ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. రుతురాజ్ గైక్వాడ్ ఒక్క పరుగు మాత్రమే చేసి రనౌటయ్యాడు. ఆ తర్వాత రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీలు లక్నో బౌలర్లను ఊతచకోత కోశారు. పోటాపోటీగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించిన ఈ ఇద్దరు పవర్ ప్లే ముగిసేసరికి జట్టు స్కోరును వికెట్ నష్టానికి 73 పరుగులు చేశారు.కాగా పవర్ ప్లేలో అత్యధిక స్కోరు చేయడం సీఎస్‌కేకు ఇది నాలుగోసారి. ఇంతకముందు 2014లో పంజాబ్ కింగ్స్‌పై 100/2, 2015లో ముంబై ఇండియన్స్‌పై 90/0, 2018లో కేకేఆర్‌పై 75/1, తాజాగా లక్నోపై 73 పరుగులు చేసింది.
అయితే నాలుగుసార్లు పవర్ ప్లేలో అత్యధిక స్కోర్లు చేసిన సీఎస్‌కే.. విచిత్రంగా మూడుసార్లు అదే పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్లను కూడా నమోదు చేసింది.పవర్ ప్లే చెత్త రికార్డులు సీఎస్‌కే పేరిట మూడు ఉన్నాయి. 2011, 2015, 2019లో సీఎస్‌కే పవర్ ప్లేలో వరుసగా 15/2(కేకేఆర్‌పై), 16/1(ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 16/1(ఆర్‌సీబీపై) చేసింది. ఇది చూసిన అభిమానులు.. ''మంచి రికార్డులు.. చెడ్డ రికార్డులు ఏవైనా సీఎస్‌కేకే సాధ్యం'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: IPL 2022: కాన్వేకు మరొక అవకాశం ఇవ్వాల్సింది!
Ruturaj Gaikwad: ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు
Comments
Please login to add a commentAdd a comment