అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఇంగ్లండ్‌కు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా అక్షర్ పటేల్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. కాగా ఇంగ్లండ్ టెస్టుల్లో టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఓవరాల్‌గా ఇది ఐదోసారి కాగా అత్యల్ప స్కోరుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. 1971 ఓవల్ టెస్టులో 101 పరుగులు, 1979/80 ముంబై టెస్టులో 102 పరుగులు, 1986 లీడ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు, తాజాగా అహ్మదాబాద్‌లో 112 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఆరు వికెట్లతో సత్తా చాటిన అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. డే నైట్ టెస్టులో ఒక బౌలర్ కెరీర్ బెస్ట్ నమోదు చేయడం ఇది మూడోసారి కాగా.. అక్షర్(6/38) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన దేవేంద్ర బిషూ 8/49తో తొలి స్థానంలో ఉన్నాడు. 2016/17 పాకిస్తాన్ సిరీస్ సందర్భంగా జరిగిన డే నైట్ టెస్టులో బిషూ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
చదవండి: పింక్ బాల్ టెస్టు: పీటర్సన్ ట్వీట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment