భోపాల్: పాకిస్థాన్‌లోని ప్రియుడు నస్రుల్లా కోసం భారత్‌ను వదిలిన వివాహిత అంజు అందరికీ తెలిసే ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భర్తను వదలి పాక్‌లోని తన ప్రియుడు నస్రుల్లా కోసం వెళ్లిపోయింది అంజు. అక్కడికి వెళ్లిన తర్వాత మతం మార్చుకుంది. ఫాతిమాగా పేరు కూడా మార్చుకుని నస్రుల్లాను వివాహం చేసుకుంది. పాకిస్థాన్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు వారి జంటకు స్థానికంగా రియల్‌ఎస్టేట్ వ్యాపారి బహుమతులు అందిస్తున్నారు. డబ్బు, ఉండటానికి ఇళ్లు, భూములు ఇలా.. సకల సౌకర్యాలను సమకూర్చుతున్నారు. పాక్‌కు వచ్చి మతం మార్చుకున్నందుకు ఆమెకు సాదర స్వాగతాలు లభిస్తున్నాయి. దీనిపై మధ్యప్రదేశ్‌కు చెందిన హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.
ఓ వివాహిత పిల్లలను వదిలి పాక్ వెళ్లి, మతం మార్చుకుని ప్రియున్ని పెళ్లి చేసుకున్న ఘటనల వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం దాగి ఉందని నరోత్తమ్ మిశ్రా అన్నారు. అలా పాక్‌కు వచ్చిన యువతికి గిఫ్ట్‌ల పేరిట సకల సౌకర్యాలను సమకూర్చడం కుట్రకు తావిస్తోందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు.
రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల అంజుకు 15 ఏళ్ల కూతురు ఉంది. 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుని కోసం పాక్‌కు పారిపోయింది. దీనిపై స్పందించిన ఆమె తండ్రి.. తీవ్రంగా ఆవేదన చెందారు. భర్తను పిల్లలను ఎలా వదిలి వెళ్లగలిగిందని అన్నారు. ఆవిడ చనిపోయినట్లుగానే భావిస్తున్నట్లు గతంలో చెప్పారు.
ఇదీ చదవండి: జ్ఞానవాపిని మసీదు అనడమే వివాదం.. సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment