బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, టీమిండియాల మధ్య జరిగిన రెండో టెస్టు రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఆసీస్ మరోసారి స్పిన్నర్లకు దాసోహమనడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జడ్డూ ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. అశ్విన్ మూడు వికెట్లతో అతనికి సహకరించాడు. ఫలితంగా ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని భారత్.. 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు మార్చి 1 నుంచి ఐదు వరకు ఇండోర్ వేదికగా జరగనుంది. కాగా మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''ఈ టెస్టులో విజయం సాధించినప్పటికి చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. వచ్చే మ్యాచ్‌ల్లో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇక మ్యాచ్‌లో విజయానికి చాలా అంశాలు దోహదం చేశాయి. అందులో మరీ ముఖ్యంగా మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా - విరాట్ ల మధ్య భాగస్వామ్యం ఒకటి. అక్షర్ పటేల్ - అశ్విన్ లు పోరాడిన తీరు ఈ మ్యాచ్ లో చాలా కీలకం. అది మాకు చాలా హెల్ప్ చేసింది. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అశ్విన్, జడేజాల బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు కలిసే 10 వికెట్లు తీయడం సూపర్ అని చెప్పొచ్చు.
వాస్తవానికి నిన్న (శనివారం) మేం కాస్త వెనుకబడ్డట్టు అనిపించింది. కానీ ఈరోజు ఉదయం సెషన్ లో మా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ బాగుంది. అయితే బ్యాటింగ్‌లో ఇంకొంచెం ఫోకస్ చేయాల్సి ఉంది. ఇక రీఎంట్రీ తర్వాత జడ్డూ అదరగొడుతున్నాడు. రానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌లలో జడేజా కీలకపాత్రో పోషించబోతున్నాడు. టెస్టుల్లో అశ్విన్‌ను ఎందుకు స్పెషల్ అంటారనేది మరోసారి నిరూపించాడు. ఈ ఇద్దరు నమ్మశక్యం కాని బౌలింగ్‌తో మ్యాచ్‌ను మావైపుకు తిప్పారు''అని పేర్కొన్నాడు.
చదవండి: Pakistan Cricket: పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!
Comments
Please login to add a commentAdd a comment