Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే బౌలర్ దీపక్ చహర్ అరుదైన ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సాహాను ఔట్ చేయడం ద్వారా దీపక్ చహర్ ఒక రికార్డు అందుకున్నాడు. అదేంటంటే ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దీపక్ చహర్ మూడో స్థానంలో నిలిచాడు.
పవర్ ప్లేలో ఇప్పటివరకు దీపక్ చహర్ 53 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ కూడా అన్నే వికెట్లతో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో భువనేశ్వర్ కుమార్ 61 వికెట్లతో ఉండగా.. 55 వికెట్లతో సందీప్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ 52 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Deepak Chahar 🤝 Wickets in Powerplay 🕺
— JioCinema (@JioCinema) May 23, 2023
A #Yellove story for the ages! 💯#GTvCSK #TATAIPL #Qualifier1 #IPLonJioCinema | @ChennaiIPL @deepak_chahar9 pic.twitter.com/Ethh2nnjZu
Comments
Please login to add a commentAdd a comment