BGT 2023: Team India Registered 4th Lowest Total At Home In Last 15 Years - Sakshi
Sakshi News home page

IND Vs AUS: 15 ఏళ్లలో ఇది నాలుగోసారి..

Published Wed, Mar 1 2023 1:10 PM | Last Updated on Wed, Mar 1 2023 1:46 PM

BGT 2023:Team India Registered-4th Lowest Total-At-Home-Last 15 Years - Sakshi

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో మొదలైన మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు. పిచ్‌పై బంతి ఎలా టర్న్‌ అవుతుందో అర్థంగాక తలలు పట్టుకున్నారు. టాస్‌ గెలవడం మినహా టీమిండియాకు ఏది కలిసిరాలేదు. ఆసీస్‌ స్పిన్నర్ల దెబ్బకు భారత బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకుంటూ స్పిన్నర్లు కుహ్నెమన్‌, నాథన్‌ లియోన్‌, మర్ఫీలు వికెట్లు పడగొట్టారు.

ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు క్రికెట్‌లో చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం గత 15 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. గతంలో 2008లో(అహ్మదాబాద్‌) సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 76 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత 2017 పుణేలో ఆస్ట్రేలియాతో టెస్టులో 105 పరుగులకు కుప్పకూలింది. మళ్లీ అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్‌ అయింది.

తాజాగా ఇండోర్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 109 పరుగులకు కుప్పకూలింది. మ్యాచ్‌లో కోహ్లి 22 పరుగులు చేయగా.. గిల్‌ 21 పరుగులు చేశాడు. కుహ్నెమన్‌ ఐదు వికెట్లు తీయగా.. లియోన్‌ 3, మర్ఫీ ఒక వికెట్‌ పడగొట్టాడు.

చదవండి: IND Vs AUS: ఏం జరుగుతోంది.. రోహిత్‌ శర్మ తప్పు చేశాడా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement