appologies
-
క్రిక్‌పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి
క్రిక్‌పే లాంచ్ ఆలస్యం అయినందుకు ఆ యాప్ అధినేత, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ క్షమాపణలు కోరారు. తన తండ్రి ఆకస్మిక మరణం కారణంగా క్రిక్‌పే లాంచ్ ఆలస్యమతోందన్నారు. ఈ మేరకు మార్చి 31న ట్వీట్ చేశారు. (CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించలేకపోయామని అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఐపీఎల్ ప్రారంభ వారంలో క్రిక్‌పే యాప్ అందుబాటులోకి రాకపోయినప్పటికీ ఏప్రిల్ 3 నుంచి ఎటువంటి అవాంతరాలు లేకుండా క్రిక్‌పే యాప్ పూర్తిస్థాయిలో నడుస్తుందని హామీ ఇచ్చారు. (ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..) అష్నీర్ గ్రోవర్ తండ్రి అశోక్ గ్రోవర్ మార్చి 29న 69 సంవత్సరాల వయసులో మృతి చెందారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే అష్నీర్ గ్రోవర్ సరికొత్త క్రికెట్ ఫాంటసీ స్పోర్ట్స్ యాప్ క్రిక్‌పేని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 23న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ డౌన్లోడ్ లింక్‌లను కూడా తన ట్విటర్లో షేర్ చేశారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) Sorry. In this week leading to CrickPe app launch I lost my dad. Tough decision was to abort launch or go ahead with IPL nevertheless. I promise the app will be without glitches by Monday. I failed - not making any excuses.@crickpe_app — Ashneer Grover (@Ashneer_Grover) March 31, 2023 -
ధమాకా వివాదం: క్షమాపణలు కోరిన డైరెక్టర్ త్రినాథ్ నక్కిన
‘ధమకా’ మూవీ వివాదంపై తాజాగా డైరెక్టర్ త్రినాథ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పర కులస్థులను క్షమాపణలు కోరారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 22) జరిగిన ధమాకా మూవీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో నేను ఉప్పర అనే పదం వాడాను. అది తెలిసి చేయలేదు. తెలియక జరిగిన తప్పుకు ఉప్పర సోదరులకు నన్ను క్షమించాలి. రవితేజ అభిమానుల్లో ఉప్పర సోదరుడు కూడా భాగమే. ఇక నుంచి ఉప్పార అనే పదాన్ని నా సినిమాల్లో వాడను. నాపై కోపాన్ని సినిమాపై చూపించకండి. నేను బీసీనే. ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమే. సినిమా ప్రేక్షకుల్లో మీరు కూడా భాగమే. ఇకపై ఉప్పర పదాన్ని రాజకీయ నాయకుల, సినీ నటులు, ఇతరులు కూడా బహిష్కరించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అని వ్యాఖ్యానించారు. దీంతో తమని ధమాకా డైరెక్టర్ తమని అవమానించారంటూ ఉప్పర కులస్తుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే డైరెక్టర్ త్రినాథ్ తమకు వెంటనే క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. ఆయన దిష్టి బొమ్మ తగలబెట్టి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. -
క్షమాపణలు కోరిన బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్
న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్ ఇలా అన్నారు. " మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్ అనంతరం యూకే వీసాలకు డిమాండ్ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్ మరింత ఎక్కువైందని చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు. యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. A lot of you have been in touch about visa delays; many apologies, as I know this is causing a lot of problems. Here’s what we’re doing, and what you can do. pic.twitter.com/QJm7HceDq6 — Alex Ellis (@AlexWEllis) August 12, 2022 (చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్!) -
పుతిన్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పను: బైడెన్
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండటానికి తగరంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్‌లో పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై తన ఆక్రోశాన్ని ఆ వ్యాఖ్యలు ప్రతిబింబించాయన్నారు. అందుకు క్షమాపణ చెప్పడం గానీ, వాటిని వెనక్కు తీసుకోవడం గానీ చేయబోనన్నారు. రష్యాలో తానేమీ నాయకత్వ మార్పు కోరడం లేదనిస్పష్టం చేశారు. అది అమెరికా విధానం కాదన్నారు. ‘ఉక్రెయిన్‌పై మతిలేని యుద్ధంతో పుతిన్ ఇప్పటికే ప్రపంచమంతటా అంటరాని వ్యక్తిగా మారారు. స్వదేశంలో ఆయన పరిస్థితి ఏం కానుందో! చెడ్డ వ్యక్తులు చెడు పనులు చేయడాన్ని అనుమతించొద్దు. నా వ్యాఖ్యలను ఆ ఉద్దేశంతోనే చూడాలి. అంతే తప్ప పుతిన్‌ను తప్పించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందన్నది నా వ్యాఖ్యల ఉద్దేశం కాదు’ అంటూ వివరణ ఇచ్చారు. (చదవండి: పుతిన్ ధీమా... జెలెన్ స్కీ అభ్యర్థన) -
సుశాంత్ తండ్రి రెండో పెళ్లిపై రౌత్ వ్యాఖ్యల రగడ
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆయన తండ్రితో సత్సంబంధాలు లేవని, తండ్రి రెండో వివాహం చేసుకోవడం పట్ల సుశాంత్ సంతోషంగా లేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రౌత్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సుశాంత్ సోదరుడు నీరజ్ బబ్లూ డిమాండ్ చేశారు. సుశాంత్ తండ్రి రెండో వివాహంపై సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, రౌత్ బహిరంగ క్షమాపణలు కోరనిపక్షంలో తాము ఆయనపై న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న రౌత్ సుశాంత్ తన తండ్రి కేకే సింగ్‌తో సరైన సంబంధాలు లేవని ఇటీవల పేర్కొన్నారు. సుశాంత్ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారని ఆయన ప్రశ్నించారు. సుశాంత్ మృతిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ముంబై పోలీసుల నుంచి దర్యాప్తును ఎందుకు హడావిడిగా తప్పిస్తున్నారని రౌత్ అన్నారు. ముంబైలో ఘటన జరిగితే సుశాంత్ మృతిపై పట్నాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సుశాంత్ విషాదాంతం చోటుచేసుకున్న 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. కాగా సుశాంత్‌కు తన తండ్రితో సరైన సంబంధాలు లేవని రౌత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ తోసిపుచ్చారు. సుశాంత్ కుటుంబం గురించి శివసేన ఎంపీ చవకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. సున్నితమైన ఈ అంశం పట్ల శివసేన వైఖరి సవ్యంగా లేదని అన్నారు. మరోవైపు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిని మనీల్యాండరింగ్‌కు సంబంధించి సోమవారం మరో విడత ప్రశ్నించారు. రియా మాజీ మేనజర్ శ్రుతి మోదీని సైతం ఈడీ మరోసారి ప్రశ్నించనుంది. చదవండి : ఈడీ కార్యాలయానికి రియా -
రాహుల్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ హై(మోదీ దొంగ) అని సుప్రీంకోర్టు చెప్పిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టు ముందు 3 పేజీల అఫిడవిట్‌ను దాఖలుచేశారు. తనకు సుప్రీంకోర్టుపై చాలా గౌరవముందని వ్యాఖ్యానించారు. తాను చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా సుప్రీం తీర్పునకు ఆపాదించలేదనీ, అది అనుకోకుండా జరిగిందన్నారు. తనపై క్రిమినల్ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. రఫేల్ ఒప్పందం విషయంలో పిటిషనర్లు సాక్ష్యాలుగా సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు 2019, ఏప్రిల్ 10న తెలిపింది. ఈ నేపథ్యంలో అమేథీలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్ చోర్’ అని సుప్రీంకోర్టు కూడా తేల్చిందని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలను సుప్రీం తీర్పుకు ఆపాదించారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ విచారణను కొట్టేయండి.. ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్ తరఫున వాదిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుకు తన అభిప్రాయాన్ని ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నారు. అనుకోకుండా ఆ వ్యాఖ్యలను చేశాననీ, ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ అఫిడవిట్‌ను న్యాయస్థానం అంగీకరించి, తనపై జరుగుతున్న క్రిమినల్ ధిక్కార విచారణను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు’ అని తెలిపారు. బీజేపీ మీనాక్షి లేఖి పిటిషన్‌పై గతంలో రాహుల్ క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు అఫిడవిట్లు దాఖలుచేశారు. -
మీకోసమే వచ్చారు.. కృతజ్ఞతలు తెలపండి!
ఇండోర్: అసలే కుమార్తెపై అఘాయిత్యంతో కుమిలిపోతున్న తల్లిదండ్రులతో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అమానవీయంగా ప్రవర్తించారు. ‘మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన ఎంపీకి కృతజ్ఞతలు తెలపండి’ అంటూ తీవ్రమైన బాధలో ఉన్న కుటుంబసభ్యుల్ని ఆదేశించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మంద్‌సౌర్‌లో జూన్ 26న ఓ మైనర్ బాలిక(8)పై ఇద్దరు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ప్రస్తుతం ఇండోర్ ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తా, మంద్సౌర్ ఎంపీ సుధీర్‌తో కలసి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అత్యుత్సాహం చూపిన ఎమ్మెల్యే సుదర్శన్.. ‘ఎంపీ సుధీర్‌కు కృతజ్ఞతలు తెలపండి. ఆయన మిమ్మల్ని కలుసుకునేందుకే ప్రత్యేకంగా ఆస్పత్రికి వచ్చారు’ అని చెప్పారు. దీంతో తెల్లబోయిన బాధితురాలి తల్లిదండ్రులు ఇద్దరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇంతలో మీడియాను గమనించిన సుదర్శన్.. ‘ఇంకేమైనా అవసరముంటే చెప్పండి’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బాధితురాలి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. మరోవైపు మైనర్ బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. -
అభిమాన ఆటకు చేటు చేశామని వేదన..
బాల్ ట్యాంపరింగ్ ఘటనతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కుదుపునకు లోనైతే... అందుకు పాల్పడి శిక్షకు గురైన ఆటగాళ్లు తీవ్ర మనో వ్యథకు గురవుతున్నారు. తమది ఎంత పెద్ద తప్పో, తమను ఇంతవారిని చేసిన ఆటకు చేసిన చేటేమిటో తలచుకుని కుమిలిపోతున్నారు. సస్పెన్షన్ కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లు గురువారం మీడియాతో మాట్లాడారు. దక్షిణాఫ్రికా నుంచి సిడ్నీ చేరుకున్న స్మిత్ విమానాశ్రయంలోనే మీడియా సమావేశం నిర్వహించాడు. ఓ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చాడు. అబద్ధమాడాను... ట్యాంపరింగ్‌కు వాడిన వస్తువు విషయంలో నేను అబద్ధమాడాను. ఆస్ట్రేలియన్లంతా తలదించుకునేలా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరడం ఒక్కటే ఇప్పుడు చేయగలను. శాండ్ పేపర్‌తో బంతి ఆకారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాను. అయితే అంపైర్లు, మీడియాతో దానిని పసుపు రంగు టేపుగా చెప్పాను. విచారణ తర్వాత అసలు విషయం తేలింది. భవిష్యత్‌లోనూ నేను చింతించే అంశం ఇది. ఈ ఘటన నా హృదయాన్ని చాలా బాధించింది. జట్టులో స్థానాన్ని చేజేతులా పోగొట్టుకున్నా. గతంలో ఎన్నడూ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదు. వ్యక్తిగా, ఆటగాడిగా నమ్మిన విలువల విషయంలో రాజీ పడ్డాను. అన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ, క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తూ పాల్పడిన ఈ చర్య క్రికెట్ ఎలా ఆడకూడదో చెప్పేందుకు ఓ ఉదాహరణ. కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి పొందడం కష్టమే అయినా అది నాకు చాలా ముఖ్యం. నిషేధంలో భాగమైన స్వచ్ఛంద సేవ ద్వారా సమాజానికి ఎంతో కొంత చేస్తాను. నేను కూడా... ► రాజీనామా ప్రకటించిన లీమన్ ► స్మిత్ భావోద్వేగ ప్రసంగమే కారణం ► హెడ్ కోచ్ పదవికి గుడ్‌బై జొహన్నెస్‌బర్గ్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఆటగాళ్ల నిషేధం తర్వాత ఇప్పుడు కోచ్ వంతు! క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నివేదిక ప్రకారం తన తప్పేమీ లేదని తేలినా... జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గురువారం లీమన్ ప్రకటించాడు. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టు కోచ్‌గా తనకు చివరిదని అతను వెల్లడించాడు. వివాదంలో తన గురించి వినిపించిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందానన్న లీమన్... ఉదయం స్మిత్ భావోద్వేగ ప్రసంగం కూడా తన రాజీనామాకు కారణమని వెల్లడించాడు. ‘గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, తీవ్రమైన పదజాలంతో మమ్మల్ని ద్వేషిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక కొనసాగడం కష్టమనిపించింది. నేను, నా వాళ్లు ఎంతో భరించాం. వివాదంలో నాకు భాగం లేదని మరోసారి చెబుతున్నాను. సంవత్సరంలో నేను 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు నా వాళ్లతో సమయం గడిపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. గత ఐదు రోజులుగా మేమెవ్వరం సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో, మనసులో ఎంతో సంఘర్షణతో ఆటతో అనుబంధం కొనసాగించలేం’ అని లీమన్ వ్యాఖ్యానించాడు. తన నిర్ణయం జట్టుకు కూడా ఉపయోగపడుతుందని, అన్నీ మరచి కొత్త ఆరంభంతో ముందుకు వెళ్లేందుకు అది అవసరమని లీమన్ ఉద్వేగంగా చెప్పాడు. ‘ఇద్దరు యువ ఆటగాళ్లు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తీరు అసాధారణం. స్మిత్ ఏడవడం చూస్తే నాకు చాలా బాధ వేసింది. మంచివాళ్లు కూడా తప్పులు చేస్తారు’ అని లీమన్ అన్నాడు. తాను రాజీనామా చేయడం లేదని ఇంతకు ముందే ప్రకటించినా... స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లను చూసిన తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు అతను స్పష్టం చేశాడు. ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియా కోచ్‌గా లీమన్ బాధ్యతలు చేపట్టాడు. మళ్లీ మాట్లాడతా... చిన్నతనం నుంచి నేను అభిమానించిన క్రీడపై మచ్చపడేలా చేసినందుకు దేశంలోని, ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికి క్షమాపణలు కోరుతున్నాను. ఇది నా భార్య, పిల్లలకు తీవ్ర భావోద్వేగ సమయం. ఇప్పుడు నా ప్రాధాన్యం నా పిల్లలను నిద్ర పుచ్చడమే. మనసు కొంత స్థిమితపడ్డాక రెండు రోజుల్లో మళ్లీ మాట్లాడతాను. ఏడాది నిషేధ సమయాన్ని కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో గడపాలని అనుకుంటున్నా. కుటుంబంతో వార్నర్ పూర్తి బాధ్యత నాదే... ట్యాంపరింగ్ ఘటన నా నాయకత్వ వైఫల్యమే. అందుకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఇతరులెవరినీ నిందించలేను. చేసిన తప్పునకు పర్యవసానాలను ఎదుర్కొంటున్నాను. గొప్ప వ్యక్తులు కూడా తప్పులు చేస్తారు. ఇలా చేసేందుకు అనుమతించడం నా నిర్ణయ లోపం. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. భవిష్యత్‌లో జరగదని హామీ ఇస్తున్నాను. ఇది జీవితాంతం చింతించాల్సిన విషయం. అందరికీ పాఠం. కానీ నష్టం భర్తీకి చేయగలిగినంత చేస్తా. ఓ మార్పునకు నేనో కారణం కావొచ్చు. కాలంపై ఆశగా ఉన్నా. కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలనన్న నమ్మకం ఉంది. ప్రపంచంలోనే క్రికెట్ గొప్ప క్రీడ. ఇది నా జీవితం. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా ఉన్నత స్థితి, గౌరవం పొందా. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నా. ఓ నిర్ణయం తీసుకునేటపుడు దాని ప్రభావం ఎవరిపై ఉంటుందో ఆలోచించాలి. అది తల్లిదండ్రులనూ ఇబ్బంది పెట్టొచ్చు. వృద్ధాప్యంలోని నా తండ్రి బాధను చూడండి. నా చర్యతో అమ్మ కూడా బాధపడుతోంది. అందరి మనసులను తీవ్రంగా గాయపర్చినందుకు ఆస్ట్రేలియా ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను. -
ఐ యామ్ వెరీ సారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు. సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. ‘మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు’ అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు. మూడు పోయి.. మరో 30 ఉన్నాయి కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌లకు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలీ దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడే అనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చాననీ, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు. -
మోదీ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ‘పాకిస్తాన్‌తో కలిసి కుట్ర’ చేశారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చేసిన ఆరోపణ లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపచేశాయి. సభ సాధారణ కార్యకలాపాలను రద్దుచేసి ప్రధాని చేసిన ఆరోపణలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరిం చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. రాజ్యసభ మొత్తం మూడు సార్లు వాయిదాపడగా.. సాయంత్రం 3 గంటల సమయంలో ప్రతిపక్షాల నిరసనల మధ్య సభను రోజంతటికీ వాయిదా వేశారు. ఇటీవల మృతిచెందిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించాక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభలో.. ప్రశ్నోత్తరాలకోసం సభ మధ్యాహ్నం సమావే శం కాగానే.. మన్మోహన్పై మోదీ ఆరోపణల్ని ప్రతిపక్ష నేత ఆజాద్ లేవనెత్తారు. ఈ అంశం తీవ్రమైనదని, సభా కార్యకలాపాల్ని రద్దు చేసి తామిచ్చిన నోటీసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ‘మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతిపై ఆరోపణలు చేశారు. పాక్‌తో కలిసి కుట్ర చేశారని పలువురు విదేశీ కార్యదర్శులు, హై కమిషనర్లు, రాయబారులపై గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. దీంతో విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం మధ్య సభను చైర్మన్ 2.30 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆజాద్ మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అనంతరం సభను కురియన్ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక ప్రధాని క్షమాపణకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించడంతో సభ రోజంతటికీ వాయిదా పడింది. శరద్, అన్వర్ల అనర్హతపై నిరసన ఉదయం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికి.. జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ నేత అలీ అన్వర్ల్ని రాజ్యసభ సభ్యులుగా అనర్హులుగా ప్రకటిస్తూ చైర్మన్ వెంకయ్య ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయగా.. అధికార పక్ష సభ్యులు అదే స్థాయిలో నినాదాలు చేశారు. చైర్మన్ నిర్ణయంపై ఎలాంటి చర్చకు అనుమతించనని సభాపతి స్పష్టం చేశారు. ‘రెండు వైపులా సభ్యులు నిలబడి ఉన్నారు. ఇది పద్దతి కాదు. మొదటి రోజు ఇలా జరగడాన్ని మీరు కోరుకుంటున్నారా? వెల్‌లోకి దూసుకొచ్చే ప్రవర్తనను నేను ఒప్పుకోను’ అని ఒక దశలో చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభలో ఇటీవల మరణించిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యుల మృతికి సంతాపం అనంతరం సభ సోమవారానికి వాయిదాపడింది. ‘ఐ బెగ్’ వాడకండి: వెంకయ్య శీతాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభనుద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. మనది స్వతంత్ర దేశమని, ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి మాటలను సభలో వాడుతున్నారని, వాటిని మానేయాలని మంత్రులు, సభ్యులను కోరారు. సభ్యులు తాము ప్రస్తావించదలచుకున్న అంశాలను వివరించే క్రమంలో ఆర్థించు అనే అర్థం వచ్చేలా ఉన్న( ఐ బెగ్ టు) మాటను ఉపయోగించవద్దని కోరారు. ఇది పరాయి పాలనను స్ఫురణకు తెస్తోందన్నారు. సభ్యులు ఆర్థించు బదులుగా ‘నేను ఈ రోజు ప్రస్తావించదలచిన అంశాలివి’ అని మాత్రం చెబితే చాలని వివరించారు. తొలిసారిగా పార్లమెంట్‌కు అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అమిత్ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన ఆయన శీతాకాల సమావేశాల తొలిరోజు సభకు హాజరై అధికార పక్షం వైపు తొలి వరుసలో కూర్చున్నారు. సమావేశాలు ఫలవంతంగా సాగుతాయి: ప్రధాని నిర్మాణాత్మక చర్చలు, సరికొత్త ఆలోచనలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాలు ఫలవంతం అవుతాయని నమ్మకముంది. చర్చతో పాటు, దేశ సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. రాజ్యసభలో అమిత్ షా, నడ్డా, జవదేకర్ తదితరులు -
సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళాలోకం
సినిమా షూటింగ్ అయిన తర్వాత తమ పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉంటుందన్న సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది. అతడు ఎందుకలా అన్నాడో చెప్పాలంటూ ఒక లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమారమంగళం తెలిపారు. క్షమాపణ చెప్పడానికి అతడికి వారం రోజుల గడువు ఇచ్చామని, లేనిపక్షంలో అతడిని కమిషన్ కు పిలిపిస్తామని చెప్పారు. కేవలం హీరో అయినంత మాత్రాన ఎలాగైనా మాట్లాడొచ్చనుకుంటే కుదరదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్) కాగా, ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, కేవలం సల్మాన్ ఖాన్ మహిళా అభిమానులకు మాత్రమే సంబంధించినది కాదని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, బీజేపీ నాయకురాలు షైనా ఎన్.సి. అన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఆయన లాజిక్ ఏదైనా.. సల్మాన్ మాత్రం క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. ఆయన నోరు జారడం తగదని మండిపడ్డారు. -
ఓ తండ్రికి ఫేస్బుక్ క్షమాపణలు!
ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఓ తండ్రికి క్షమాపణలు చెప్పింది. రెండు నెలల వయసున్న తన కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ప్రజల నుంచి విరాళాలు కోరుతూ ఒక ప్రకటన ఇస్తానంటే.. ఫేస్బుక్ తొలుత నిరాకరించింది. హడ్సన్ బాండ్ అనే ఆ బాలుడికి పుట్టుకతోనే కార్డియోమయోపతి అనే సమస్య వచ్చింది. దాని చికిత్సకు దాదాపు 45 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తం సేకరించడానికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న తన కొడుకు ఫొటోతో ఒక ప్రకటన ఇవ్వాలని బాండ్ తల్లిదండ్రులు ఫేస్‌బుక్‌ను కోరారు. అయితే ఆ ఫొటో బాగా భయపెట్టేలా, రక్తసిక్తంగా ఉందని, దానివల్ల ప్రతికూల స్పందనలు వస్తాయంటూ ప్రకటన ఇవ్వడానికి ఫేస్బుక్ నిరాకరించింది. ప్రమాదాలు, కారు ఢీకొన్నవి, మృతుల ఫొటోలు, బాగా పాడైన శవాలు, దెయ్యాలు, రక్తపిశాచుల ఫొటోలను తమ సైట్లో ప్రచురించడానికి అంగీకరించేది లేదని కూడా ఆ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మొత్తానికి అసలు విషయం తెలుసుకుని, బాండ్ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి.. ఆ ఫొటోను పోస్ట్ చేయడానికి అంగీకరించింది. తమకు కలిగిన అసౌకర్యానికి ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారని బాలుడి తండ్రి కెవిన్ బాండ్ తెలిపారు. ఇప్పటివరకు ఆ ప్రకటన ద్వారా రూ. 18,25,350 విరాళాలు వచ్చాయి. బాండ్ పేరిట రిస్ట్ బ్యాండ్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఐదేసి డాలర్ల చొప్పున పెట్టి.. ఈ విరాళాలు సేకరిస్తున్నారు.