వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండటానికి తగరంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై తన ఆక్రోశాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబించాయన్నారు. అందుకు క్షమాపణ చెప్పడం గానీ, వాటిని వెనక్కు తీసుకోవడం గానీ చేయబోనన్నారు. రష్యాలో తానేమీ నాయకత్వ మార్పు కోరడం లేదనిస్పష్టం చేశారు.
అది అమెరికా విధానం కాదన్నారు. ‘ఉక్రెయిన్‌పై మతిలేని యుద్ధంతో పుతిన్ ఇప్పటికే ప్రపంచమంతటా అంటరాని వ్యక్తిగా మారారు. స్వదేశంలో ఆయన పరిస్థితి ఏం కానుందో! చెడ్డ వ్యక్తులు చెడు పనులు చేయడాన్ని అనుమతించొద్దు. నా వ్యాఖ్యలను ఆ ఉద్దేశంతోనే చూడాలి. అంతే తప్ప పుతిన్‌ను తప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్నది నా వ్యాఖ్యల ఉద్దేశం కాదు’ అంటూ వివరణ ఇచ్చారు.
(చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన)
Comments
Please login to add a commentAdd a comment