India Vs Australia, 3rd Test: Rohit Sharma Survived Two Dismissals In The First Over - Sakshi
Sakshi News home page

Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం

Published Wed, Mar 1 2023 11:30 AM | Last Updated on Wed, Mar 1 2023 12:01 PM

Rohit Sharma Survives 2-Close Calls But Stump-Out-After Hits-12 Runs - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నిరాశపరిచాడు. సిరీస్‌లో తొలిసారి టాస్‌ గెలిచిన టీమిండియాకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అలా రెండుసార్లు డకౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

చివరికి ఆరో ఓవర్లో కుహ్నెమన్‌ బౌలింగ్‌లో 12 పరుగులు చేసిన రోహిత్‌ అనూహ్యంగా స్టంపౌట్‌ అయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పిచ్‌పై బంతి ఎలా టర్న్‌ అవుతుందో అర్థంగాక టీమిండియా బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో శ్రీకర్‌ భరత్‌(17 పరుగులు) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 82 పరుగులు వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది.  

చదవండి: Ind Vs Aus: షేన్‌ వార్న్‌ రికార్డు బద్దలు.. నాథన్‌ లియోన్‌ అరుదైన ఘనత

పుజారా చెత్త రికార్డు.. భారత్‌ తరపున రెండో క్రికెటర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement