లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. దానికి నేటి నుంచే శ్రీకారం పడేలా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ నష్టం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్ ఆదివారం (ఫిబ్రవరి 18) బీజేపీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి.
కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేసే కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కమల్ నాథ్ ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కమల్‌నాథ్‌కు కంచుకోటగా పేరుగాంచిన చింద్వారాలో ఇది జరిగింది. నకుల్‌నాథ్ గట్టిపోటీ ఎదుర్కొన్నాక విజయం సాధించారు. కమల్‌నాథ్ తొమ్మిది సార్లు ఎంపీగా పని చేశారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment