ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మూడో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలవడం మినహా టీమిండియాకు ఏది కలిసిరాలేదు. ఆసీస్ మాత్రం సిరీస్‌లో తొలిసారి పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిస్తే బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ ఏంచుకోవడంతోనే రోహిత్ తప్పుచేశాడనిపించింది. బహుశా ఇండోర్ పిచ్ కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావించి రోహిత్ ఆ నిర్ణయం తీసుకొని ఉంటాడు.
కానీ కొద్దిసేపటికే తన నిర్ణయం తప్పని రుజువైంది. పిచ్‌పై ఉన్న పచ్చికను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. బంతి పిచ్‌పై ఎలా పడుతుందో తెలియక బ్యాటర్లు తలలు పట్టుకున్నారు. డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేద్దామంటే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఎల్బీ, బౌల్డ్, క్యాచ్ ఔట్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. చూస్తుండగానే టీమిండియా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆసీస్ స్పిన్నర్ల దెబ్బకు బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.
కనీసం వంద పరుగులైనా చేస్తుందా లేదా అన్న తరుణంలో ఉమేశ్ యాదవ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో టీమిండియా స్కోరును వంద దాటించాడు. లంచ్ విరామం అనంతరం కాసేపటికే టీమిండియా 109 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి రోజు ఆట పూర్తిగా ఆడకుండానే చాప చుట్టేసిన టీమిండియా బౌలింగ్‌లో ఏమేర ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే టీమిండియా బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది వేచి చూడాలి. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ త్రయాన్ని తట్టుకొని బ్యాటర్లు ఎలా ఆడతారన్నది చూడాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment