నార్త్‌సౌండ్: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ ఇన్నింగ్స్, 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా తీరు మారని బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 62/6తో మూడో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లా మరో 22.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది.
హసన్ (64) మినహా అంతా విఫలమయ్యారు. షెనాన్ గాబ్రియెల్ (5/77) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. అంతకుముందు గురువారం వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ జట్టుకు 363 పరుగుల ఆధిక్యం లభించింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 22 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది.
వెస్టిండీస్ ఘన విజయం
Published Sat, Jul 7 2018 2:07 AM | Last Updated on Sat, Jul 7 2018 2:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment