టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు | T20 World Cup 2021: Australia Worst Record 3rd Lowest Total T20 World Cups | Sakshi
Sakshi News home page

టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు

Published Sat, Oct 30 2021 10:01 PM | Last Updated on Sat, Oct 30 2021 10:46 PM

T20 World Cup 2021: Australia Worst Record 3rd Lowest Total T20 World Cups - Sakshi

Australia 3rd Lowest Total In T20 World Cups.. టి20 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్‌ అయింది. టి20 ప్రపంచకప్‌ల్లో ఆస్ట్రేలియాకు ఇది మూడో అత్యల్ప స్కోరు. ఇంతకముందు 2014 టి20 ప్రపంచకప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌట్‌ అయింది. అంతకముందు 2012 టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై 117 పరుగులు చేసింది. తాజాగా మరోసారి ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. 

అంతకముందు ఈ ప్రపంచకప్‌లో తొలి పవర్‌ప్లే( ఆరు ఓవర్లు) అతి తక్కువ స్కోరు చేసిన జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 21 పరుగులు మాత్రమే చేసింది. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన అర్హత మ్యాచ్‌లో పపువా న్యూ గినియా తొలి ఆరు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 17 పరుగులతో తొలి స్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement