Courtesy: IPL Twitter
Mumbai Indians Best Record Low Scoring Matches.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ ఢిల్లీకి 130 పరుగుల టార్గెట్‌ను విధించింది. కాగా తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో ముంబైకి మంచి రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడుసార్లు లోస్కోరింగ్ మ్యాచ్‌లను కాపాడుకోగలిగింది. 2012లో పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 పరుగులు మాత్రమే చేసిన ముంబై ఆ మ్యాచ్‌ను గెలుచుకుంది.
ఆ తర్వాత 2017లో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా రైజింగ్ పుణే జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 129 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని టైటిల్ విజేతగా నిలిచింది. ఇక 2019లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యాన్ని ముంబై కాపాడుకొని మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే ఢిల్లీకి కూడా లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 130 కంటే తక్కువ పరుగుల లక్ష్య చేధనలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది.
చదవండి: Rohit And Pant: టాస్ సమయంలో పంత్, రోహిత్‌ల మధ్య ఏం జరిగింది!
Venkatesh Iyer: అయ్యారే అయ్యర్.. కేకేఆర్ తరపున రెండో బ్యాటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment