సుశాంత్‌ తండ్రి రెండో పెళ్లిపై రౌత్‌ వ్యాఖ్యల రగడ | Neeraj Bablu SaysShiv Sena MP Sanjay Raut Should Apologise For His Statement | Sakshi
Sakshi News home page

సంజయ్‌ రౌత్‌ క్షమాపణకు సుశాంత్‌ సోదరుడి డిమాండ్‌

Published Mon, Aug 10 2020 2:47 PM | Last Updated on Mon, Aug 10 2020 4:47 PM

Neeraj Bablu SaysShiv Sena MP Sanjay Raut Should Apologise For His Statement - Sakshi

ముంబై : బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు ఆయన తండ్రితో సత్సంబంధాలు లేవని, తండ్రి రెండో వివాహం చేసుకోవడం పట్ల సుశాంత్‌ సంతోషంగా లేరని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రౌత్‌ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని సుశాంత్‌ సోదరుడు నీరజ్‌ బబ్లూ డిమాండ్‌ చేశారు. సుశాంత్‌ తండ్రి రెండో వివాహంపై సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, రౌత్‌ బహిరంగ క్షమాపణలు కోరనిపక్షంలో తాము ఆయనపై న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించడాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న రౌత్‌ సుశాంత్‌ తన తండ్రి కేకే సింగ్‌తో సరైన సంబంధాలు లేవని ఇటీవల పేర్కొన్నారు. సుశాంత్‌ తన తండ్రిని ఎన్నిసార్లు కలిశారని ఆయన ప్రశ్నించారు.

సుశాంత్‌ మృతిపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ముంబై పోలీసుల నుంచి దర్యాప్తును ఎందుకు హడావిడిగా తప్పిస్తున్నారని రౌత్‌ అన్నారు. ముంబైలో ఘటన జరిగితే సుశాంత్‌ మృతిపై పట్నాలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని సుశాంత్‌ విషాదాంతం చోటుచేసుకున్న 40 రోజుల తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వచ్చారని వ్యాఖ్యానించారు. కాగా సుశాంత్‌కు తన తండ్రితో సరైన సంబంధాలు లేవని రౌత్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ తోసిపుచ్చారు. సుశాంత్‌ కుటుంబం గురించి శివసేన ఎంపీ చవకబారు వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. సున్నితమైన ఈ అంశం పట్ల శివసేన వైఖరి సవ్యంగా లేదని అన్నారు. మరోవైపు సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని మనీల్యాండరింగ్‌కు సంబంధించి సోమవారం మరో విడత ప్రశ్నించారు. రియా మాజీ మేనజర్‌ శ్రుతి మోదీని సైతం ఈడీ మరోసారి ప్రశ్నించనుంది. చదవండి : ఈడీ కార్యాల‌యానికి రియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement