teachers union
-
నాకు 30 ఆమెకు 12 అంటూ..షాకింగ్ వ్యాఖ్యలు చేసిన బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. ఈ మేరకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్ అమెరికాలో అతిపెద్ద టీచర్స్ యూనియన్ అయిన నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్‌లో ప్రసంగిస్తూ....తన స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వయసుకి సంబంధించి చాలా ఏళ్లు వెనక్కి వెళ్లాలంటూ ప్రసంగాన్ని ప్రారంభించడంతో...అక్కడ ఉన్న ఉపాధ్యాయ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా బైడెన్ వ్యాఖ్యలను తిలకించ సాగారు. ఇంతలో బైడెన్ అక్కడ ఉన్న ఒక మహిళ ఉపాధ్యాయురాలిని చూస్తూ...తనకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడూ 12 ఏళ్ల బాలికతో స్నేహం చేశానని చెప్పారు. వయసు భేదం ఉన్నప్పటికీ ఆమె నాకు చాలా పనుల్లో సహయం చేసింది అన్నారు. అంతే ఆ సమావేశంలో ఒక్కసారిగా అందరి ముఖాలపై నవ్వులు విరబూశాయి. అతేకాదు ఆ సమావేశంలో రిపబ్లికన్ అబార్షన్ నిషేధం బిల్లు గురించి ప్రస్తావించారు. పైగా ఆ బిల్లు తన వద్దకు వస్తే వీటో చేస్తానని హామీ కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ బిల్లు విషయంలో ఆశా, ఐక్యత, ఆశావాదం, విభజన, భయం, చీకటి వంటి వాటికి సంబంధించినసరైన ఎంపికగా అభివర్ణించారు. అలాగే అమెరికాలో ఉన్న తుపాకీ సంస్కృతి పట్ల కూడా మాటల దాడి చేశారు. ఐతే ఆయన తన ప్రసంగం ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారాయి. తనకు 30 ఆమెకు 12 అంటే ఎవరామె అంటూ ఆసక్తకర చర్చ సాగింది. దీంతో కొంత మంది వినియోగదారులు 30 అంటే బైడెన్ గురువు అని 12 అంటే బైడెన్ వయసు అయ్యి ఉంటుందని ఒకరు, మరోకరేమో! ఏమైంటుందా అంటూ.. తెగ చించేసుకుంటూ ట్విట్లు పెట్టడం ప్రారంభించారు. Biden: “She was 12 I was 30.” D.C. Crowd: haahahahahaha And Democrats call Republicans brainwashed? pic.twitter.com/wB2EKHREg6 — Charles R Downs (@TheCharlesDowns) September 23, 2022 (చదవండి: కదన రంగంలో అత్యంత శక్తిమంతమైన యుద్ధ ట్యాంకులు! షాక్‌లో ఉక్రెయిన్) -
టీచర్ల సంఘాలే రాజకీయం చేస్తున్నాయి
ఓం శ్రీ గురుభ్యో నమః! తల్లిదండ్రుల తర్వాత గురువే దైవం... ఇవి మనకు చిన్నప్పుడు నేర్పే విషయాలు . గురువులు కూడా అలాగే విద్యార్దులను తమ సొంత బడ్డల మాదిరి చూసుకుంటారు. దురదృష్టవశాత్తు వివిధ కారణాలవల్ల విద్యా వ్యవస్థ దారి తప్పింది. ప్రత్యేకించి ప్రభుత్వరంగంలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు ఆశించిన రీతిలో పనిచేయకపోవడం అందరికి బాధ కలిగించే విషయమే. ఏదైనా ప్రభుత్వం స్కూళ్లను ,విద్యను సంస్కరించాలని ప్రయత్నిస్తే వాటిని స్వాగతించవలసిన టీచర్లు ఏదో రకంగా చెడగొట్టేపనిలో ఉంటున్నారు. అందరు అలా ఉన్నారని చెప్పడం లేదు. కానీ ఉపాధ్యాయసంఘాల రాజకీయాల కారణంగా టీచర్లు బాధత లేకుండా వ్యవహరించడం సర్వసాధారణం అయిపోయింది. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపడానికి అలవాటు పడుతున్నారు.ఈ విషయాన్ని ప్రభుత్వ స్కూళ్లవారు అవమానంగా ఫీల్ కావడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు పదో తరగతి పరీక్ష పలితాల సాధనలో బాగా వెనుకబడి ఉంటున్నాయి. ప్రభుత్వం వైపు సరైన పర్యవేక్షణ లేకపోవడం, స్కూళ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకపోవడంవంటి పలు కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ప్రభుత్వం అడగడుగునా ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. రాజకీయ పార్టీల నుంచి ఏదో విమర్శ వస్తే పర్వాలేదు. కానీ టీచర్ల సంఘాలు కూడా రాజకీయం చేస్తున్నాయి. ఏపీలో స్కూళ్లకు టీచర్లు సకాలంలో రావాలని, వచ్చినవారు కచ్చితంగా యాప్ ద్వారా తమ అటెండెన్స్ వేయించుకోవాలని విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. దీనిని ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ఒప్పుకోవడం లేదు. యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని సంఘాల నేతలు టీచర్లకు చెప్పడం దారుణం. కొందరు టీచర్లు తమకు ప్రభుత్వం సెల్ పోన్లు ఇస్తే యాప్ డౌన్ లోడ్ చేస్తామని అన్నారట. తమ ఇంటర్ నెట్ డేటా ను ఇందుకు వాడబోమని, ఏవేవో చెబుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని పాటించకుండా వ్యవహరించారు.మొదట కొందరు ఇలా అడమెంట్ గా ఉన్నా, ప్రస్తుతం మెజార్టీ టీచర్లు యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని సమాచారం వచ్చింది. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది?టీచర్లు సకాలంలో స్కూళ్లకు రాకపోవడం వల్లే కదా? వచ్చినా సరిగా పాఠాలు చెప్పకపోవడం వల్లే కదా? ఫలితాలు సరిగా లేకపోవడం వల్లే కదా? తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ, ప్రభుత్వ స్కూళ్లలో వీరు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే కదా? ఒకప్పుడు స్కూళ్లు అద్వాన్నంగా ఉన్న మాట నిజమే. కాని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక మార్పులు తీసుకు వచ్చారు. అమ్మ ఒడి స్కీమ్ ద్వారా పిల్లలు బడులకు వచ్చేలా కృషి చేస్తున్నారు. ,స్కూళ్లను నాడు నేడు కింద బాగు చేయడం ద్వారా, ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టడం వంటి వాటి ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్ధులను బాగా ఆకర్షించగలుగుతున్నారు. ఏడు లక్షల మంది పిల్లలు అదనంగా ఈ స్కూళ్లకు రావడమే నిదర్శనం. ఇలాంటప్పుడు టీచర్లు ఎంత సంతోషంగా పనిచేయాలి? అలా చేయకుండా కొంతమంది తమ సొంత వ్యాపారాలకు ప్రాదాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ఎల్ ఐ సి వంటి వాటికి కమిషన్ ఏజెంట్లుగా ఉంటున్నారట.పిఆర్సిలో ఏదైనా కొద్దిగా తేడా వస్తే వేల రూపాయలు ఖర్చు చేసుకుని మరీ వచ్చి విజయవాడలో ఆందోళనకు దిగిన టీచర్లు , తమ సొంత పోన్ లో యాప్ పెట్టుకుని అటెండెన్స్ ఇవ్వరట. ఆ కొద్దిపాటి ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలట. స్కూళ్లలో ఆయా సదుపాయాల తీరుతెన్నుల బాద్యత కూడా వీరికే పెట్టడం నచ్చడం లేదట.ఇక్కడ మరో సంగతి చెప్పుకోవాలి. ప్రైవేటు స్కూళ్లలో,కార్పొరేట్ విద్యా సంస్తలలో పనిచేసే టీచర్లు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు. ఏ టైమ్ కు వస్తున్నారు? ఏ టైమ్ కు వెళుతున్నారు?వారు ఎలాంటి బాద్యతలు నిర్వహిస్తున్నారు? ఉదయం ఎనిమిది గంటలకు వస్తే,సాయంత్రం ఆరున్నర,ఏడు గంటలకు కాని ఇంటికి చేరుకోరు. కొందరైతే ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా పిల్లల డౌట్లు తీర్చాల్సి ఉందట. టెన్త్ అయినా, ఇంటర్ అయినా సరైన ఫలితాలు సాధించకపోతే ఉద్వాసనకు గురికావల్సి ఉంటుంది. ప్రభుత్వ టీచర్లతో పోల్చితే వారి జీతాలు కూడా తక్కువే. వీటిపై టీచర్ల సంఘాలు ఆలోచించవు. వారి ఎన్నికల రాజకీయాలు వారివి. ఓట్ల రాజకీయాలతో ప్రభుత్వంలో ఉన్నవారిని బెదిరించడానికి యత్నిస్తుంటారు. ఇవన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుంది. ఒకరకంగా ప్రతిపక్షనేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విషయాలే కరెక్టేమో అన్న భావన ఏర్పడేలా వీరు వ్యవహరిస్తున్నారు. విద్య అన్నది ప్రభుత్వ బాద్యత కాదని, అది కార్పొరేట్ సంస్తల బాద్యత అని ఆయన నిర్మొహమాటంగా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట మార్చుతారేమో తెలియదు. మరో వైపు ముఖ్యమంత్రి జగనేమో పిల్లలకు విద్యే సంపద అని, దానిని సమకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకస్మిక సందర్శనలు అంటూ హడావుడి చేసేవారు. ఆయా శాఖల ఉద్యోగులను ప్రజల సమక్షంలోనే మందలించేవారు. కొన్నిసార్లు ఉద్యోగులు అవమానానికి గురి అయ్యేవారు. టీచర్లే కాకుండా, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్ఓ వంటివారు ఈ బాదితులలో ఉండేవారు. అప్పట్లో ఈనాడు వంటి టిడిపి మీడియా సంస్తలు చంద్రబాబును తెగపొగిడేవి. ఉద్యోగులు ,ఉపాధ్యాయులు బాద్యతగా ఉండాలని ఉద్భోధించేవి. కాని ఇప్పుడు అదే మీడియా టీచర్లను రెచ్చగొట్టేలా వార్తలు ఇస్తున్నాయి. ఈ మీడియాను కొన్ని ప్రశ్నలు అడగండి. మీ ప్రైవేటు సంస్థలలో హాజరు ఎలా తీసుకుంటున్నారు.కొద్ది నిమిషాల లేటును అనుమతిస్తున్నారా? కరోనా టైమ్ లో వీరు జీతాలు ఇచ్చారా? అసలు ప్రైవేటు మీడియా సంస్థలలో యూనియన్లను అనుమతిస్తున్నారా?అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు టైమ్ లో ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి సదుపాయాలు ప్రత్యేకంగా కల్పించలేదు. అందుకు బిన్నంగా జగన్ పనిచేస్తుంటే ఏదో రకంగా చెడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మరో విషయం చెప్పాలి. నిజంగానే ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ఏవైనా ఇబ్బందికరమైన టెక్నికల్ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా కృషి చేయవలసి ఉంటుంది. దానిని ప్రభుత్వానికి తెలపడం వరకు తప్పులేదు. ఇప్పటికే ఆ దిశగా అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు. కాని ఆ వంకతో టీచర్లు తమ ఇష్టం వచ్చినట్లు చేస్తామన్నట్లుగా ప్రవర్తించడం వారి వృత్తికే ధర్మం కాదు.వారు ఇదే పద్దతి కొనసాగిస్తే ప్రజలలో పలచన అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ టీచర్ల తీరుపై సోషల్ మీడియాలో పలు వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఆ విషయాలను కూడా గమనించి వారు బాద్యతగా వ్యవహరించి పిల్లలను తమ సొంత కుటుంబంగా భావించి విద్యారంగ అబివృద్దికి కృషి చేస్తారని ఆశిద్దాం. తల్లిదండ్రుల తర్వాత భావి పౌరులను తయారుచేసే గురువులే దైవంతో సమానమన్న నానుడిని నిజం చేయాలని కోరుకుందాం. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
టీచర్ల అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది: మంత్రి బొత్స
-
పీఆర్టీయూతోనే టీచర్ల సమస్యలకు పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూటీఎస్) 51వ ఆవిర్భావ ఉత్సవాలు హైదరాబాద్‌లోని సంఘం భవనంలో బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్థన్ రెడ్డి, కూర రఘోత్తం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఊపిరిగా పీఆర్టీయూ పనిచేస్తోందన్నారు. 75 వేల మంది సభ్యులున్న సంఘం పెన్షన్ మొదలుకొని, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ వరకూ అనేక జీవోలు సాధించిందని తెలిపారు. 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ సాధన, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ళకు పెంచడం, ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌తో పాటు 5500 ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. 317 జీవో వల్ల ఎదురైన ఇబ్బందులు, స్పౌజ్, జూనియర్ ఉపాధ్యాయుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ బయటపెట్టింది. హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్, సీసీఏ కూడా వచ్చిందన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి ‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు. -
9న ఉపాధ్యాయుల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వస్తున్నట్టు తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించింది. యూఎస్పీసీ నేతలు సోమవారం హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. బలవంతపు బదిలీలు చేశారు.. టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ, టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో ‘నాన్ లోకల్స్ గో బ్యాక్’ అనే నినాదం బలపడే వీలుందన్నారు. టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. పరస్పర బదిలీల్లోనూ అన్యాయమైన నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వివాహానికి ముందు స్థానికతను ప్రమాణంగా తీసుకుంటే ఎంతోమంది నష్టపోతారని తెలిపారు. పరస్పర బదిలీల్లో సీనియారిటీని కోల్పోవాల్సిన పరిస్థితి టీచర్లకు నష్టం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని డీటీఎఫ్ నేత టి.లింగారెడ్డి అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ఎదురీత తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని టీచర్లు ఎంతమాత్రం సహించలేరని టీపీటీఎఫ్ నేత మైస శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని యూఎస్పీసీ టీచర్లకు పిలుపునిచ్చింది. విలేకరుల సమావేశంలో జాదా వెంకట్రావ్, ఎ.రమణ, గాలయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
నాన్ స్పౌజ్లకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: 317 జీవో అమలులో స్పౌజ్ కేసులతో పాటు నాన్ స్పౌజ్‌లకూ న్యాయం చేయాలని నాన్ స్పౌజ్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు టీఎస్‌ఎన్‌ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోకల శేఖర్, సక్కుబాయి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేటాయింపుల్లో స్పౌజ్‌లు హెచ్ఆర్ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాన్నే కోరుకుంటున్నారని, దీనివల్ల నాన్ స్పౌజ్‌లు (భార్యాభర్తల్లో ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగి) విధి లేక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
తగ్గేది లేదు..
సాక్షి, కొత్తగూడెంఅర్బన్: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజైన ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మహిళా టీచర్లు నిరాహార దీక్షలు చేశారు. అనంతరం డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డీఎం, జిల్లా రవాణా శాఖాధికారులకు కార్మికులు, అఖిలపక్ష నాయకులు పూలు ఇచ్చే నిరసన తెలిపారు. అంతకుముందు ప్రదర్శనగా డిపో వద్దకు చేరుకోగా జేఏసీ, అఖిలపక్ష నాయకులు లోపలికి రాకుండా పోలీసులు గేట్లు మూసేశారు. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు యెర్రా కామేష్, వామపక్ష నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లా రవాణ శాఖ అధికారులు, ఆర్టీసీ డీఎం బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం గాంధీజీ శాంతియుత ఉద్యమం చేసినట్టుగానే తాము కూడా పూలు ఇచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఎంత కష్టమైనా వెనక్కు తగ్గేది లేదని, పోరాడి హక్కులు సాధించుకుంటామని అన్నారు. ఆ తర్వాత డీఎం, రవాణా శాఖాధికారికి పూలు ఇచ్చి నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ 15 నిమిషాల పాటు అధికారులకు దండం పెడుతూ మోకాళ్లపై నిల్చున్నారు. అనంతరం డిపో గేటు ముందుకు జిల్లా రవాణా శాఖాధికారి రవీందర్, డిపో మేనేజర్ శ్రీహర్ష బయటకు రాగా, వారికి నాయకులు దండలు వేసి, పూలు ఇచ్చి నిరసన తెలిపారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం... ఆర్టీసీ సమ్మెలో భాగంగా స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద వామపక్ష పా ర్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. దీంతో వన్‌టౌన్ పోలీసులు అక్కడి కి చేరుకొని కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వామపక్ష పార్టీ నాయకులను అక్కడి నుంచి పంపించే క్రమంలో పోలీసులు తొసేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ సంఘాల దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. గత 16 రోజులుగా సమ్మె చేస్తుంటే న్యాయస్థానాలు స్పందిచినా.. సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారబోతుందని, అన్ని వర్గాల వారు మద్దతు పలకడం అభినందనీయమని అన్నారు. భద్రాచలం, మణుగూరులో నిరసన కార్యక్రమాలు.. ఆర్టీసీ సమ్మెలో భాగంగా జిల్లాలోని భద్రాచలం, మణుగూరు డిపోలలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పాటుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు ఇచ్చి శాంతియుతంగా నిరసన తెలిపారు. శాంతియుత మార్గంలో సమ్మె కొనసాగించి న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
బదిలీలు ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ బదిలీలు ఇక ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే అందుకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆన్లైన్ బదిలీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపింది. అందుకు ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరించాయి. ఈ భేటీలో టీచర్లకు సంబంధించిన 36 రకాల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. గతంలో జరిగిన బదిలీల్లో అవకతవకల కారణంగా ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని, దాంతో ప్రభుత్వం అభాసుపాలైందని మంత్రుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ అంశంపై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చిందని సంఘాలు తెలిపాయి. ఈలోగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకపోతే పాత రూల్స్ ప్రకారం ఎవరి మేనేజ్మెంట్లో వారికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించిందని వివరించాయి. వీటితోపాటు ఇతర సమస్యల పరిష్కారం పట్ల మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సంఘాల నేతలు వెల్లడించారు. ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రోటీన్‌గా చేయాల్సిన అంశాల్లో పీఆర్సీ ఉందని, ఇందుకు సంబంధించి కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింఇ. ఒకవేళ నివేదిక, అమలు ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని పేర్కొన్నట్లు సంఘాల నేతలు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో ఐదెకరాల స్థలం కలిగిన పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా అభివృద్ధి చేసి, క్లస్టర్ హాస్టళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్వీసు రూల్స్, బదిలీలు, పీఆర్సీ ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటనీ క్రోడీకరించి సీఎంకు నివేదిక అందజేస్తామని పేర్కొంది. ఈ సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, జేసీటీయూ నాయకులు రఘనందన్, అంజిరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, మల్లయ్య, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సదానంద్ గౌడ్, చావ రవి, మైస శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే పరిష్కారిస్తాం: మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ఐదు రకాలుగా విభజించాం. అందులో ఒకటి రొటీన్‌గా చేయాల్సినవి. బదిలీలు, పదోన్నతులు, విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లను పంపించడం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెండోది న్యాయ వివాదాలతో ముడిపడిన అంశాలు. ముఖ్యంగా సర్వీసు రూల్స్ అంశం కోర్టులో ఉంది. ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే రాష్ట్రపతి ఆమోదం తీసుకువచ్చాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కేసుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమిస్తాం. మూడోది పాఠశాలల్లో సదుపాయాల కల్పన. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకా> చేస్తాం. నాలుగోది ఆర్థిక భారంతో కూడిన అంశాలు. ఎన్టీఆర్ హయాంలో రూ.398 వేతనంతో నియమించిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నాం. పీఆర్సీ నియామకం చేయాల్సిందే. దానిపై సానుకూలంగా ఉన్నాం. ఐదో అంశం సీపీఎస్. దీనిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచాం. పండిట్, పీఈటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం మరింత బలోపేతమై కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సానుకూలంగా స్పందించారు: సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సీపీఎస్ రద్దుపై సీఎంతో చర్చిద్దామని చెప్పారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం హైకోర్టులో ఉంది. సుప్రీం న్యాయవాదిని నియమించి జూన్ 6న వాదనలు వినిపించాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించారు. బదిలీలు, పదోన్నతులు పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే చేపట్టాలని, అందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నాం. 2003 డీఎస్సీ టీచర్ల సమస్యపై చర్చించాం. వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన టీచర్లకు 24 రోజుల ఈఎల్స్పై చర్చించాం. కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేలా సానుకూలంగా స్పందించింది. 34 డిమాండ్లలో ఒకటే పరిష్కారం అయింది. మిగతా వాటిని పరిష్కరించాలని విన్నవించాం. ఎయిడెడ్, కేజీబీవీ మోడల్ గిరిజన టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. పాత జిల్లాల ప్రకారం బదిలీలకు ఒకే: భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు త్వరలో సీఎంతో సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలపైనా సీఎంతో చర్చిద్దామన్నారు. కచ్చితంగా బదిలీలను పాత జిల్లాల ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్క స్కూల్ ఉండేలా చూడమని కోరాం. ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఉన్నత చదువులకు వెళ్లే ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. మేనేజ్మెంట్ వారీగా పదోన్నతులను హెడ్ మాస్టర్లకే పరిమితం చేయకుండా కిందిస్థాయి టీచర్ల వరకు వర్తింపజేయాలని కోరాం. పీఆర్సీ ఏర్పాటుకు ఓకే: నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు వీటిని ప్రాథమిక చర్చలుగా భావిస్తున్నాం. సానుకూల దృక్ఫథంతో ఉన్నాం. పాఠశాలల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నాం. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రమే సీఎం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. పీఆర్సీ, ఐఆర్ ఇస్తామన్నారు. స్వాగతిస్తున్నాం. -
ప్రత్యేక శిక్షణపై గరం..గరం
కర్నూలు సిటీ:సంస్కరణల పేరుతో ముందస్తు ప్రణాళికలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఐదు, తొమ్మిది తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన వెంటనే జ్ఞానధార పేరుతో వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ జిల్లాలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం సైతం వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు కూడా చేసింది. అయితే విద్యాశాఖ మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తూ జ్ఞానధార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటాన్ని ఉపాధ్యా య సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జ్ఞానధారపై కసరత్తు ఏదీ.. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2283, ప్రాథమికొన్నత పాఠశాలలు 932, ఉన్నత పాఠశాలలు 898 ఉన్నాయి. వీటిలో మొత్తం 6,41,530 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50,442 మంది పదవ తరగతి విద్యార్థులు పోను, ఇక మిగిలిన 5,91,088 మంది విద్యార్థులు 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగియక ముందే పై తరగతి పాఠ్యంశాలు బోధించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జ్ఞానధార కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయకపోవడం, మార్గదర్శకాలను రూపొందించక పోవడంతో ఉపాధ్యాయులు అమోమయానికి గురవుతున్నారు. జ్ఞానధార కింద ఇప్పటి వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఎంపికకు చర్యలు తీసుకోలేదు. ఏ స్థాయి విద్యార్థులకు శిక్షణ అవసరమో కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా గత ఏడాది సవరణాతమ్మకమైన బోధన తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎలాంటి వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏడాదంతా చదివిన విద్యార్థులు ఈ వేసవి శిక్షణపై దృష్టి సారించకపోతే ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. హాస్టల్ వసతి కల్పన జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లతో పాటు గురుకుల పాఠశాలల్లో హాస్టల్ వసతితో కూడిన శిక్షణను మే 1వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులతో తల్లిదండ్రులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇస్తారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఇందుకు డీఈఓ, సర్వశిక్ష అభియాన్, ప్రభుత్వ డైట్ కాలేజీ డీసీఈబీలు సమన్వయంతో తయారు చేసిన ప్రణాళిక ప్రకారమే శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో 5, 9 తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు వేసవి శిక్షణ తరగతులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. విద్యాశాఖ ముందస్తు కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో అందరికీ ఇబ్బందులు తప్పవు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. : వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు విద్యా సంవత్సర ప్రారంభంలోనే శిక్షణ ఇవ్వాలి విద్యార్థులు పై తరగతుల్లో ప్రతిభ చూపేలా గతంలో జూన్‌లో సన్నద్ధత తరగతులు నిర్వహించే వారు. అయితే విద్యా సంస్కరణలో భాగంగా 5, 9 తరగతులకు చెందిన విద్యార్థులకు ఈ ఏడాది మే నెలలో శిక్షణ ఇవ్వాల ని తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తుంది. – రంగన్న ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
తెలంగాణలో టీచర్స్ Vs సర్కారు
-
వేతనాలు హుళక్కే!
సాక్షి, కరీంనగర్ : పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరు అంశం కొత్త మలుపు తిరిగింది. గైర్హాజరు ఉపాధ్యాయులపై చర్యల ప్రక్రియ మొత్తం టీచర్లకు ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. నిర్ధిష్టమైన కారణాలుంటే మినహాయింపు ఇస్తామన్న అధికారులు ఇప్పుడు వారు ఇచ్చిన వివరణలను పరిశీలించకుండానే చర్యలకు సిద్ధం కావడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల విధులకు హాజరుకాని ఉద్యోగుల వేతనాల్లోంచి రెండు రోజుల జీతాన్ని కోత పెట్టాలని కలెక్టర్ జిల్లా ట్రెజరీ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల ఉపాధ్యాయులకు జీతాలు అందుతాయా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. జిల్లాలో 1,220 మంది ఎన్నికల విధులకు గైర్హాజరైనట్లు తేల్చారు. వీరిలో 1100 మంది ఉపాధ్యాయులు. ఇందులోనూ చాలా మంది ఎన్నికల విధులు నిర్వర్తించినా, పై అధికారుల అలసత్వంతో గైర్హాజరైనట్లు నోటీసులు అందుకున్నారు. ఒకరికే రెండు చోట్ల డ్యూటీలు వేయడం వల్ల ఒక చోట పని చేసినా మరో చోట గైర్హాజరైనట్టు నమోదైంది. రెండు చోట్ల డ్యూటీలు పడ్డ వారితోపాటు సరైన కారణాలతో హాజరుకాలేని వారికి చర్యల నుంచి మినహాయింపు ఇస్తామని అధికారులు ప్రకటించారు. ఎందుకు గైర్హాజరయ్యారో చెప్పాలని నోటీసులు కూడా పంపించారు. ఈ నోటీసులకు చాలా మంది వివరణ కూడా పంపారు. కానీ, అవేవీ పట్టించుకోకుండా అందరి వేతనాల్లో కోత విధించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో షాకైన ఉపాధ్యాయ సంఘాల నేతలు శుక్రవారం జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయంలో సమావేశమయ్యారు. తాజా నిర్ణయం వల్ల 14,500 మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన వారు పాఠశాలలో ఒక్కరు ఉన్నా మిగిలిన ఉపాధ్యాయుల బిల్లులు కూడా పంపించేందుకు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు అంగీకరించడం లేదు. వచ్చే నెల వేతనం వచ్చేందుకు వీలుగా ఆయా పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఈ నెల 25 లోపు బిల్లులు ట్రెజరీలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నెల 25 ఆదివారం కావడం వల్ల 24న ఈ పని పూర్తి చేయాలి. కానీ, శనివారం వరకు బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపే అవకాశం కనిపించడం లేదు. సమయానికి బిల్లులు ట్రెజరీకి చేరకపోతే వేతనం అందడం కష్టమే. గైర్హాజరును మొదటి తప్పుగా భావించి మన్నించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలెక్టర్‌ను కలిసి విన్నవించాయి. అయినా తమ విన్నపాన్ని మన్నించకపోవడంతో మానసిక క్షోభకు గురవుతున్నామని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వివరణలు పట్టించుకోకుండా కేసులు నమోదు చేయడం కూడా వారిని ఆవేదనకు గురిచేస్తోంది. విధులు నిర్వర్తించినా... తప్పుగా పేర్కొన్న ఎంపీడీవోలపైనా, రెండు డ్యూటీలు వేసిన వారి మీద చర్యలు లేకుండా కిందిస్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ వెళ్లి మంత్రి శ్రీధర్‌బాబును కలవాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. -
16 నుంచి ఉపాధ్యాయుల సామూహిక సెలవులు
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం మరింత వేడెక్కనుంది. ఇప్పటికే సీమాంధ్ర జిల్లాలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోగా.. ఉపాధ్యాయులు కూడా వారికి మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమానికి మద్దతు ప్రకటించేందుకు బుధవారం సమైక్యాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి ఒకటి ఏర్పాటైంది. కొత్త ఏర్పాటైన ఈ ఉపాధ్యాయ సమితిలో 13 జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు జతకలవనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకూ ఉపాధ్యాయులు విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఇప్పటికే అరకొరగా నడుస్తున్న స్కూళ్లను పూర్తిగా స్తంభింపజేసేందుకు ఉపాధ్యాయులు నడుంబిగించారు. దీంతో సీమాంధ్రలో ఉన్న స్కూళ్ల కూడా మూతబడే అవకాశం ఉంది. తమ తదుపరి భవిష్యత్తు కార్యాచరణపై ఆగస్టు 18వ తేదీన ఉపాధ్యాయ సంఘాలు విజయవాడలో సమావేశం కానున్నాయి.