ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించింది.
ట్రెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 130 పరుగుల ఆధిక్యం లభించింది. శనివారం రెండో రోజు 309/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌటైంది.
కెప్టెన్ రూట్ (78; 12 ఫోర్లు) రాణించగా, బెయిర్ స్టో (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మోరిస్, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు, మోర్కెల్, ఫిలాండర్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోయి 75 పరుగులు చేసింది. ఎల్గర్ (38 బ్యాటింగ్), హషీమ్ ఆమ్లా (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.