పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే | Delhi Capitals Made Joint Lowest Powerplay Score Vs RR Same Season | Sakshi
Sakshi News home page

DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే

Published Sat, Sep 25 2021 5:06 PM | Last Updated on Sat, Sep 25 2021 5:51 PM

Delhi Capitals Made Joint Lowest Powerplay Score Vs RR Same Season - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో పవర్‌ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పవర్‌ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు తొలి అంచె పోటీల్లోనూ తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా ఈ పరుగులు నమోదు చేసింది కూడా రాజస్తాన్‌ రాయల్స్‌పైనే కావడం విశేషం. ఇక్కడ పరుగులు(36) సమానంగా ఉన్నాయి.. వికెట్లు మాత్రమే(3) ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపొందింది.

చదవండి: టి20 క్రికెట్‌లో కోహ్లి అరుదైన ఘనత

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హెట్‌మైర్‌ 28(5 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. లలిత్‌ యాదవ్‌(3) అతనికి సహకరిస్తున్నాడు. అంతకముందు ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్‌(8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌(43), రిషబ్‌ పంత్‌(24)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ నడిపించారు.

చదవండి: RCB New Captain: డివిలియర్స్‌ కెప్టెన్‌ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement