Lowest T20I Totals In T20 World Cups.. టి20 క్రికెట్ అంటేనే భారీ స్కోర్లకు పెట్టింది పేరు. అటువంటి టి20 క్రికెట్‌లో లోస్కోరింగ్ మ్యాచ్‌లు జరగడం సహజమే. ఇక టి20 ప్రపంచకప్ లాంటి మేజర్‌టోర్నీల్లో అత్యల్ప స్కోర్లు నమోదు కావడం కనిపిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన క్వాలిఫయర్ గ్రూఫ్-బి మ్యాచ్‌లో పపువా న్యూ గినియా తృటిలో లోస్కోరింగ్ రికార్డు నుంచి తప్పించుకుంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి పపువా 10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. అయితే కిప్లిన్ డోరిగా 46 పరుగులతో పపువాను చెత్త రికార్డు నుంచి బయటపడేశాడు. 97 పరుగులకు ఆలౌటై అత్యల్ప స్కోరు రికార్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది.ఇక టి20 ప్రపంచకప్ చరిత్రలో మూడు జట్లు అత్యల్ప స్కోర్లు నమోదు చేశాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం..
చదవండి: T20 WC 2021 BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత!
ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014( నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక)
టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు నెదర్లాండ్స్ పేరిట ఉంది. 2014 టి20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌట్ అయింది. అజంతా మెండిస్, అంజెల్లో మాథ్యూస్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. లసిత్ మలింగ, కులశేఖర చెరో రెండు వికెట్లు తీశారు. ఇక 40 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 5 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
చదవండి: T20 WC 2021: వారెవ్వా షకీబ్.. ఇలాంటి ఆల్‌రౌండర్ ఒక్కడున్నా చాలు
ఐసీసీ టి20 ప్రపంచకప్ 2014(శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్)
టి20 ప్రపంచకప్‌లో రెండో అత్యల్ప స్కోరు న్యూజిలాండ్‌పై ఉంది. 2014 టి20 ప్రపంచకప్‌లోనే మరోసారి శ్రీలంక ప్రత్యర్థిగా న్యూజిలాండ్ ఈ స్కోరు నమోదు చేసింది. అయితే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌలఅయింది. లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం బ్లాక్‌క్యాప్స్‌కు ఎక్కువసేపు నిలవలేదు. లంక స్పిన్నర్లు రంగన హెరాత్(5/3) కెరీర్ బెస్ట్‌స్పెల్‌కు తోడూ.. సుచిత్ర సేనానాయకే(2/3) దెబ్బకు న్యూజిలాండ్ 60 పరుగులకే తోక ముడిచి 59 పరుగులతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఐసీసీ టి20 ప్రపంచకప్ 2010( ఐర్లాండ్ వర్సెస్ వెస్టిండీస్)
ఇక ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు ఐర్లాండ్ పేరిట ఉంది. టి20 ప్రపంచకప్ 2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ 68 పరుగులకు ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 138 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 50 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలిన ఐదు వికెట్లను కేవలం 18 పరుగుల తేడాతో జార్చుకొని అత్యల్ప స్కోరును నమోదు చేసింది. విండీస్ బౌలర్లు రవి రాంపాల్, డారెన్ సామీలు ఐర్లాండ్ లైనఫ్‌ను కుప్పకూల్చారు.
చదవండి: T20 WC 2021: మెంటార్‌గా పని ప్రారంభించిన ధోని.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment