ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘనవిజయం.. సెమీస్ బెర్తు దాదాపు ఖరారు
సమయం: 22:27.. టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 72 పరుగులు; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయడంతో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నట్లే. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే సెమీస్‌లో అడుగుపెడుతుంది.
అంతకముందు ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్స్ బెంబెలెత్తిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేక నానా అవస్థలు పడింది. ఆరోన్ ఫించ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, టైమల్ మిల్స్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
సమయం: 22:15.. జాస్ బట్లర్ మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో అర్థశతకం మార్క్‌ను అందుకున్నాడు. కాగా 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ చేధిస్తుంది. ప్రస్తుతం 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
సమయం: 22:00.. జేసన్ రాయ్(22) రూపంలో ఇంగ్లండ్ 66 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
సమయం: 21:55.. ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపించడంతో విజయానికి మరింత దగ్గరైంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. రాయ్ 22 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు.
సమయం: 21:41.. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. రాయ్ 20, బట్లర్ 24 పరుగులతో ఆడుతున్నారు.
ఆస్ట్రేలియా 125 ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 126
సమయం: 21:15.. టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్స్ బెంబెలెత్తిపోయారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ పరుగులు చేయలేక నానా అవస్థలు పడింది. ఆరోన్ ఫించ్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగిలిన బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి ఐదుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3, టైమల్ మిల్స్, క్రిస్ వోక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
సమయం: 21:05.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అంతకముందు ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.
కష్టాల్లో ఆసీస్.. 51 పరుగులకే సగం వికెట్లు డౌన్
సమయం 20:21.. ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. 12 ఓవర్లలో కేవలం 51 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. లివింగ్‌స్టోన్ వేసిన 11.4వ ఓవర్లో జేసన్ రాయ్ క్యాచ్ పట్టడంతో మాథ్యూ వేడ్(18 బంతుల్లో 18; 2 ఫోర్లు) పెవిలియన్ బాట పట్టాడు. క్రీజ్‌లో ఆరోన్ ఫించ్(22), ఆస్టన్ అగర్ ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌లకు తలో వికెట్ దక్కింది.
9 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. ఫించ్ 18, వేడ్ 9 పరుగులతో ఆడుతున్నారు.
మ్యాక్స్‌వెల్(6) ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
సమయం: 19:51.. 15 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. వోక్స్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్(6) ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 15 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 7, స్టోయినిస్ క్రీజులో ఉన్నారు.
సమయం: 19:41.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి వోక్స్ బౌలింగ్‌లో వార్నర్(1) బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత స్మిత్(1) జోర్డాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది.
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 గ్రూఫ్ 1లో నేడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు చెరో రెండు విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు టాప్ ప్లేస్‌లో నిలుస్తారు. ఇక ఇరుజట్ల మధ్య టి20 ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు జరగ్గా.. చెరో విజయాన్ని సాధించాయి. ఇందులో టి20 ప్రపంచకప్ 2010 ఫైనల్ ఉండడం విశేషం. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచి టి20 చాంపియన్‌గా అవతరించింది. ఇక టి20ల్లో ఇరుజట్లు 19 సార్లు పోటీపడగా.. ఆస్ట్రేలియా 10సార్లు.. ఇంగ్లండ్ 8 సార్లు విజయాలు సాధించాయి.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
ఇంగ్లండ్ : జాసన్ రాయ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్
Comments
Please login to add a commentAdd a comment