మంత్రి సబితకు వినతిపత్రం ఇస్తున్న టీఎస్‌ఎన్‌ఎస్‌టీయూ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: 317 జీవో అమలులో స్పౌజ్ కేసులతో పాటు నాన్ స్పౌజ్‌లకూ న్యాయం చేయాలని నాన్ స్పౌజ్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు టీఎస్‌ఎన్‌ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోకల శేఖర్, సక్కుబాయి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేటాయింపుల్లో స్పౌజ్‌లు హెచ్‌ఆర్‌ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాన్నే కోరుకుంటున్నారని, దీనివల్ల నాన్ స్పౌజ్‌లు (భార్యాభర్తల్లో ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగి) విధి లేక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment