ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆసీస్ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముందు ఉంచింది. అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయాన్ని అడ్డుకోవడం టీమిండియాకు కత్తిమీద సాము లాంటిదే. అయినా సరే ఒకవేళ టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం 141 రికార్డు బద్దలవడం ఖాయం. ఎందుకంటే టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప టార్గెట్‌ను నిలబెట్టుకున్న జట్టుగా ఆస్ట్రేలియాకు రికార్డు ఉంది.
1883లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 85 పరుగుల అత్యల్ప టార్గెట్‌ను ఆసీస్ కాపాడుకుంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 63 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ డిక్ బార్లో ఐదు వికెట్లు తీయగా, టెడ్ పీటే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లండ్ 101 పరుగులకు ఆలౌట్ అయింది. ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్ ఏడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 122 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్ ముందు 85 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్ష్య చేధనలో విఫలమైన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అప్పటి మ్యాచ్, ఇవాళ ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక అంశం మాత్రం ఆసక్తిగా మారింది. అది టాస్. అప్పటిమ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఏంచుకుంది. ఇప్పుడు కూడా టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. మరి నిజంగా టీమిండియా 75 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోగలిగితే మాత్రం టెస్టు చరిత్రలో ఒక రికార్డులా మిగిలిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment