
నార్త్‌సాండ్: వెస్టిండీస్ పేస్ బౌలింగ్ ధాటికి బంగ్లాదేశ్ బిత్తరపోయింది. తమ టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 18.4 ఓవర్లలో 43 పరుగులకే కుప్పకూలింది. లిటన్ దాస్(25) టాప్ స్కోరర్ కాగా మిగతా 10 మంది కలిసి 18 పరుగులే చేశారు.
కీమర్ రోచ్ (5/8) ఐదు వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది ఆరో అత్యల్ప స్కోరు. కేవలం 112 బంతులు మాత్రమే ఆడిన బంగ్లాదేశ్ అతి చిన్న ఇన్నింగ్స్ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. టెస్టుల్లో అత్యల్ప స్కోర్ల జాబితాలో వరుసగా న్యూజిలాండ్ (26 పరుగులు), దక్షిణాఫ్రికా (30, 30, 35, 36), ఆస్ట్రేలియా (36), న్యూజిలాండ్ (42), ఆస్ట్రేలియా (42), భారత్ (42), దక్షిణాఫ్రికా (43) ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment