Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే స్టార్ బౌలర్ దీపక్ చహర్ పెద్దగా మెరవడం లేదు. గాయం కారణంగా సీజన్‌లో చహర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 97 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తాజాగా లక్నో సూపరజెయింట్స్తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ ఘోరంగా ఫెయిలయ్యాడు.
నాలుగు ఓవర్లు వేసి 10.25 ఎకానమీ రేటుతో 41 పరుగులు సమర్పించుకున్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ తన కెప్టెన్ ధోని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. టాస్ సమయంలో చహర్ గురించి ధోని ప్రస్తావించాడు. ''చహర్ గాయం నుంచి కోలుకోవడంతో ఆకాశ్ సింగ్‌ను తప్పించాం.. స్లోపిచ్‌పై చహర్ మెరిసే అవకాశం ఉంది. అందుకే అతను తుది జట్టులోకి తీసుకున్నాం'' అని ధోని పేర్కొన్నాడు. కానీ ధోని మంత్రం పనిచేయకపోగా.. చహర్ విఫలమయ్యాడు.
2019లో సీఎస్‌కే తరపున 22 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్ చహర్ ఆ తర్వాత 2020లో 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు. ఇక 2021 సీస్‌కే ఛాంపియన్‌గా నిలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన చహర్‌ను ఆ తర్వాత జరిగిన మెగా వేలంలో సీఎస్‌కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ దీపక్ చహర్ గాయం కారణంగా 2022 ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్‌లోనూ గాయంతో పెద్దగా ఆడింది లేదు.
Comments
Please login to add a commentAdd a comment