ఇంగ్లండ్ తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ చరిత్ర పుటల్లోకెక్కాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. బ్రూక్ ఈ ఘనతను తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సాధించాడు. బ్రూక్ 25 ఏళ్ల 215 రోజుల వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా సెంచరీ సాధించాడు.
గతంలో ఈ రికార్డు అలిస్టర్ కుక్ పేరిట ఉండేది. కుక్ 26 ఏళ్ల 190 రోజుల వయసులో ఇంగ్లండ్ వన్డే జట్టు కెప్టెన్‌గా సెంచరీ చేశాడు. ఈ జాబితాలో బ్రూక్, కుక్ తర్వాత ఇయాన్ మోర్గాన్ (26 ఏళ్ల 358 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 50 రోజులు), అలిస్టర్ కుక్ (27 ఏళ్ల 52 రోజులు) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. 348 రోజుల తర్వాత ఆస్ట్రేలియా ఓ వన్డే మ్యాచ్‌లో ఓడింది. ఆ జట్టు వరుసగా 14 మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఓ మ్యాచ్‌ను కోల్పోయింది. నిన్న (సెప్టెంబర్ 24) చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 46 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (60), అలెక్స్ క్యారీ (77 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు.
Harry Brook's 15 boundaries Vs Australia.
- A match winning hundred by captain Brook. ⭐pic.twitter.com/RDCF37v3c1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 25, 2024
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలై ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్‌ను విజేతగా నిర్దారించారు. బ్రూక్ 94 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
విల్ జాక్స్ 82 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 84 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ (33) బ్రూక్‌కు జతగా అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్‌లోని నాలుగో వన్డే సెప్టెంబర్ 27న లార్డ్స్‌లో జరుగుతుంది.
చదవండి: హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ.. ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
Comments
Please login to add a commentAdd a comment