స్వదేశంలో ‘అతి పెద్ద విజయం’ | West Indies record fifth largest Test win | Sakshi
Sakshi News home page

స్వదేశంలో ‘అతి పెద్ద విజయం’

Published Sat, Jul 7 2018 2:29 PM | Last Updated on Sat, Jul 7 2018 5:01 PM

West Indies record fifth largest Test win - Sakshi

ఆంటిగ్వా: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ 219 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులకు కూల్చేసిన వెస్టిండీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అదే సమయంలో వెస్టిండీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులతో ఆకట్టుకుంది. ఫలితంగా స్వదేశంలో అతి పెద్ద విజయాన్ని వెస్టిండీస్‌ తొలిసారి సాధించింది.

ఇప్పటివరకూ వెస్టిండీస్‌ సాధించిన భారీ విజయాలు పరంగా చూస్తే.. కోల్‌కతాలో భారత్‌పై ఇన్నింగ్స్‌ 336 పరుగుల తేడాతో సాధించిన గెలుపు తొలి స్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌తో వెల్టింగ్టన్‌లో ఇన్నింగ్స్‌ 322 పరుగుల తేడాతో సాధించిన విజయం రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో బంగ్లాదేశ్‌పై ఢాకాలో సాధించిన ఇన్నింగ్స్‌ 310 పరుగుల తేడాతో సాధించిన విజయం ఉండగా, ఇంగ్లండ్‌పై లార్డ్స్‌లో సాధించిన ఇన‍్నింగ్స్‌ 226 పరుగుల తేడాతో నమోదు చేసిన విజయం నాల్గో స్థానంలో ఉంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విండీస్‌ సాధించిన విజయం ఓవరాల్‌గా ఆ జట్టు చరిత్రలో ఐదో అతి పెద్ద విజయంగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement