రాజస్తాన్‌ రాయల్స్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే | Rajastan Royals No Boundaries Powerplay 2nd Time After 2011 IPL History | Sakshi
Sakshi News home page

IPL 2021: బౌండరీ లేకుండా ముగిసిన పవర్‌ ప్లే.. 2011 తర్వాత రెండోసారి

Published Sat, Sep 25 2021 6:42 PM | Last Updated on Sat, Sep 25 2021 6:58 PM

Rajastan Royals No Boundaries Powerplay 2nd Time After 2011 IPL History - Sakshi

No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ పవర్‌ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్‌ ప్లే ముగియడం ఐపీఎల్‌లో 2011 తర్వాత ఇది రెండోసారి మాత్రమే. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే పవర్‌ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది.

చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే

తాజాగా రాజస్తాన్‌ కూడా పవర్‌ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. అంతేగాక 2021 ఐపీఎల్‌లో పవర్‌ ప్లే పరంగా రాజస్తాన్‌ రాయల్స్‌ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పవర్‌ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసిన రాయల్స్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై 21/3(పంజాబ్‌ కింగ్స్‌పై), సీఎస్‌కే 24/4(ముంబైపై), కేకేఆర్‌ 25/1(రాజస్తాన్‌ రాయల్స్‌పై) వరుసగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ చేధనలో తడబడుతుంది. టాప్‌క్లాస్‌ ఆటతో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందు రాయల్స్‌ ప్రదర్శన చిన్నబోతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. రాజస్తాన్‌ విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు కావాల్సి ఉంది. 

చదవండి: IPL 2021: ఐపీఎల్‌లో టిమ్‌ డేవిడ్‌ సరికొత్త రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement