ప్రేక్షకులు ఇంకా పూర్తిగా గ్యాలెరీలోకి అడుగు పెట్టలేదు. కానీ, అప్పటికే మ్యాచ్ సగానికి పైగా పూర్తయిపోయింది. నార్త్ సౌండ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కనిపించిన దృశ్యం ఇది. 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2... ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోర్. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్.. వచ్చినట్టుగా పెవీలియన్ బాటపట్టారు. ఒక్క లిటన్ దాస్(25) తప్ప వేరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. మిగతా 10 మంది కలిసి చేసింది 18 పరుగులే. విండీస్ పేసర్ కీమర్ రోచ్ విజృంభణతో(5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు) బంగ్లా ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. మిగ్వెల్ 3 వికెట్లు తీసి, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి కీమర్‌కు సహకరించారు.
కాగా, ఈ మధ్య కాలంలో టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే కావటం గమనార్హం. 1955లో ఇంగ్లండ్ పై ఆడిన న్యూజిలాండ్ జట్టు 26 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా (30, 30, 35, 36), ఆస్ట్రేలియా (36), న్యూజిలాండ్ (42), ఆస్ట్రేలియా (42), భారత్ (42), దక్షిణాఫ్రికా (43)లు తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. ఆ తరువాతి రికార్డు ఇప్పుడు బంగ్లాదేశ్ నెలకొల్పింది. 2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, ఇప్పుడు తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది.
క్రిక్ ఇన్ఫో సౌజన్యంతో...
Comments
Please login to add a commentAdd a comment