Innings
-
చిత్తూరు, అనంత జట్ల జయకేతనం
కడప: ఏసీఏ అండర్–23 అంతర్ జిల్లాల మల్టీడేస్ క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు జయకేతనం ఎగురవేశాయి. కడప నగరంలోని కేఓఆర్ఎం మైదానంలో 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులోని శశాంక్ శ్రీవాత్సవ్ 29 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 54.4 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసూర్యతేజారెడ్డి 140 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లు ఆశిష్‌రెడ్డి 4, మల్లేశన్ 3 వికెట్లు తీశారు. కాగా చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేయగా, కర్నూలు జట్టు 226 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టు 176 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ‘అనంత’ విజయం కేఎస్ఆర్ఎం మైదానంలో 282 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 64.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని దత్తారెడ్డి 87 పరుగులు చేశాడు. కడప బౌలర్లు అస్లాం 3, విజయ భువనేంద్ర 2, ఆదిల్ హుస్సేన్ 2, సాయికుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని శివకేశవరాయల్ 24 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లు లోహిత్సాయికిశోర్ 6 వికెట్లు, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో అనంత జట్టు 207 పరుగులు చేయగా, కడప 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 182 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. -
సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు!..
కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రసంగించిన సంగతి తెలిసింది. ఆ ప్రసంగంలో ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందనడంతో.. ఒక్కసారిగా ఆమె రాజకీయాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.అంతేగాదు ఆమె క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ వివిధ ఊహగానాలు హల్చల్ చేశాయి. ఐతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదని మార్గదర్శక శక్తిగా కొనసాగుతుందని పార్టీ నాయకుడు ఆల్కా లాంబా ఆదివారం చత్తీస్‌గఢ్‌లో మూడో రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆమె భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం సంతోషంగా ఉందన్నారే తప్ప రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదన్నారు. కాగా, సోనియా ప్లీనరీలో..1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి నా ఇన్నింగ్స్ భారత్‌జోడో యాత్రతో ముగించడం సంతోషంగా ఉంది. ఈ యాత్ర ఒక గొప్ప మలుపు. మా పార్టీ ప్రజలతో సంప్రదింపులు, సంభాషణల ద్వారా గొప్ప వారసత్వాన్ని పునరుద్ధరించింది. కాంగ్రెస్ ప్రజలతో నిలబడి పోరాడటానికి సిద్దంగా ఉందనేది తెలియజేసింది. ఈ యాత్ర కోసం పోరాడిన కార్యకర్తలందరికీ అభినందనలు. ముఖ్యంగా రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఐతే ఆమె పార్లమెంటు సీటు కోసం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నుంచి బరిలీకి దిగుతారా లేదా తదుపరి లోక్ సభ ఎన్నికలకై కూతుర ప్రియాంక కోసం సీటు వదులుకుంటారా అనే ఊహగానాలు హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అందుకు కేవలం ఒక్క ఏడాదే ఉంది!..) -
కపిల్ ‘లెజెండరీ ఇన్నింగ్స్’ను మళ్లీ చూడొచ్చు!!
ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్‌ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్‌ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్‌ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్. భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్‌గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా నటిస్తున్న రణ్వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు. -
చెత్త రికార్డు తిరగరాసుకుంది
ప్రేక్షకులు ఇంకా పూర్తిగా గ్యాలెరీలోకి అడుగు పెట్టలేదు. కానీ, అప్పటికే మ్యాచ్ సగానికి పైగా పూర్తయిపోయింది. నార్త్ సౌండ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కనిపించిన దృశ్యం ఇది. 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2... ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోర్. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్.. వచ్చినట్టుగా పెవీలియన్ బాటపట్టారు. ఒక్క లిటన్ దాస్(25) తప్ప వేరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. మిగతా 10 మంది కలిసి చేసింది 18 పరుగులే. విండీస్ పేసర్ కీమర్ రోచ్ విజృంభణతో(5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు) బంగ్లా ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. మిగ్వెల్ 3 వికెట్లు తీసి, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి కీమర్‌కు సహకరించారు. కాగా, ఈ మధ్య కాలంలో టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే కావటం గమనార్హం. 1955లో ఇంగ్లండ్ పై ఆడిన న్యూజిలాండ్ జట్టు 26 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా (30, 30, 35, 36), ఆస్ట్రేలియా (36), న్యూజిలాండ్ (42), ఆస్ట్రేలియా (42), భారత్ (42), దక్షిణాఫ్రికా (43)లు తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. ఆ తరువాతి రికార్డు ఇప్పుడు బంగ్లాదేశ్ నెలకొల్పింది. 2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, ఇప్పుడు తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది. క్రిక్ ఇన్ఫో సౌజన్యంతో... -
శ్రీలంక 293/7
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ 356 కొలంబో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు తడబడుతోంది. కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ (3/100) లెగ్ స్పిన్ ధాటికి తోడు రెండు కీలక రనౌట్లు కూడా దెబ్బతీయడంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి లంక 83 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసింది. ప్రస్తుతం జింబాబ్వేకన్నా 63 పరుగులు వెనుకబడి ఉన్న లంక చేతిలో మూడు వికెట్లున్నాయి. ఓపెనర్ తరంగ (107 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్), చండిమాల్ (100 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్‌కు కరుణరత్నే (66 బంతుల్లో 25; 1 ఫోర్)తో కలిసి 84 పరుగులు.. నాలుగో వికెట్‌కు మాథ్యూస్ (104 బంతుల్లో 41; 2 ఫోర్లు)తో కలిసి 96 పరుగులు జోడించిన తరంగ రనౌట్ కావడం జట్టును ఇబ్బంది పెట్టింది. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 94.4 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటయ్యింది. ఇర్విన్ (256 బంతుల్లో 160; 13 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో తొమ్మిది పరుగులు మాత్రమే జత చేశాడు. హెరాత్‌కు ఐదు, లాహిరు.. గుణరత్నేలకు రెండేసి వికెట్లు దక్కాయి. -
ఇంగ్లండ్ 205 ఆలౌట్
ట్రెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం రెండో రోజు 309/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రూట్ (78; 12 ఫోర్లు) రాణించగా, బెయిర్ స్టో (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మోరిస్, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు, మోర్కెల్, ఫిలాండర్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఎల్గర్ (38 బ్యాటింగ్), హషీమ్ ఆమ్లా (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
వీరుడొక్కడు చాలు...
-
వీరుడొక్కడు చాలు...
ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది. సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా. టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు... వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య. ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు. ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు. భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయిన కొన్ని ఇన్నింగ్స్‌లను చూస్తే.... టెస్టులు * 2003 (మెల్బోర్న్): ఆస్ట్రేలియాపై ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఐదు గంటల్లోనే 195 పరుగుల ఇన్నింగ్స్. * 2004 (ముల్తాన్): భారత్ తరఫున తొలి ‘ట్రిపుల్ సెంచరీ’ (319). సక్లాయిన్ బౌలింగ్‌లో సిక్స్‌తో ఈ ఘనత. * 2006 (లాహోర్): ద్రవిడ్‌తో తొలి వికెట్‌కు 410 పరుగుల భాగస్వామ్యం. 247 బంతుల్లో 254 (47 ఫోర్లు). * 2008 (అడిలైడ్): ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులతో భారత్‌కు తప్పిన ఓటమి. * 2008 (చెన్నై): 278 బంతుల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు (దక్షిణాఫ్రికాపై). * 2009 (ముంబై): మూడో ‘ట్రిపుల్ సెంచరీ’ మిస్. శ్రీలంకపై 254 బంతుల్లో 293. * 2010 (కోల్‌కతా): 174 బంతుల్లో 165. టెస్టుల్లో నంబర్‌వన్‌గా సెహ్వాగ్. వన్డేలు * 2001 (కొలంబో): సచిన్ గైర్హాజరులో వన్డేల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. 69 బంతుల్లో సెంచరీ...సెహ్వాగ్ స్టయిల్ బయటపడింది. * 2002 (కొలంబో): చాంపియన్స్ ట్రోఫీ సెమీస్. ఇంగ్లండ్‌పై 77 బంతుల్లో సెంచరీతో భారత్ ఫైనల్‌కు. * 2009 (హామిల్టన్): 60 బంతుల్లో సెంచరీతో భారత్ తరఫన కొత్త రికార్డు. * 2009 (రాజ్‌కోట్): 102 బంతుల్లో 146 పరుగులతో 414 పరుగుల జట్టు రికార్డు స్కోరులో కీలకపాత్ర. * 2011 (ఇండోర్): 140 బంతుల్లో వన్డేల్లో డబుల్ సెంచరీ. -
దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్
ముంబై: అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో వెస్ట్ 2 వికెట్లతో సౌత్‌జోన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. మయాంక్ (86), అపరాజిత్ (56), మనీష్ పాండే (55) అర్ధసెంచరీలు చేశారు. వెస్ట్‌జోన్ జట్టు 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి నెగ్గింది. జాక్సన్ (51), రాయుడు (54) అర్ధసెంచరీలు చేశారు. 174 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న వెస్ట్‌జోన్‌ను... అక్షర్, సూర్యకుమార్ కలిసి గట్టెక్కించారు. బుధవారం జరిగే ఫైనల్లో వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ తలపడతాయి.