
Courtesy: IPL Twitter
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ�...
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా...
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2 మెయిన్స్ ప�...
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫై...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్�...
ఈ భూమ్మీద అత్యంత ధనికుడు ఎవరు?.. ప్రస్�...
నల్లగొండ: ఎస్ఎల్బీసీ పనుల్లో శనివారం...
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్త...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇది కాల�...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనా...
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రిత�...
పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మ...
గుంటూరు, సాక్షి: తనపై తప్పుడు కేసు నమ�...
బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత, కర�...
న్యూఢిల్లీ: అమెరికా 21 మిలియన్ డాలర్ల...
Published Thu, Mar 31 2022 7:02 PM | Last Updated on Thu, Mar 31 2022 11:41 PM
Courtesy: IPL Twitter
IPL 2022: సీఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఎవిన్ లూయిస్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు సాధించగా.. అంతకముందు డికాక్ 61 పరుగులు, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌పాండే తలా ఒక వికెట్ తీశారు.
లక్నో సూపర్‌జెయింట్స్ మనీష్ పాండే(5) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. డికాక్ 53, ఎవిన్ లూయిస్ 5 పరుగులతో ఆడుతున్నారు.
కేఎల్ రాహుల్(40)రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. డికాక్ 52, మనీష్ పాండే 5 పరుగులతో ఆడుతున్నారు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ధీటుగా బదులిస్తుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 48, కేఎల్ రాహుల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 18, డికాక్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. శివమ్ దూబే 49 పరుగులతో మెరుపులు మెరిపించగా.. ధోని ఆఖర్లో(6 బంతుల్లో 16, 2 ఫోర్లు, ఒక సిక్స్) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఊతప్ప 50, శివమ్ దూబే 49, మొయిన్ అలీ 35 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయి తలా రెండు వికెట్లు తీశారు.
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శివమ్ దూబే 47, జడేజా 12 పరుగుతలతో ఆడుతున్నారు. అంతకముందు 27 పరుగులు చేసిన రాయుడు రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. శివమ్ దూబే 30, అంబటి రాయుడు 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముంఉద రాబిన్ ఊతప్ప 50, మొయిన్ అలీ 35 పరుగులు చేసి ఔటయ్యారు.
సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మొయిన్ అలీ.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
84 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప.. బిష్ణోయి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
రుతురాజ్ ఒక్క పరుగుకే వెనుదిరిగినప్పటికి.. సీఎస్కే దూకుడైన ఆటతీరు కనబరుస్తోంది. తొలి పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 45, మొయిన్ అలీ 21 పరుగులతో ఆడుతున్నారు.
రుతురాజ్ గైక్వాడ్(1) రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గైక్వాడ్ షాట్ ఆడాడు. అయితే సింగిల్ కోసం ప్రయత్నించి రవి బిష్ణోయి డైరెక్ట్ త్రోకు రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఊతప్ప 21. మొయిన్ అలీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను సీఎస్కే ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 20, రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగతో క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఇరుజట్లు తలపడడం ఇదే తొలిసారి.
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలవ్వగా.. అటు గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం చవిచూసింది. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుంది.. ఎవరు బోణీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment