లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కించపరుస్తూ పోస్టులు చేసిన వ్యవహారంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాట్సాప్ గ్రూప్‌కు షాహబుద్ధీన్ అన్సారీ అనే వ్యక్తి అడ్మిన్‌గా ఉన్నాడు. ఆ గ్రూప్‌లో సీఎం యోగిని అవమానపరుస్తూ పోస్టూ చేశాడో వ్యక్తి. దీంతో గ్రూప్ అడ్మిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం యోగిపై ఓ పోస్టు విపరీతంగా వైరల్ అయిందని.. ఈ అంశంలో ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను అదుపులోకి తీసుకున్నామని కోత్వాలీ పోలీసు స్టేషన్ అధికారి కుమార్ సేత్ తెలిపారు. గ్రూప్ అడ్మిన్‌ను షాహబుద్ధీన్‌గా గుర్తించారు. పోస్టు చేసిన వ్యక్తిని ముస్లిం అన్సారీగా గుర్తించారు. అయితే.. సీఎం యోగికి కించపరుస్తూ పోస్టు చేసిన వ్యవహారంపై ఫిర్యాదులు అందిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వాట్సాప్ గ్రూప్ పేరు 'నగర పాలిక పరిషత్ బదోనీ'గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బదోనీకి సంబంధించిన నగరపాలిక కార్పోరేటర్లు, స్థానికులు ఆ గ్రూప్‌లో ఉన్నారని వెల్లడించారు. స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్యేశంతోనే ఆ గ్రూప్‌ను క్రియేట్ చేసినట్లు చెప్పారు. ఇది కార్పోరేటర్లకు సంబంధించిన అధికారిక గ్రూప్ కాదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment