జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసుల ప్రవర్తన దిగ్బ్రాంతి చెందేలా ఉంది. లైంగిక వేధింపులతో మానసికంగా నలిగిపోయిన వారు నేరస్తులు కాదని, ఛాంపియన్ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
ఇది చాలా అమానుషం, విచారకరం, సిగ్గుచేటు అంటూ అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఈ వ్యక్తులు (బీజేపీ) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇకపై బీజేపీ గుండాయిజాన్ని సహించవద్దని, బీజేపీని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఢిల్లీ పోలీసుల మధ్య వాగ్వాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
చంపాలనుకుంటే చంపేయండి..!
ఈ నేపథ్యంలో స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఉద్వేగభరితంగా మీడియా ముందు.. 'మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి' అంటూ మాట్లాడారు. ఈ రోజులు చూసేందుకేనా మేము పతకాలు గెలిచింది అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి మగవాడికి ఆడవాళ్లను తిట్టే హక్కు ఉందా!.. అని నిలదీశారు. తుపాకులు పట్టుకుని మమ్మల్ని చంపేయండి అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీకి చేరుకున్న డీసీడబ్ల్యూ చీఫ్:
కాగా, ఈ మేరకు జంతర్‌మంతర్ వద్దకు వచ్చిన ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తనను నిరసన ప్రదేశంలోకి అనుమతించడం లేదని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి, మాలిక్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తాగి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మాకు చెప్పారని అన్నారు. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయినా ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారు? ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ ఢిల్లీ పోలీసులపై పైర్ అయ్యారు స్వాతి మలివాల్ .
(చదవండి: శరద్ పవార్ ఆత్మకథ పుస్తకంలో ఆసక్తికర అంశం..మోదీకి అప్పుడే స్పష్టం చేశా!)
Comments
Please login to add a commentAdd a comment