
West Indies Lowest Totals T20WC.. టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ చెత్త రికార్డును నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ 55 పరుగులకే ఆలౌట్ అయి టి20 ప్రపంచకప్‌లో మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా చూసుకుంటే టి20 వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్లు రెండుసార్లు నమోదు చేసిన జట్టుగా నెదర్లాండ్స్ తొలి స్థానంలో నిలిచింది. 2014 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 39 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ నెదర్లాండ్స్ 42 పరుగులకే కుప్పకూలింది. ఇక న్యూజిలాండ్(శ్రీలంకపై 2014టి 20 వరల్డ్ కప్, 60 పరుగులు) నాలుగో స్థానంలో ఉంది.
చదవండి: T20 WC 2021: దక్షిణాఫ్రికాకు ఇది నాలుగోసారి
ఇక వెస్టిండీస్ టి20ల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది నాలుగోసారి. ఇందులో మూడుసార్లు(45, 71, 55) ఇంగ్లండ్‌పైనే నమోదు చేయడం విశేషం. ఇక 2018లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 60 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: T20 WC 2021 ENG Vs WI: కూప్పకూలిన వెస్టిండీస్.. 55 పరుగులకే ఆలౌట్
Glenn Maxwell: అక్కడ నెంబర్‌వన్ బౌలర్.. ప్రతీసారి స్విచ్‌హిట్ పనికిరాదు