Powerplay
-
T20 World Cup 2024: చెత్త రికార్డు సమం చేసిన శ్రీలంక
టీ20 వరల్డ్‌కప్ 2024 గ్రూప్-డిలో భాగంగా ఇవాళ (జూన్ 3) శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో తొలుత బ్యాటింగ్‌ను ఎంచుకున్నట్లు లంక కెప్టెన్ హసరంగ టాస్ సందర్భంగా చెప్పాడు. అయితే ఈ విషయంలో హసరంగ అంచనాలు తారుమారయ్యాయి. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలుత ఓట్నీల్ బార్ట్‌మన్ (2-1-3-1), ఆతర్వాత కేశవ్ మహారాజ్ (4-0-22-2), అన్రిచ్ నోర్జే (3-0-6-3) లంకేయులకు దారుణంగా దెబ్బ తీశారు. నిస్సంక (3), కుశాల్ మెండిస్ (19), కమిందు మెండిస్ (11), హసరంగ (0), సమరవిక్రమ (0), అసలంక (6) దారుణంగా విఫలం కాగా.. ఏంజెలో మాథ్యూస్ (9), దసున్ షనక (9) లంకను మూడంకెల స్కోర్ దాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. 14 ఓవర్ల తర్వాత లంక స్కోర్ 61/6గా ఉంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓ చెత్త రికార్డు సమం చేసింది. టీ20 వరల్డ్‌కప్ పవర్ ప్లేల్లో (తొలి 6 ఓవర్లు) తమ అత్యల్ప స్కోర్‌ను సమం చేసింది. ఈ మ్యాచ్ పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. 2022 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీలంక 24 పరుగులకే పరిమితమైంది. అయితే మ్యాచ్‌లో శ్రీలంక ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. టీ20 ప్రపంచకప్ పవర్ ప్లేల్లో శ్రీలంక మూడో అత్యల్ప స్కోర్ 2007లో నమోదైంది. కేప్‌టౌన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 4 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేశారు. -
దీపక్ చహర్ అరుదైన ఘనత..
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే బౌలర్ దీపక్ చహర్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సాహాను ఔట్ చేయడం ద్వారా దీపక్ చహర్ ఒక రికార్డు అందుకున్నాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీపక్ చహర్ మూడో స్థానంలో నిలిచాడు. పవర్ ప్లేలో ఇప్పటివరకు దీపక్ చహర్ 53 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ కూడా అన్నే వికెట్లతో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 61 వికెట్లతో ఉండగా.. 55 వికెట్లతో సందీప్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 52 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. Deepak Chahar 🤝 Wickets in Powerplay 🕺 A #Yellove story for the ages! 💯#GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema | @ChennaiIPL @deepak_chahar9 pic.twitter.com/Ethh2nnjZu — JioCinema (@JioCinema) May 23, 2023 చదవండి: #NoBall: ఒక్క నోబాల్ ఖరీదు 60 పరుగులు.. -
IND VS IRE 1st T20: భువీ ఖాతాలో అరుదైన రికార్డు
Bhuvaneshwar Kumar: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆండ్రూ బల్బిర్నీ వికెట్ పడగొట్టడం ద్వారా భువీ పొట్టి ఫార్మాట్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (34 వికెట్లు) సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. భువీకి ముందు ఈ రికార్డు విండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీల పేరిట ఉండేది. వీరిద్దరు పవర్ ప్లేలో 33 వికెట్లు సాధించారు. డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫలితంగా హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భువీ తొలి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. భువీ తన స్పెల్‌లో మెయిడిన్ కూడా వేయడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఈ ఓవర్లో భువీ బౌలింగ్ చేస్తుండగా స్పీడోమీటర్ మూడు సార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్లు చూపించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు వేసిన బంతి 201 Km/h, అదే విధంగా బల్బిర్నీ ఎదుర్కొన్న రెండు బంతులు 208, 201 కిమీ వేగంతో విసిరినట్లుగా రికార్డైంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట నమోదై ఉంది. చదవండి: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. త్వరలోనే ఐపీఎల్లో ఆడుతాడు' -
పూర్వ వైభవం సాధించే పనిలో క్రికెటర్.. ఐపీఎల్లో అరుదైన ఫీట్
కేకేఆర్ స్టార్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్లో అరుదైన ఫీట్ సాధించాడు. పవర్ ప్లేలో 50 వికెట్లు సాధించిన నాలుగో ఆటగాడిగా ఉమేశ్ యాదవ్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మయాంక్‌ను ఎల్బీ చేయడం ద్వారా ఉమేశ్ ఈ ఘనత అందుకున్నాడు. కాగా ఉమేశ్ యాదవ్ కంటే ముందు జహీర్ ఖాన్(52 వికెట్లు), సందీప్ శర్మ(52 వికెట్లు), భువనేశ్వర్ కుమార్(51 వికెట్లు) వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా టీమిండియా తరపున టి20లు, వన్డేలకు దూరమైన ఉమేశ్ కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఒక రకంగా ఐపీఎల్లో అతని ఎంట్రీ సూపర్ అనే చెప్పొచ్చు. 2019 నుంచి ఉమేశ్ యాదవ్ అంతర్జాతీయంగా ఒక్క టి20 మ్యాచ్ ఆడలేదు. ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు జరిగిన మెగావేలంలో ఉమేశ్‌ను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. తొలి రెండు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిన ఉమేశ్ యాదవ్.. మూడో రౌండ్లో కేకేఆర్ కేకేఆర్ కొనుగోలు చేసింది. మొత్తానికి ఉమేశ్ యాదవ్ మరోసారి మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న ఆర్నెళ్లలో జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు టీమిండియాకు ఎంపికైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉమేశ్ పూర్వ వైభవం అందుకునే పనిలో ఉన్నాడు.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: IPL 2022: జడ్డూ చేతులెత్తేశాడా.. అందుకే ధోని రంగంలోకి ? Most IPL wickets in first 6 overs 52 - Zaheer Khan 52 - Sandeep Sharma 51 - Bhuvneshwar Kumar 50* - Umesh Yadav#IPL2022 #KKRvsPBKS — S. Kuila (@sukriti_stats) April 1, 2022 -
మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం..
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీలు లక్నో బౌలర్లను ఊతచకోత కోశారు. పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఇద్దరు పవర్ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరును వికెట్ నష్టానికి 73 పరుగులు చేశారు.కాగా పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేయడం సీఎస్కేకు ఇది నాలుగోసారి. ఇంతకముందు 2014లో పంజాబ్ కింగ్స్‌పై 100/2, 2015లో ముంబై ఇండియన్స్‌పై 90/0, 2018లో కేకేఆర్‌పై 75/1, తాజాగా లక్నోపై 73 పరుగులు చేసింది. అయితే నాలుగుసార్లు పవర్ ప్లేలో అత్యధిక స్కోర్లు చేసిన సీఎస్కే.. విచిత్రంగా మూడుసార్లు అదే పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్లను కూడా నమోదు చేసింది.పవర్ ప్లే చెత్త రికార్డులు సీఎస్కే పేరిట మూడు ఉన్నాయి. 2011, 2015, 2019లో సీఎస్కే పవర్ ప్లేలో వరుసగా 15/2(కేకేఆర్‌పై), 16/1(ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 16/1(ఆర్సీబీపై) చేసింది. ఇది చూసిన అభిమానులు.. ''మంచి రికార్డులు.. చెడ్డ రికార్డులు ఏవైనా సీఎస్కేకే సాధ్యం'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: IPL 2022: కాన్వేకు మరొక అవకాశం ఇవ్వాల్సింది! Ruturaj Gaikwad: ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు -
పవర్ ప్లేను కూడా వదలని ఎస్ఆర్హెచ్.. ఇంకెన్ని చూడాలో!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మంచి రికార్డుల కంటే చెత్త రికార్డులనే ఎక్కువగా నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు పోటాపోటీగా నో బాల్స్ వేయడం.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బౌండరీలు, సిక్సర్ల రూపంలో ధారాళంగా పరుగులిచ్చుకుంది. అలా 211 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు తొలి పవర్ ప్లేలో వరుస షాక్‌లు తగిలాయి. 6 ఓవర్లు ముగిసేలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 14 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేయడంతో పాటు ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతకముందు 2009లో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2011, 2015, 2019లో సీఎస్కే పవర్ ప్లేలో వరుసగా 15/2(కేకేఆర్‌పై), 16/1(ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 16/1(ఆర్సీబీపై) స్కోర్లు చేసింది. అయితే ఈ చెత్త రికార్డులు సీఎస్కే ఖాతాలో మూడు ఉన్నప్పటికి.. పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ను మరోసారి ట్రోల్ చేశారు. ''ఎస్ఆర్హెచ్.. మరీ ఇంత దారుణమా''.. ''ఏ జట్టైనా మంచి రికార్డుల కోసం పోటీపడుతుంది.. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం చెత్త రికార్డుల్లో ముందుంటుంది. తాజాగా పవర్ ప్లేను కూడా వదల్లేదు.. ఇంకెన్నీ చూడాలో''.. ''ప్రతీ ఐపీఎల్‌లోనూ ఏదో ఒక చెత్త జట్టును చూస్తాం.. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం వరుసగా రెండో ఏడాది అదే రీతిలో కనిపిస్తుంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ Bhuvaneshwar Kumar: చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు -
రాజస్తాన్ రాయల్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్ ప్లే ముగియడం ఐపీఎల్లో 2011 తర్వాత ఇది రెండోసారి మాత్రమే. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే తాజాగా రాజస్తాన్ కూడా పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. అంతేగాక 2021 ఐపీఎల్లో పవర్ ప్లే పరంగా రాజస్తాన్ రాయల్స్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసిన రాయల్స్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై 21/3(పంజాబ్ కింగ్స్‌పై), సీఎస్కే 24/4(ముంబైపై), కేకేఆర్ 25/1(రాజస్తాన్ రాయల్స్‌పై) వరుసగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ చేధనలో తడబడుతుంది. టాప్‌క్లాస్ ఆటతో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్స్ ప్రదర్శన చిన్నబోతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. రాజస్తాన్ విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు కావాల్సి ఉంది. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. -
పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు తొలి అంచె పోటీల్లోనూ తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా ఈ పరుగులు నమోదు చేసింది కూడా రాజస్తాన్ రాయల్స్‌పైనే కావడం విశేషం. ఇక్కడ పరుగులు(36) సమానంగా ఉన్నాయి.. వికెట్లు మాత్రమే(3) ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ గెలుపొందింది. చదవండి: టి20 క్రికెట్లో కోహ్లి అరుదైన ఘనత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హెట్‌మైర్ 28(5 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. లలిత్ యాదవ్(3) అతనికి సహకరిస్తున్నాడు. అంతకముందు ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్(8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(43), రిషబ్ పంత్(24)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నడిపించారు. చదవండి: RCB New Captain: డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్ -
నేనూ విజయ్ మరో సర్ప్రైజ్ ఇస్తాం
‘‘ఒరేయ్ బుజ్జిగా’ లాంటి ఎంటర్టైనర్ తర్వాత మా టీమ్ అంతా కలిసి సరికొత్త జోనర్లో చేసిన థ్రిల్లర్ ‘పవర్ ప్లే’. విజయ్‌గారు, నంద్యాల రవిగారు, మధునందన్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశారు. నేను, విజయ్‌గారు త్వరలో మరో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం’’ అన్నారు రాజ్ తరుణ్. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం ‘పవర్ ప్లే’. హేమల్ ఇంగ్లే కథానాయిక. పూర్ణ, మధు నందన్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. పద్మ సమర్పణలో మహిధర్, దేవేష్ నిర్మించిన ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘పవర్ ప్లే’ ట్రైలర్‌ను మీడియా తరఫున సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత బి.ఎ.రాజు విడుదలచేశారు. విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ– ‘‘రాజ్ తరుణ్ ఇంతవరకూ చేయని ఒక కొత్త జోనర్లో ఈ సినిమా చేశాడు. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం’’ అన్నారు దేవేష్. ‘‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పలపర్తి అనంత్ సాయి. ‘‘ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు హేమల్. ‘‘ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు పూర్ణ. ‘‘ఈ సినిమాకి కథ, మాటలు రాశాను’’ అన్నారు నంద్యాల రవి. -
వాపోయిన యువరాజ్ సింగ్!
చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ వల్లే ఓడామని నిర్వేదం! పవర్ ప్లేలో చెత్త బౌలింగ్, నిర్లక్ష్యంతో కూడిన ఫీల్డింగ్ వల్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయిందని ఆ జట్టు ఆటగాడు యువరాజ్‌సింగ్ వాపోయాడు. మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఎట్టకేలకు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువీ అద్భుతంగా రాణించి.. 41 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 185 పరుగులు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ తమ వంతుగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అధిగమించగలిగింది. తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. మ్యాచ్ అనంతరం యువీ మాట్లాడుతూ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని చెప్పాడు. జట్టు ప్రధాన బౌలర్ ఆశిష్ నెహ్రా లేకపోవడం కూడా దెబ్బతీసిందని, అతను తిరిగి వస్తే జట్టు బౌలింగ్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మొదటి ఆరు ఓవర్లలో మేం చాలా పరుగులు ఇచ్చాం. కీలకమైన కరుణ్ నాయర్ క్యాచ్‌ను వదిలేశాం. ఆరంభంలోనే మేం వికెట్లు తీసుకొని ఉంటే మ్యాచ్‌పై అదుపు సాధించి ఉండేవాళ్లం. మా బౌలర్లు గొప్ప ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. మిడిల్ ఓవర్లలోనూ మేం వికెట్లు తీసుకోలేకపోయాం. వచ్చిన ప్రతి ఢిల్లీ ఆటగాడు 30-40 పరుగులు చేశాడు' అని యువీ అన్నాడు. ప్రస్తుతానికి భువీ (భువనేశ్వర్‌కుమార్, రషీద్ (ఖాన్)పై ఎక్కువగా ఆధారపడుతున్నామని, నెహ్రా వస్తే బౌలింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశముందని చెప్పాడు.