ఆవిర్భావ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకులు
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూటీఎస్) 51వ ఆవిర్భావ ఉత్సవాలు హైదరాబాద్‌లోని సంఘం భవనంలో బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్థన్ రెడ్డి, కూర రఘోత్తం మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సంక్షేమమే ఊపిరిగా పీఆర్‌టీయూ పనిచేస్తోందన్నారు. 75 వేల మంది సభ్యులున్న సంఘం పెన్షన్ మొదలుకొని, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్ వరకూ అనేక జీవోలు సాధించిందని తెలిపారు.
30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ సాధన, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ళకు పెంచడం, ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌తో పాటు 5500 ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేయించిన ఘనత తమ సంఘానిదేనన్నారు. 317 జీవో వల్ల ఎదురైన ఇబ్బందులు, స్పౌజ్, జూనియర్ ఉపాధ్యాయుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుర్రం చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment