో మధ్య ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంక మధ్య విబేధాలు? బీజేపీ సందేహం వెనుక ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment