సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళాలోకం | women commission gives one week time to salman to appologise | Sakshi
Sakshi News home page

సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళాలోకం

Published Tue, Jun 21 2016 12:14 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళాలోకం - Sakshi

సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళాలోకం

సినిమా షూటింగ్ అయిన తర్వాత తమ పరిస్థితి రేప్ బాధితురాలిలా ఉంటుందన్న సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది. అతడు ఎందుకలా అన్నాడో చెప్పాలంటూ ఒక లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లలితా కుమారమంగళం తెలిపారు. క్షమాపణ చెప్పడానికి అతడికి వారం రోజుల గడువు ఇచ్చామని, లేనిపక్షంలో అతడిని కమిషన్ కు పిలిపిస్తామని చెప్పారు. కేవలం హీరో అయినంత మాత్రాన ఎలాగైనా మాట్లాడొచ్చనుకుంటే కుదరదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: సల్మాన్ ఖాన్ షాకింగ్ స్టేట్ మెంట్)

కాగా, ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, కేవలం సల్మాన్ ఖాన్ మహిళా అభిమానులకు మాత్రమే సంబంధించినది కాదని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, బీజేపీ నాయకురాలు షైనా ఎన్.సి. అన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక ఆయన లాజిక్ ఏదైనా.. సల్మాన్ మాత్రం క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. ఆయన నోరు జారడం తగదని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement