Lowest score
-
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్ తలో వికెట్ పడగొట్టారు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో, ఓపెనర్ బత్జర్గల్ చేసిన 5 పరుగులే మంగోలియన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్స్‌గా నిలిచాయి. కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ కూడా పాల్గొంటుంది. -
టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు!
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆసీస్ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయాన్ని అడ్డుకోవడం టీమిండియాకు కత్తిమీద సాము లాంటిదే. అయినా సరే ఒకవేళ టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం 141 రికార్డు బద్దలవడం ఖాయం. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప టార్గెట్‌ను నిలబెట్టుకున్న జట్టుగా ఆస్ట్రేలియాకు రికార్డు ఉంది. 1883లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 85 పరుగుల అత్యల్ప టార్గెట్‌ను ఆసీస్ కాపాడుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 63 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ డిక్ బార్లో ఐదు వికెట్లు తీయగా, టెడ్ పీటే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 101 పరుగులకు ఆలౌట్ అయింది. ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్ ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 122 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ ముందు 85 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య చేధనలో విఫలమైన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అప్పటి మ్యాచ్, ఇవాళ ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అంశం మాత్రం ఆసక్తిగా మారింది. అది టాస్. అప్పటిమ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పుడు కూడా టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. మరి నిజంగా టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం టెస్టు చరిత్రలో ఒక రికార్డులా మిగిలిపోనుంది. చదవండి: 'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!' అదే రెండున్నర రోజులు.. సీన్ మాత్రం రివర్స్! -
IND Vs AUS: 15 ఏళ్లలో ఇది నాలుగోసారి..
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. పిచ్‌పై బంతి ఎలా టర్న్ అవుతుందో అర్థంగాక తలలు పట్టుకున్నారు. టాస్ గెలవడం మినహా టీమిండియాకు ఏది కలిసిరాలేదు. ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియోన్, మర్ఫీలు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు క్రికెట్లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం గత 15 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో 2008లో(అహ్మదాబాద్) సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 76 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత 2017 పుణేలో ఆస్ట్రేలియాతో టెస్టులో 105 పరుగులకు కుప్పకూలింది. మళ్లీ అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ అయింది. తాజాగా ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 109 పరుగులకు కుప్పకూలింది. మ్యాచ్‌లో కోహ్లి 22 పరుగులు చేయగా.. గిల్ 21 పరుగులు చేశాడు. కుహ్నెమన్ ఐదు వికెట్లు తీయగా.. లియోన్ 3, మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. India registered their 4th lowest total at home in the last 15 years. pic.twitter.com/x5fcMtVyAQ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2023 చదవండి: IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్ శర్మ తప్పు చేశాడా? -
రంజీ ట్రోఫీ చరిత్రలో నాలుగో అత్యల్పం.. నాగాలాండ్ చెత్త రికార్డు
రంజీ ట్రోఫీలో నాలుగో అత్యల్ప స్కోరు నమోదైంది. 2022-23 రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ జట్టు అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాగాలాండ్ 25 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా రంజీ చరిత్రలోనే నాలుగో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా రికార్డును సాధించింది. డిమాపుర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 25 పరుగులకే కుప్పకూలింది. కేవలం 18 ఓవర్లు మాత్రమే ఆడింది. ఉత్తరాఖండ్ బౌలర్లు మయాంక్ మిశ్రా, స్పప్నిల్ సింగ్ ఇద్దరే నాగాలాండ్ పతనాన్ని శాసించారు. ఫలితంగా ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మయాంక్ మిశ్రా 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఓవర్లు మెయిడెన్లు కావడం విశేషం, మరోపక్క స్వప్నిల్ సింగ్ 9 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో 5 మెయిడెన్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిపి 9 వికెట్లు తీయగా.. నాగాలాండ్ ఓపెనర్ యుగంధర్ సింగ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ జట్టు బ్యాటర్లలో నాగావో చిషి ఒక్కడే 10 పరుగులతో డబుల్ డిజిట్ స్కోరును అందుకోగలిగాడు. మిగిలివారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వీరిలో ఆరుగురు డకౌట్లుగా నిలవడం గమనార్హం. 1951-52 సీజన్లో ముంబయిపై సౌరాష్ట్రా చేసిన స్కోరును తాజాగా నాగాలాండ్ సమం చేసింది. ఇక రంజీ చరిత్రలో అత్యల్ప స్కోరు హైదరాబాద్ పేరిట ఉంది. 2010-11 సీజన్లో రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇక 1934-33 సీజన్లో నార్తర్న్ ఇండియాపై సదరన్ పంజాబ్ జట్టు 22 పరుగులతో రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 23 పరుగులతో సింద్, జమ్మూ-కశ్మీర్ మూడో అత్యల్ప స్కోర్లు చేశాయి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యల్ప స్కోరు ఇంగ్లాండ్‌లో నమోదైంది. 1810లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీఎస్ జట్టు 6 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 కంటే తక్కువ స్కోరు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా రంజీ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లలో నాగాలాండ్ కూడా చోటు దక్కించుకుంది. నాగాలాండ్ తన తదుపరి మ్యాచ్‌ను ఉత్తరప్రదేశ్, ఇలైట్ గ్రూప్-ఏతో ఆడనుంది. చదవండి: బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్ రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? -
ఏప్రిల్ 23.. ఆర్సీబీకి కలిసిరాని రోజు
ఏప్రిల్ 23.. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి కలిసిరాని రోజుగా మిగిలిపోనుంది. ఐదేళ్ల క్రితం 2017 ఏప్రిల్ 23న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు (49)ను నమోదు చేసింది. అప్పుడు కేకేఆర్ ఇచ్చిన 131 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైన ఆర్సీబీ టోర్నీ చరిత్రలోనే అత్యల్పో స్కోరు చేసింది. ఇప్పుడు సరిగ్గా అదే రోజు దాదాపు అదే ప్రదర్శనను కనబరుస్తూ తమ రెండో అత్యల్ప స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడి ఆర్సీబీని 68 పరుగులకే కుప్పకూల్చారు. అదే ఏప్రిల్ 23.. కానీ ఇదే ఏప్రిల్ 23న.. ఆర్సీబీకి మంచి రికార్డు ఉంది. 2013లో పుణే వారియర్స్‌పై గేల్ సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ 263 పరుగుల అత్యధిక స్కోరు సాధించింది. ఇప్పటికి ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యునివర్సల్ బాస్ ఆ మ్యాచ్‌లో 17 సిక్సర్లు, 13 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. అలా ఒక మంచి రికార్డు ఉన్నప్పటికి.. రెండుసార్లు ఇదే తేదీన అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన ఆర్సీబీకి ఒక రకంగా పీడకలగా మిగిలిపోనుంది. ఒకే తేదీన అటు అత్యల్ప స్కోరు.. ఇటు అత్యధిక స్కోరు చేసిన అరుదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. అయితే ఆర్సీబీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో ఒక ఆట ఆడుకున్నారు. ''దయచేసి ఏప్రిల్ 23న ఆర్సీబీకి మ్యాచ్ పెట్టకండి.. ఏప్రిల్ 23తో ఆర్సీబీకి విడదీయరాని బంధం ఏర్పడింది.. ఒకే తేదీన అత్యల్ప స్కోరు.. అత్యధిక స్కోరు.. ఇది ఆర్సీబీకి మాత్రమే సాధ్యం'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: ఎదురులేని ఎస్ఆర్హెచ్.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు IPL 2022: తొలి బంతికే డకౌట్..కోహ్లికి ఏమైంది.. తలదించుకుని పెవిలియన్‌కు! April 23, 2017 - 49 all-out April 23, 2022 - 68 all-out This date has become a nightmare for @RCBTweets 😂#RCBvSRH #RCB #SRH #IPL2022 pic.twitter.com/RsdGpbEeDx — LightsOnMedia (@lightson_media) April 23, 2022 #RCBvSRH #ViratKohli #Bangalore 23rd April 2013 - RCB 263/5 23rd April 2017 - RCB 49 all out 23rd April 2022 - RCB 68 all out Vintage RCB fan on every April 23 : pic.twitter.com/OUCr2LBqHz — Prakhar (@Prakhar_26_19) April 23, 2022 RCB and 23 April never ending love story🥺@RCBTweets @imVkohli #RCB pic.twitter.com/65onStU7dH — VIRATIAN (@viratiansurya) April 23, 2022 -
దారుణ ఆటతీరు.. టీమిండియా చెత్త రికార్డు
Lowest Totals By Team India T20 World Cup.. టి20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఆటతీరుతో చెత్త రికార్డు నమోదు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లోస్కోరింగ్ చేయడం ఇది నాలుగోసారి.. అందులో రెండుసార్లు న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు వచ్చినవే. 2016 టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 79 పరుగులకే ఆలౌటైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో అదే కివీస్‌పై 110 పరుగులు చేసింది. ఇక 2009 టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై 118 పరుగులు చేసింది. 2014 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 130 పరుగులు చేసి చెత్త రికార్డులను మూటగట్టుకుంది. చదవండి: IND Vs NZ: టీమిండియాకు రెండో ఓటమి; సెమీస్ అవకాశాలు సంక్లిష్టం -
టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు
Australia 3rd Lowest Total In T20 World Cups.. టి20 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. టి20 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2014 టి20 ప్రపంచకప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకముందు 2012 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై 117 పరుగులు చేసింది. తాజాగా మరోసారి ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. అంతకముందు ఈ ప్రపంచకప్‌లో తొలి పవర్‌ప్లే( ఆరు ఓవర్లు) అతి తక్కువ స్కోరు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 21 పరుగులు మాత్రమే చేసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన అర్హత మ్యాచ్‌లో పపువా న్యూ గినియా తొలి ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 17 పరుగులతో తొలి స్థానంలో ఉంది. -
టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చెత్త రికార్డు
West Indies Lowest Totals T20WC.. టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 55 పరుగులకే ఆలౌట్ అయి టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే టి20 వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్లు రెండుసార్లు నమోదు చేసిన జట్టుగా నెదర్లాండ్స్ తొలి స్థానంలో నిలిచింది. 2014 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 39 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్ 42 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్(శ్రీలంకపై 2014టి 20 వరల్డ్ కప్, 60 పరుగులు) నాలుగో స్థానంలో ఉంది. చదవండి: T20 WC 2021: దక్షిణాఫ్రికాకు ఇది నాలుగోసారి ఇక వెస్టిండీస్ టి20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది నాలుగోసారి. ఇందులో మూడుసార్లు(45, 71, 55) ఇంగ్లండ్‌పైనే నమోదు చేయడం విశేషం. ఇక 2018లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 60 పరుగులకే కుప్పకూలింది. చదవండి: T20 WC 2021 ENG Vs WI: కూప్పకూలిన వెస్టిండీస్.. 55 పరుగులకే ఆలౌట్ Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు -
T20 WC 2021: దక్షిణాఫ్రికాకు ఇది నాలుగోసారి
South Africa Lowest Totals In T20 WC.. టి20 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా నాలుగోసారి అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇంతకముందు 2007టి 20 ప్రపంచకప్‌లో ఇండియాపై 116, 2009 టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 122, 2009 టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 128 పరుగులు చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ బౌలర్ల దాటికి మక్రమ్(40) మినహా ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ తలా రెండు వికెట్లు తీయగా.. మ్యాక్స్‌వెల్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆడుతున్న ఆసీస్ 12 ఓవర్ల ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. స్మిత్ 25, మ్యాక్స్‌వెల్ 8 పరుగులతో ఆడుతున్నారు. చదవండి: T20 WC 2021 AUS Vs SA: అయ్యో కేశవ్ ఎంత పనైంది.. రనౌట్ చూసి తీరాల్సిందే T20 Worldcup 2021: భారత్‌తో తలపడే జట్టును ప్రకటించిన పాక్.. -
T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు
Sri Lanka Skittles Netherlands To Second Lowest Total In T20WC History: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ జట్టు అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులకే ఆలౌటై, టోర్నీ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోర్ రికార్డు సైతం నెదర్లాండ్స్ పేరిటే నమోదై ఉంది. 2014 ప్రపంచకప్‌లో ఇదే శ్రీలంక జట్టుపై కేవలం 39 పరుగులకే ఆలౌటైన నెదర్లాండ్స్.. టోర్నీ చరిత్రలో మొదటి రెండు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపాన్ని చూపింది. స్పిన్నర్లు వనిందు హసరంగ(3/9), మహీశ్ తీక్షణ(2/3), పేసర్లు లహీరు కుమార(3/7), దుశ్మంత చమీరా(1/13) చెలరేగి బౌల్ చేయడంతో నెదర్లాండ్స్ చిగురుటాకులా వణిపోయింది. కేవలం 10 ఓవర్లు మాత్రమే ఆడి 44 పరగులకే ఆలౌటైంది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో కొలిన్ ఆకెర్మెన్(11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. నెదర్లాండ్స్ స్కోర్‌లో 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-ఏ నుంచి శ్రీలంక ఇదివరకే సూపర్ 12 బెర్త్ ఖరారు చేసుకోగా.. నెదర్లాండ్స్ ఈ మ్యాచ్ జయాపజయాలతో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. చదవండి: కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ఖరారు -
తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు
Lowest T20I Totals In T20 World Cups.. టి20 క్రికెట్ అంటేనే భారీ స్కోర్లకు పెట్టింది పేరు. అటువంటి టి20 క్రికెట్లో లోస్కోరింగ్ మ్యాచ్‌లు జరగడం సహజమే. ఇక టి20 ప్రపంచకప్ లాంటి మేజర్టోర్నీల్లో అత్యల్ప స్కోర్లు నమోదు కావడం కనిపిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన క్వాలిఫయర్ గ్రూఫ్-బి మ్యాచ్‌లో పపువా న్యూ గినియా తృటిలో లోస్కోరింగ్ రికార్డు నుంచి తప్పించుకుంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పపువా 10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. అయితే కిప్లిన్ డోరిగా 46 పరుగులతో పపువాను చెత్త రికార్డు నుంచి బయటపడేశాడు. 97 పరుగులకు ఆలౌటై అత్యల్ప స్కోరు రికార్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది.ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో మూడు జట్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.. చదవండి: T20 WC 2021 BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత! ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014( నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక) టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు నెదర్లాండ్స్ పేరిట ఉంది. 2014 టి20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌట్ అయింది. అజంతా మెండిస్, అంజెల్లో మాథ్యూస్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. లసిత్ మలింగ, కులశేఖర చెరో రెండు వికెట్లు తీశారు. ఇక 40 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 5 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: T20 WC 2021: వారెవ్వా షకీబ్.. ఇలాంటి ఆల్‌రౌండర్ ఒక్కడున్నా చాలు ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014(శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్) టి20 ప్రపంచకప్‌లో రెండో అత్యల్ప స్కోరు న్యూజిలాండ్‌పై ఉంది. 2014 టి20 ప్రపంచకప్‌లోనే మరోసారి శ్రీలంక ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఈ స్కోరు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌలఅయింది. లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం బ్లాక్‌క్యాప్స్‌కు ఎక్కువసేపు నిలవలేదు. లంక స్పిన్నర్లు రంగన హెరాత్(5/3) కెరీర్ బెస్ట్స్పెల్కు తోడూ.. సుచిత్ర సేనానాయకే(2/3) దెబ్బకు న్యూజిలాండ్ 60 పరుగులకే తోక ముడిచి 59 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఐసీసీ టి20 ప్రపంచకప్ 2010( ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్) ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు ఐర్లాండ్ పేరిట ఉంది. టి20 ప్రపంచకప్ 2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 68 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 138 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిన ఐదు వికెట్లను కేవలం 18 పరుగుల తేడాతో జార్చుకొని అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విండీస్ బౌలర్లు రవి రాంపాల్, డారెన్ సామీలు ఐర్లాండ్ లైనఫ్‌ను కుప్పకూల్చారు. చదవండి: T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్ -
మూడుసార్లు లోస్కోరింగ్.. ముంబైకి కలిసొచ్చింది.. ఈసారి
Mumbai Indians Best Record Low Scoring Matches.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఢిల్లీకి 130 పరుగుల టార్గెట్‌ను విధించింది. కాగా తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో ముంబైకి మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడుసార్లు లోస్కోరింగ్ మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. 2012లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగులు మాత్రమే చేసిన ముంబై ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2017లో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రైజింగ్ పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని టైటిల్ విజేతగా నిలిచింది. ఇక 2019లో ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే ఢిల్లీకి కూడా లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 130 కంటే తక్కువ పరుగుల లక్ష్య చేధనలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. చదవండి: Rohit And Pant: టాస్ సమయంలో పంత్, రోహిత్‌ల మధ్య ఏం జరిగింది! Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్‌గా -
పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు తొలి అంచె పోటీల్లోనూ తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా ఈ పరుగులు నమోదు చేసింది కూడా రాజస్తాన్ రాయల్స్‌పైనే కావడం విశేషం. ఇక్కడ పరుగులు(36) సమానంగా ఉన్నాయి.. వికెట్లు మాత్రమే(3) ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ గెలుపొందింది. చదవండి: టి20 క్రికెట్లో కోహ్లి అరుదైన ఘనత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హెట్‌మైర్ 28(5 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. లలిత్ యాదవ్(3) అతనికి సహకరిస్తున్నాడు. అంతకముందు ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్(8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(43), రిషబ్ పంత్(24)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నడిపించారు. చదవండి: RCB New Captain: డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్ -
బెంబేలెత్తించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా చిత్తుచిత్తు
ఢాకా: సీనియర్ల గైర్హాజరీలో అంతగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు దారుణ ప్రదర్శనతో సిరీస్‌ను ముగించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో (టి20, వన్డేలు) ఆ్రస్టేలియాకిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ ముందువరకు కూడా 2005లో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. చివరి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. టి20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్ ఓటమి. గత నెలలో విండీస్ చేతిలో ఆస్ట్రేలియా 1–4తో ఓడింది. తొలుత బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల చేసింది. ఓపెనర్ మొహమ్మద్ నైమ్ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌటై ఓడింది. తాత్కాలిక సారథి వేడ్ (22 బంతుల్లో 22; 2 సిక్స్‌లు), బెన్ మెక్‌డెర్మట్ (16 బంతుల్లో 17; 1 సిక్స్) మినహా మిగతా తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షకీబుల్ హసన్ (4/9), సైఫుద్దీన్ (3/12) ప్రత్యర్థిని పడగొట్టారు. సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌తో షకీబ్ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో లసిత్ మలింగ (107) అగ్రస్థానంలో ఉన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
97 పరుగులకే ఆలౌట్.. చెత్త రికార్డు నమోదు
జోహెన్నెస్‌బర్గ్: వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. గురువారం గ్రాస్ ఐలెట్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులకే కుప్పకూలింది. టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై విండీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. కెప్టెన్ జేసన్ హోల్డర్ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఇన్‌గిడి కేవలం 19 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. ఆన్రిచ్ నోర్జే 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలిరోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. మక్రమ్ 60 పరుగులు చేసి ఔట్ కాగా.. ప్రస్తుతం వాండర్ డుసెన్ 34, క్వింటన్ డికాక్ 4 పరుగులతో ఆడుతున్నారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు తీశాడు. చదవండి: కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా.. ఎడ్జ్‌బాస్టన్: న్యూజిలాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (81) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాన్ లారెన్స్ (67 బ్యాటింగ్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఎజాజ్, బౌల్ట్, హెన్రీతలా 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ ద్వారా అత్యధిక టెస్టులు ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ (162)గా పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ గుర్తింపు పొందాడు. అలిస్టర్ కుక్ (161)ను అతను అధిగమించాడు. చదవండి: కోహ్లి నా దగ్గరికి వచ్చేవరకు ప్లాన్స్ చెప్పను: రహానే -
1986 తర్వాత మళ్లీ ఇప్పుడే
అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఇంగ్లండ్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కాగా ఇంగ్లండ్ టెస్టుల్లో టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఓవరాల్‌గా ఇది ఐదోసారి కాగా అత్యల్ప స్కోరుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 1971 ఓవల్ టెస్టులో 101 పరుగులు, 1979/80 ముంబై టెస్టులో 102 పరుగులు, 1986 లీడ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, తాజాగా అహ్మదాబాద్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లతో సత్తా చాటిన అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. డే నైట్ టెస్టులో ఒక బౌలర్ కెరీర్ బెస్ట్ నమోదు చేయడం ఇది మూడోసారి కాగా.. అక్షర్(6/38) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన దేవేంద్ర బిషూ 8/49తో తొలి స్థానంలో ఉన్నాడు. 2016/17 పాకిస్తాన్ సిరీస్ సందర్భంగా జరిగిన డే నైట్ టెస్టులో బిషూ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్ -
టీమిండియాకు ఏమైంది..?
టీమిండియాకు ఏమైంది..? పింక్ బాల్ టెస్టులో ఈరోజు భారత ఆటగాళ్ల బ్యాటింగ్ చూసిన తర్వాత సగటు అభిమాని మదిలో మెదిలిన ప్రశ్న ఇది. కనీస పోరాట పటిమ కూడా చూపించకుండానే టీమిండియా బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టి అత్యంత చెత్త రికార్డును జట్టు పేరిట లిఖించారు. అడిలైడ్ : టెస్టు క్రికెట్లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను 36 పరుగల వద్ద ముగించింది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఈ స్కోరును నమోదు చేసింది. కాగా మహ్మద్ షమీ గాయంతో 'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరగడంతో 36 పరుగుల వద్ద 9 వికెట్లతో నేడు భారత్ ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దీంతో టీమిండియా అత్యంత తక్కువస్కోరు నమోదు చేసి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్ 5 వికెట్లు.. పాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియా నడ్డి విరిచారు. (చదవండి : టీమిండియా.. 4,9,2,0,4,0,8, 4,0,1) -
ఐసీసీ చరిత్రలో మరో అత్యల్ప స్కోరు
కఠ్మాండు (నేపాల్) : అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా జింబాబ్వే పేరిట ఉన్న రికార్డును అమెరికా జట్టు సమం చేసింది. వరల్డ్ కప్ లీగ్–2లో భాగంగా బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 12 ఓవర్లలో కేవలం 35 పరుగులకే కుప్పకూలింది. 2004లో హరారేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే కూడా 35 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే 16 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకొని అమెరికా ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ సుశాన్ భరీ 5 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టులో జేవియర్ మార్షల్ 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. నేపాల్ 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి గెలిచింది. గతేడాది అమెరికాకు ఐసీసీ వన్డే హోదా కల్పించింది. -
సీఎస్కే నాలుగో అత్యల్పం
సాక్షి, చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12 తొలి మ్యాచ్ చాలా చప్పగా సాగుతోంది. తొలుత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 70 పరుగులకే కుప్పకూలింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు హర్భజన్(3/20) , తాహీర్(3/9), జడేజా(2/15)లు విజృంభించడంతో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. అనంతరం 71 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కూడా నెమ్మదిగా ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆర్సీబీ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాబట్టడానికి బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడ్డారు. దీంతో పవర్ ప్లేలో 16 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో నాలుగో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా సీఎస్కే నిలిచింది. ఈ జాబితాలో రాజస్తాన్(14, 2009లో), సీఎస్కే(15, 2011లో), సీఎస్కే(16, 2015లో) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తొలి నాలుగు స్థానాల్లో సీఎస్కే జట్టువే మూడు ఉండటం గమనార్హం. -
శ్రీలంకతో తొలి టెస్ట్: కుప్పకూలిన సఫారీ జట్టు
గాలె: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో లంక బ్యాట్స్‌మెన్ అదరగొట్టగా.. అనంతరం బౌలర్లు చెలరేగారు. శ్రీలంక బౌలర్ల ధాటిక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌటైంది. ఆతిథ్య గడ్డపై ప్రొటీస్ జట్టుకు ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. వికెట్ నష్టానికి నాలుగు పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టును లంక బౌలర్లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. నైట్ వాచ్‌మన్ కేశవ్ మహారాజ్‌ను ఔట్ చేయడంతో రెండో రోజు శ్రీలంక వికెట్ల ఖాతా తెరిచింది. మరో ఓపెనర్ ఎల్గర్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మన్ ఆమ్లా(15), బవుమా(17), డికాక్(3), ఫిలాండర్(18) తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ డుప్లెసిస్ 49(88 బంతుల్లో 5ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో కనీసం వంద పరుగుల మార్క్‌ను ప్రోటీస్ జట్టు దాటింది. లంక బౌలర్లలో డి పెరీరా (4/46), కెప్టెన్ సురంగ లక్మల్(3/21), హెరాత్(2/39), లక్షాన్ సందకదన్(1/18) ఆకట్టుకున్నారు. అనంతరం 161 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంకకు మరో సారి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కరుణరత్నే 60( 80 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో రెండో రోజు ఆటముగిసే సమయానికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది. శ్రీలంక ప్రస్తుతం 272 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రొటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు తీయగా, రబడా ఒక్క వికెట్ సాధించారు. -
బంగ్లా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్
-
చెత్త రికార్డు తిరగరాసుకుంది
ప్రేక్షకులు ఇంకా పూర్తిగా గ్యాలెరీలోకి అడుగు పెట్టలేదు. కానీ, అప్పటికే మ్యాచ్ సగానికి పైగా పూర్తయిపోయింది. నార్త్ సౌండ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కనిపించిన దృశ్యం ఇది. 4, 1, 0, 0, 0, 4, 1, 0, 6, 2... ఇవీ బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన స్కోర్. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్.. వచ్చినట్టుగా పెవీలియన్ బాటపట్టారు. ఒక్క లిటన్ దాస్(25) తప్ప వేరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. మిగతా 10 మంది కలిసి చేసింది 18 పరుగులే. విండీస్ పేసర్ కీమర్ రోచ్ విజృంభణతో(5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు) బంగ్లా ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. మిగ్వెల్ 3 వికెట్లు తీసి, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి కీమర్‌కు సహకరించారు. కాగా, ఈ మధ్య కాలంలో టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యల్ప స్కోర్ ఇదే కావటం గమనార్హం. 1955లో ఇంగ్లండ్ పై ఆడిన న్యూజిలాండ్ జట్టు 26 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా (30, 30, 35, 36), ఆస్ట్రేలియా (36), న్యూజిలాండ్ (42), ఆస్ట్రేలియా (42), భారత్ (42), దక్షిణాఫ్రికా (43)లు తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. ఆ తరువాతి రికార్డు ఇప్పుడు బంగ్లాదేశ్ నెలకొల్పింది. 2007లో శ్రీలంకపై 62 పరుగులకు కుప్పకూలిన బంగ్లాదేశ్, ఇప్పుడు తన రికార్డును తాను మరోసారి దిగజార్చుకుంది. క్రిక్ ఇన్ఫో సౌజన్యంతో... -
సంచలనం: ఐదుగురు డకౌట్
ఆక్లాండ్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన డే–నైట్ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ సంచలనం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్.. ఇంగ్లీషు టీమ్‌ను అత్యల్ప స్కోరుకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌతి.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. పదునైన బంతులతో వీరిద్దరూ చెలరేగడంతో 20.4 ఓవర్లలో 58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు ఇది ఓవరాల్‌గా ఆరో అతిస్వల్ప స్కోరు కావడం గమనార్హం. ఐదుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. జో రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, మహ్మద్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ డకౌటయ్యారు. ఓవర్టన్ (33), స్టోన్‌మన్(11) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బోల్ట్ 32 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మూడేసి మేడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
పరువు నిలిపిన ధోని
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియా పరువు కాపాడాడు. శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ దాటికి భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియా అత్యల్ప స్కోరుకే ఆలౌట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ధోని గండం నుంచి గట్టెక్కించాడు. ఐదు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని తనదైన శైలిలో ఆడుతూ అండగా నిలిచాడు. స్పిన్ బౌలర్ అయిన కుల్దీప్తో ఆచితూచి ఆడుతూ భారత స్కోరును 70 పరుగులు దాటించాడు. దీంతో ఇప్పటి వరకు భారత పేరిట ఉన్న అత్యల్ప స్కోరు 54 నుంచి టీమిండియా గట్టెక్కింది. బ్యాట్స్మన్లు బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అనుభవంతో ధోని 5 బౌండరీలు బాదాడు. మరో వైపు కుల్దీప్ 19 పరుగులతో చక్కని సాయం అందించాడు. ఈ దశలో 70 పరుగుల వద్ద కుల్దీప్ (19) స్టంప్ అవుట్ కావడంతో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన బుమ్రాతో ధోని (29) పోరాడుతున్నాడు. -
చెత్త రికార్డు నమోదు చేసిన భారత్
ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ చెత్త రికార్డును మూట గట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గత ఐదేళ్లలో వన్డేల్లో 10 ఓవర్లకు అత్యల్ప స్కోరు నమోదు చేసి తొలి జట్టుగా ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇక ఓవరాల్‌గా ఈ చెత్త రికార్డు నమోదు చేసిన రెండో జట్టుగా నిలిచింది. భారత్ ఆడిన తొలి ఐదు ఓవర్లలో నాలుగు ఓవర్లు మేడిన్ కావడం గమనార్హం. ఓపెనర్లు శిఖర్ ధావన్ డకౌట్, రోహిత్ శర్మ(2),లు విఫలమవ్వడం, దినేశ్ కార్తీక్ డకౌట్లు కావడంతో భారత్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ చెత్త రికార్డు రోహిత్ కెప్టెన్సీ వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే కావడం విశేషం. ఇక మరో వైపు వరుస గెలుపులతో రికార్డులు నమోదు చేసిన భారత జట్టు.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవడం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు.