T20 WC 2021: లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డు | T20 World Cup 2021: England Wins Most Balls Spare For T20I 3rd Time | Sakshi
Sakshi News home page

T20 WC 2021: లక్ష్య చేధనలో ఇంగ్లండ్‌ సరికొత్త రికార్డు

Published Sat, Oct 30 2021 11:28 PM | Last Updated on Sat, Oct 30 2021 11:28 PM

T20 World Cup 2021: England Wins Most Balls Spare For T20I 3rd Time - Sakshi

ENG Win Matches With Most Balls Spare 3rd Time T20Is.. టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 11.4 ఓవర్లలోనే చేధించింది. ఈ సందర్భంగా ఇంగ్లండ్‌ లక్ష్య చేధనలో సరికొత్త రికార్డు సాధించింది. టి20 క్రికెట్‌లో ఎక్కువ బంతులు మిగిలిఉండగా ఇంగ్లండ్‌ మూడుసార్లు విజయం సాధించింది. ఇవన్నీ ఈ ఏడాదిలోనే సాధించగా.. అందులో రెండు టి20 ప్రపంచకప్‌ 2021లోనే నమోదవ్వడం విశేషం.

చదవండి: AUS Vs ENG: వారెవ్వా వోక్స్‌..  సింగిల్‌ హ్యాండ్‌తో స్టన్నింగ్‌ క్యాచ్‌

తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 126 పరుగుల లక్ష్యాన్ని మరో 50 బంతులుండగా చేధించింది. ఇంతకముందు సూపర్‌ 12లో వెస్టిండీస్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో 56 పరుగుల టార్గెట్‌ను 70 బంతులు ఉండగానే దక్కించుకుంది. మరోసారి విండీస్‌పైనే 72 పరుగుల టార్గెట్‌ను 57 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది.  

చదవండి: Jos Buttler: టి20 ప్రపంచకప్‌ 2021లో అత్యంత వేగవంతమైన అర్థశతకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement