కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్‌చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు.
ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది.
కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.
(చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..)
Comments
Please login to add a commentAdd a comment