జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ 356
కొలంబో: జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టు తడబడుతోంది. కెప్టెన్ గ్రేమ్ క్రెమర్ (3/100) లెగ్ స్పిన్ ధాటికి తోడు రెండు కీలక రనౌట్లు కూడా దెబ్బతీయడంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి లంక 83 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసింది. ప్రస్తుతం జింబాబ్వేకన్నా 63 పరుగులు వెనుకబడి ఉన్న లంక చేతిలో మూడు వికెట్లున్నాయి. ఓపెనర్ తరంగ (107 బంతుల్లో 71; 10 ఫోర్లు, 1 సిక్స్), చండిమాల్ (100 బంతుల్లో 55; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.
తొలి వికెట్‌కు కరుణరత్నే (66 బంతుల్లో 25; 1 ఫోర్)తో కలిసి 84 పరుగులు.. నాలుగో వికెట్‌కు మాథ్యూస్ (104 బంతుల్లో 41; 2 ఫోర్లు)తో కలిసి 96 పరుగులు జోడించిన తరంగ రనౌట్ కావడం జట్టును ఇబ్బంది పెట్టింది. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 94.4 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటయ్యింది. ఇర్విన్ (256 బంతుల్లో 160; 13 ఫోర్లు, 1 సిక్స్) తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో తొమ్మిది పరుగులు మాత్రమే జత చేశాడు. హెరాత్‌కు ఐదు, లాహిరు.. గుణరత్నేలకు రెండేసి వికెట్లు దక్కాయి.
శ్రీలంక 293/7
Published Sun, Jul 16 2017 1:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
Advertisement
Advertisement