
నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే
కఠ్మాండు (నేపాల్) : అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా జింబాబ్వే పేరిట ఉన్న రికార్డును అమెరికా జట్టు సమం చేసింది. వరల్డ్ కప్ లీగ్–2లో భాగంగా బుధవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అమెరికా 12 ఓవర్లలో కేవలం 35 పరుగులకే కుప్పకూలింది. 2004లో హరారేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే కూడా 35 పరుగులకే ఆలౌటైంది. నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానే 16 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకొని అమెరికా ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు. మరో బౌలర్ సుశాన్ భరీ 5 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అమెరికా జట్టులో జేవియర్ మార్షల్ 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. నేపాల్ 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసి గెలిచింది. గతేడాది అమెరికాకు ఐసీసీ వన్డే హోదా కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment