IND Vs AUS Day-2 Full Analysis.. ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య టెస్టు సిరీస్ ఏ ముహూర్తానా మొదలైందో తెలియదు కానీ తొలి రెండు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. ఇక ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టు కూడా అదే బాటలో వెళుతుంది. మళ్లీ అదే రెండున్నర రోజుల్లో ముగియనున్న టెస్టు మ్యాచ్‌లో సీన్ మాత్రం రివర్స్ అయింది. తొలి రెండు టెస్టుల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లను ముగించింది.
ఈసారి మాత్రం ఆ బాధ్యతను ఆస్ట్రేలియా తీసుకున్నట్లుంది. రెండోరోజు ఆటలో టీమిండియాను రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా ఆసీస్ ముందు భారత్ 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ గెలుపును అడ్డుకోవడం కష్టమే. ఒకవేళ ఆసీస్‌ను దరిద్ర వెంటాడితే మాత్రం టీమిండియా మ్యాచ్ గెలవడం చూస్తాం. ఎలా చూసుకున్నా మ్యాచ్ ముగిసేది మాత్రం అదే రెండున్నర రోజుల్లోనే.
మరి యాదృశ్చికమో లేక అలా జరుగుతుందో తెలియదు కానీ.. మూడు మ్యాచ్‌లు అదే తరహాలో రెండు రోజుల్లోనే ముగియడం చర్చకు తావిస్తుంది. రెండున్నర రోజుల్లోనే ముగిసేలా పిచ్‌లను తయారు చేస్తే అప్పుడు టెస్టు మ్యాచ్‌లాడి ఎందుకు అని పలువురు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఉపఖండంలో టెస్టు మ్యాచ్ అంటే మొదటి రెండున్నర రోజులు బ్యాటింగ్‌కు.. తర్వాతి రెండున్నర రోజులు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని చెప్పుకునేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకవైపు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్ అంటూ హడావిడి చేస్తుంది. అయితే ఇంగ్లండ్ ఆడుతున్న మ్యాచ్‌లు దాదాపు ఐదు రోజులు జరుగుతున్నాయి. కానీ టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లు మాత్రం రెండు, మూడు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. పలానా జట్టు సొంతగడ్డపై ఆడుతుందంటే అనుకూలంగా పిచ్‌లు తయారు చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఈసారి క్యురేటర్లు కాస్త ఎక్కువగా ఆలోచించినట్లున్నారు. టీమిండియాకు అనుకూలంగా ఉండాలని పిచ్‌లు తయారు చేస్తున్నారు. కానీ ఈసారి ఫలితం మనకు వ్యతిరేకంగా వచ్చింది.
ఏ స్పిన్ అస్త్రంతో ఆసీస్‌ను ఇబ్బంది పెట్టాలని చూశామో.. అదే స్పిన్ ఉచ్చులో పడి టీమిండియా ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ విషయంలో టీమిండియాది తప్పా.. పిచ్ క్యురేటర్‌ది తప్పా అని ఆలోచించడం కంటే ఇలాంటివి మరీ ఎక్కువగా జరగకుండా చూసుకుంటే మంచింది. ఎందుకంటే ఉపఖండపు పిచ్‌లపై స్పిన్‌కు బాగా అలవాటు పడిన మన బ్యాటర్లు.. ఇంగ్లండ్, ఆసీస్ లాంటి ఫాస్ట్ పిచ్‌లపై ఆడడం కష్టతరంగా మారుతుంది. రానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దృష్టి పెట్టి ఆడితే మంచిదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: 8 వికెట్లతో దుమ్మురేపిన లియోన్.. పలు రికార్డులు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment