Sabita indrareddy
-
TS Election 2023: సిద్దిపేటపై అక్కసు ఎందుకు? విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్..!
సిద్దిపేట: సిద్దిపేట అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సామూహిక భవనాల నిర్మాణం కోసం రూ.1.20కోట్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. పత్తి మార్కెట్ యార్డులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు సమైక్య పాలనలో సిద్దిపేట గోస పడిందని, స్వరాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని చెప్పారు. అన్నీ సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకేనా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు పాల్గొన్న సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిన గడ్డ సిద్దిపేట అని, అప్పుడు ముందు ఉన్నాం.. ఇప్పుడూ అభివృద్ధిలో ముందుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో బాజాప్త మరింత ప్రగతి సాధిస్తామన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు. ఈనెల 15న సిద్దిపేటకు రైలు రానుందని వెల్లడించారు. దసరాకు వెయ్యి పడకల ఆస్పత్రి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని, ఎంత ఎత్తుకు ఎదిగినా విద్య నేర్పిన గురువును మరువొద్దని ఉద్బోధించారు. దేశానికి మోడల్‌గా తెలంగాణ.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి మోడల్‌గా నిలుస్తుందని హరీశ్‌రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామంచ శివారులో నూతనంగా నిర్మించిన రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాలను సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఐటీ, వైద్య రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే నేడు 10 లక్షలకు చేరిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనూ మొదటి స్థానంలో ఉందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరంట్ ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎస్ఈ కార్యాలయం ప్రారంభం.. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత, పట్టణ అధ్యక్షుడు సంపత్, ఎంపీపీ మాణిక్యరెడ్డి, సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎస్ఈ జోగారెడ్డి, ఈఈ శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మెన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మానానికి రూ.50 లక్షలు.. అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికి, తెలంగాణ దేశానికి ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో ముదిరాజ్, రెడ్డి, కురుమ, ఎస్సీ కమ్యూనిటీ హాల్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, లైబ్రరీ భవనం, అంగన్వాడీ భవనం, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడకపల్లి ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గ్రామంలో రూ. 50 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సర్పంచ్ మంగ భాస్కర్, ఎంపీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఎల్లం, అర్బన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, ఎంఈఓ యాదవ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఆదరించండి.. అభివృద్ధిని చూసి ఆదరించండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఒకప్పుడు పని దొరకక వలసలు పోయిన మనం.. నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకునే స్థాయికి ఎదిగామన్నారు. సోమవారం రాంపూర్‌లో ఓపెన్ జిమ్, సిద్దన్నపేట వరకు రోడ్డు, వడ్డెర కమ్యూనిటీహాల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు స్పింక్లర్లు పంపిణీ చేశారు. జేపీ తండాలో పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా, సర్పంచ్‌లు లక్ష్మి, బిక్షపతినాయక్, పరశురాములు, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హరీశ్‌తో పోటీ పడలేరు: సబిత.. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దేశానికి అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అంటే.. తెలంగాణకే సిద్దిపేట మోడల్‌గా నిలిచిందని కితాబిచ్చారు. ఉద్యమంలో ఏదైతే తపన, ఆరాటం ఉండేదో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి హరీశ్‌రావు ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. త్వరలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
-
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
TS Inter Results 2022 : జూన్ 28వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టత నిచ్చింది.జూన్ 28వ తేదీన(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు జూన్ 26వ తేదీ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహింస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెల్సిందే. తెలంగాణ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్‌ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. -
‘పది’పైనా పునరాలోచన!
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల తేదీలు మార్చాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై వాస్తవ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులను కోరినట్టు తెలిసింది. ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే ఎలా ఉంటుందనే దానిపై ఆమె అధికారులను ఆరా తీసినట్టు సమాచారం. టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్స్ తేదీల్లో మార్పు వల్ల ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చేయడం అనివార్యమైంది. ఏప్రిల్‌కు బదులు మేలో టెన్త్ పరీక్షలను ఖరారు చేశారు. అయితే దీనిపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వచ్చే విద్యా సంవత్సరంపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఆలస్యమైతే ఇదీ పరిస్థితి ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటో తేదీన టెన్త్ చివరి పరీక్ష ముగుస్తుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది. గతంలో 11 పేపర్లు ఉన్నప్పుడు వాటి వాల్యుయేషన్ పూర్తి కావడానికి 15 రోజుల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం 6 పేపర్లు కాబట్టి కనీసం పది రోజుల సమయం తీసుకుంటుంది. ►ఒక విద్యార్థి రాసిన ఆరు సమాధాన పత్రాలు ఆరు వేర్వేరు జిల్లాలకు మూల్యాంకనం కోసం పంపుతారు. మూల్యాంకనం అనంతరం వేర్వేరు సబ్జెక్టుల్లో పొందిన మార్కుల వివరాలను అన్నింటినీ రాష్ట్రస్థాయిలో క్రోడీకరించి ఫలితాలను నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఐదు లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేవీలుంది.అంటే 30 లక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మార్కుల (ఆరు సబ్జెక్ట్‌లు)వివరాలను క్రోడీకరించాలి. ఈ ప్రక్రియకు ఇరవై రోజుల సమయం పడుతుంది. ►ఇలా పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన ప త్రాల మూల్యాంకనానికి పది రోజులు, ఫలితాల వెల్లడికి 20 రోజులు మొత్తంగా 30 రోజుల కనీస సమయం తీసుకుంటుంది. అంటే జూలై మొదటి వారంలో పదవ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ►ఫలితాల విడుదల తర్వాత ఎంత వేగంగా ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి చేసినా, మెమోలను ప్రింట్ చేసి పాఠశాలలకు పంపించడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. దీంతో సాధారణం కంటే నెల ఆలస్యంగా జూలై చివరి వారంలోనే టెన్త్ విద్యార్థులు తదుపరి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. సీబీఎస్ఈ విధానంలో చదివే విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలు మొదలవుతాయి. ఫలితాలూ త్వరగా వస్తాయి. ప్రైవేటు కాలేజీలు కూడా మే నుంచే ఇంటర్ అడ్మిషన్లు మొదలు పెడతాయి. ఈ అంశాలన్నింటిపై విద్యాశాఖ మంత్రికి ఇప్పటికే అనేక వినతులు అందినట్టు సమాచారం. వాస్తవానికి కరోనా కారణంగా ఈ ఏడాది టెన్త్ సిలబస్‌ను 70 శాతానికి తగ్గించారు. అన్ని పాఠశాలల్లో సిలబస్ ప్రకారం బోధన పూర్తయింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో రివిజన్ టెస్టులు పెడుతున్నారు. కాబట్టి ఏప్రిల్‌లో పరీక్షలు పెడితే విద్యార్థులు పరీక్షలు బాగా రాసే వీలుందని అంటున్నారు. అలాకాకుండా వేసవి మండిపోయే సమయంలో మూడు గంటల పాటు పరీక్ష రాయడం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 పాఠశాలలకు చివరి పనిదినం. ఏప్రిల్‌లోనే నిర్వహించాలి పదవ తరగతి పరీక్షలను మే నెలకు బదులు ఏప్రిల్‌లో నిర్వహించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఆమెను ఆదివారం సంఘం ప్రతినిధులు రాజా భానుచంద్రప్రకాశ్, తుకారాం, కృష్ణ, గిరిధర్ తదితరులు కలిశారు. పరీక్షలు ఆలస్యమైతే వచ్చే విద్యా సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడుతుందని, మండు వేసవిలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడతారని తెలిపారు. -
నిజమైన ‘మహిళాబంధు’ కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించే ‘మహిళాబంధు కేసీఆర్’ సంబురాల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భాగస్వాములు కావాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 6వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ సంబురాల్లో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. వీరు శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్ కిట్ ద్వారా 10లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ఐదు లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించామన్నారు. కేసీఆర్ పాలనలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. కార్యక్రమం లో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియ పాల్గొన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటుచేశా రని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్రంలోని 40.58 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సబిత పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు జరిగిన కుట్రపై విచారణ జరుగుతోందని, దోషులెవరో పోలీసులు తేల్చుతారని చెప్పారు. -
15 రోజుల్లో కొత్త పింఛన్లు
వికారాబాద్: 15 రోజుల్లో కొత్త పింఛన్లుమంజూరు చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సోమవారం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో మూడేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వలేకపోయామని, త్వరలోనే అర్హులకు పింఛన్లు ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కొత్తగా 10 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేస్తామని, ఒక్కో జెడ్పీటీసీకి రూ. 15 లక్షల నిధులు ఇస్తామని చెప్పారు. -
నల్లగొండ సబితకు కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న నల్లగొండ విద్యార్థిని సబితకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నల్లగొండలో సబిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని, ధైర్యంగా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి.. జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. ఆమెను స్వయంగా కలసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సబితను బుధవారం హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. చిన్నవయసులోనే కుటుంబ పోషణ కోసం ఆటోను నడిపిస్తూ మగవారికి తీసిపోని విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న సబిత తీరును చూసి ఆయన అభినందించారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తండ్రిని కోల్పోవడంతో తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయం చేయాలని, కొత్త ఆటోరిక్షా ఇప్పించాలని సబిత కోరింది. కాగా, సబిత పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్ బెడ్రూం ఇంటి ప్రొసీడింగ్స్‌తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్‌ని కేటీఆర్ స్వయంగా అందించారు. సబిత చదువుకుంటానంటే తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఇతర యువతులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కేటీఆర్ తనకు అండగా నిలవడంపై సబిత సంతోషం వ్యక్తం చేసింది. -
తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఎవరెన్ని కుట్రలు చేసినా రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని అన్ని నియోజ కవర్గాలను అభివృద్ధి చేసి తీరుతాం’అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం, మంత్రుల పర్యటనలను అడ్డుకోవడం సరికాదని, దమ్ము ఉంటే కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో పోటీ పడాలి’ అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ‘అధికారం ఎవరి సొత్తు కాదని, మీరు దేశంలో అధికారంలో ఉన్నారు. ఈ ఏడున్నరేళ్లలో రాష్ట్రం కోసం చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా’అని నిలదీశారు శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ, జల్పల్లి, మీర్పేట్, బడంగ్పేట్ పుర/నగర పాలికల పరిధిలో రూ.371.09 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బడంగ్పేట్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నగరంలో అనేక కాలనీలు మునిగి పోయాయని, ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినా అరపైసా కూడా ఇవ్వలేదని, గుజరాత్లో వరదలొస్తే ప్రధాని మోదీ తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. మోదీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిం చకపోగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజ కీయ లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయలేదు.. మన ఊరు– మనబడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 26 వేల పాఠశాలను సంస్క రించుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేసి 950 గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని చెప్పారు. కేంద్రం మాత్రం రాష్ట్రానికి కొత్తగా ఒక్క నవోదయ పాఠశాలను కూడా కేటాయించలేదని విమర్శించారు. దేశవ్యా ప్తంగా 16 ఐఐఎంలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని మండిపడ్డారు. ప్రభు త్వ ఆస్పత్రులను అభివృద్ధి చేశామని, కేసీఆర్ కిట్టు వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 50 శాతం పెరిగాయని గుర్తు చేశారు. కార్యక్రమాల్లో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
నాన్ స్పౌజ్లకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: 317 జీవో అమలులో స్పౌజ్ కేసులతో పాటు నాన్ స్పౌజ్‌లకూ న్యాయం చేయాలని నాన్ స్పౌజ్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు టీఎస్‌ఎన్‌ఎస్‌టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోకల శేఖర్, సక్కుబాయి సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కేటాయింపుల్లో స్పౌజ్‌లు హెచ్ఆర్ఏ ఎక్కువ ఉన్న ప్రాంతాన్నే కోరుకుంటున్నారని, దీనివల్ల నాన్ స్పౌజ్‌లు (భార్యాభర్తల్లో ఒక్కరే ప్రభుత్వ ఉద్యోగి) విధి లేక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన
-
అనాథలకు స్మార్ట్‌కార్డులు
సాక్షి, హైదరాబాద్, వెంగళరావునగర్: రాష్ట్రంలోని అనాథలను సంరక్షించేందుకు దేశం గర్వించేలా సమగ్ర చట్టం తీసుకొస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో శనివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్. సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, వినోద్‌కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో దేశానికి దిక్సూచిలా ఉన్న తెలంగాణ అనాథల విషయంలో తల్లిదండ్రులుగా మరో అద్భుత విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో అనాథలు ఉండొద్దనే సంకల్పంతో వారిని రాష్ట్ర బిడ్డలుగా పరిగణిస్తామన్నారు. అనాథల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లు పెట్టి ప్రత్యేక గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక రక్షణ కల్పిస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశం అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో రసాయనాలు లేకుండా పండించేందుకు ఏర్పాటు చేసిన న్యూట్రిగార్డెన్ను కేటీఆర్ సందర్శించి కమిషనర్‌ను అభినందించారు. సబ్ కమిటీ సూచనలు... ♦అనాథ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడీ చట్టం పెట్టి భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయకుండా కఠిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందించాలి. ♦అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తించడంతోపాటు వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీ కార్డులు ఇవ్వాలి. ఈ కార్డులు ఉంటే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు ఇతర సర్టిఫికెట్లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ముస్లింలలో అనాథలను చేరదీసే విధంగా నిర్వహిస్తున్న యతీమ్ఖానాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాలా అండగా నిలబడాలి. ♦ప్రభుత్వ బిడ్డల కోసం చేసే ఖర్చును గ్రీన్ చానల్లో పెట్టాలి. ఆ ఏడాది నిధులు ఖర్చుకాకపోతే వచ్చే ఏడాది ఉపయోగించుకొనే విధానం పెడితే వారికి శాశ్వత ఆర్థిక భద్రత లభిస్తుంది. ♦ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ హోమ్స్‌లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి. -
టీన్ టీకా.. ఆ అపోహలు నమ్మకండి: మంత్రి హరీష్
సాక్షి హైదరాబాద్: టీనేజర్లకు టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 7లోని యూపీహెచ్‌సీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు టీకాలను ప్రారంభించగా, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట యూపీహెచ్‌సీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 45,319 మందికి కోవిడ్ టీకాలు వేయగా, వీరిలో 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లు 5,525 మంది ఉన్నారు. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) ఈ సందర్భంగా మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలు మాట్లాడుతూ.. కోవిడ్ థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బాధితులు అనవసరంగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని సూచించారు. ఆధార్ కార్డు లేని టీనేజర్లకు కాలేజీ గుర్తింపు కార్డు చూసి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. మరో నాలుగు రోజుల తర్వాత కోవిన్ యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రేటర్ పరిధిలోనూ నేరుగా వచ్చిన వారికి టీకాలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తొలిడోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు టీకాను వేయనున్నట్లు తెలిపారు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. (చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!) -
కేసీఆర్ బాటలోనే పార్టీ యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు కేసీఆర్ రూపంలో అద్భుత నాయకత్వం, 60 లక్షల సభ్యత్వంతో పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు కష్టపడి పనిచేయాలని సూచించారు. కేసీఆర్ బాటలో పార్టీ యంత్రాంగం నడుస్తోందని చెప్పారు. ఈ నెల 25న జరిగే ప్లీనరీ, వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే ‘తెలంగాణ విజయగర్జన’ బహిరంగ సభ సన్నాహాలపై పార్టీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం బృందాల వారీగా సమావేశమయ్యారు. రెండేసి నియోజకవర్గాలకు చెందిన నేతలతో సుమారు అర గంట పాటు ఉదయం 10 గంటల నుంచి వరుస భేటీలు నిర్వహించారు. సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, సూర్యాపేట, హుజూర్నగర్, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, అలంపూర్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు సంబంధిత ఎంపీలు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, త్వరలో వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ కూడా ప్రకటిస్తామన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం ఉం టుందని, నవంబర్ 15న జరిగే వరంగల్ విజయగర్జన సభ తర్వాత పార్టీశ్రేణులు, ప్రజాప్రతినిధులకు శిక్షణకార్యక్రమాలు ఉంటాయన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్కు అండ గా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఘనంగా టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలు పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలని పార్టీ నేతలను కేటీఆర్ ఆదేశించారు. ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని, నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ నెల 27న నియోజకవర్గ స్థాయిలో జరిగే సన్నాహక సమావేశాల ప్రారంభానికి ముందే స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి కార్యకర్తలతో బహిరంగ సభ కార్యాచరణపై సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభకు ప్రతి గ్రామ కమిటీ సభ్యులు కచ్చితంగా హాజరయ్యేలా కార్యచరణ ఉండాలని కేటీఆర్ సూచించారు. దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల కార్యకర్తలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలో కేటీఆర్ భేటీకి హాజరయ్యారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అనారోగ్యం కారణంగా భేటీకి దూరంగా ఉన్నారు. సోమవారం కేటీఆర్ నిర్వహించిన వరుస భేటీల్లో పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేరిక కార్యక్రమానికి ఆయన అనుచరులు తరలిరావడంతో పార్టీ కార్యాలయ పరిసరాలు సందడిగా మారాయి. -
ఆరుసార్లు గెలిపిస్తే.. అవమానిస్తావా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆరుసార్లు గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ తన మాటలతో అవమానించాడని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం సభలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, సతీశ్‌బాబు, రాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో రూ.కోటి వ్యయంతో చేపట్టిన రెడ్డి కమ్యూనిటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జమ్మికుంటలో ఈ సభ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన దాదాపు 20 వేల మంది సభకు హాజరయ్యారు. సభలో మంత్రి హరీశ్‌రావు ఈటల రాజేందర్‌పై నిప్పులు చెరిగారు. ఇంతకాలం టీఆర్ఎస్లో ఉండి ఇటీవల పార్టీ మారిన ఈటల రాజేందర్, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హుజూరాబాద్ ప్రజలను అవమానించడమేనని స్పష్టంచేశారు. బీజేపీ పంచన చేరిన ఈటల, చేతనైతే తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తీసుకురావాలని సవాలు విసిరారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును సీఎం దృష్టికి తీసుకువెళ్తామని హరీశ్ హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి, కేసీఆర్‌కు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెడ్డిలకు డబుల్ బెడ్రూం ఇళ్లు: గెల్లు చిన్నప్పటి నుంచి తమ కుటుంబానికి రెడ్డి సామాజికవర్గంతో అనుబంధం ఉందని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తమ గ్రామంలో రెడ్డి సామాజికవర్గం నాయకుల సహకారంతోనే తన తల్లి సర్పంచ్‌గా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. తనను మంత్రి నిరంజన్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. తాను గెలిస్తే పేద ఓసీలకు డబుల్ బెడ్రూంలు ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. కేసీఆర్‌ది రైతుసంక్షేమ ప్రభుత్వం: పోచారం సభకు ముఖ్యఅతిథిగా వచ్చిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఈ సభకు స్పీకర్ హోదాలో రాలేదని అన్నారు. కొంతకాలంగా తమ సామాజికవర్గంలో పేరు చివరన రెడ్డి అని పెట్టుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యం సామాజికసేవలో ముందుండే రెడ్లు తప్పకుండా పేర్లు పెట్టుకోవాల్సిందేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ పథకాలు లేవు: నిరంజన్‌రెడ్డి 45 లక్షల ఎకరాలకు నీరిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తి చేయడం రైతులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు, రైతువేదికలు తదితర రైతు సంక్షేమ పథకాలు గుజరాత్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మహిళలకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల కష్టాలు తాము స్వయంగా చూశామని మంత్రి సబితారెడ్డి గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, బాలికల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. రాజకీయాల్లో మహిళలు రాణించాలని 50 శాతం రిజర్వేషన్ తెచ్చారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. -
30లోగా సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఈనెల 30 నాటికే సన్నద్ధం కావాలని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులంతా గురువారం నుంచి ప్రతీరోజు పాఠశాలలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల అమలులో రాజీపడొద్దని సూచించారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి ఆమె మంగళవారం జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం అత్యవసరమని మంత్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలను 30వ తేదీలోగా శానిటైజేషన్ చేసి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సర్పంచ్‌లు, పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. జెడ్పీచైర్మన్లు, సీఈవోలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రతిరోజూ పాఠశాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఇంటర్మీడియెట్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. సూచనలు ఇవీ... ►విద్యా సంస్థల్లో పారిశుద్ధ్య బాధ్యతలను గ్రామ పంచాయతీలే చూసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్, అధికారులపై చర్యలు తీసుకుంటారు. ►విద్యార్థులకు సర్పంచ్‌లే మాస్క్‌లు అందించాలి. ►విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే తక్షణమే వైద్య పరీక్షలు చేపట్టాలి. కోవిడ్ నిర్ధార ణ అయితే, మిగతా విద్యార్థులకు, బాధితుడి కుటుంబీకులకు కోవిడ్ పరీక్షలు చేయాలి. అవసరమైన వైద్య సేవలు అందించాలి. ►ప్రైవేటు విద్యా సంస్థల్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యే తీరును అధికారులు పరిశీలించాలి. ►ఈ నెల 30లోగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ఇవ్వాలి. ►ఈనెల 26 నుంచి బోధన, బోధనేతర సిబ్బంది విద్యా సంస్థలకు విధిగా హాజరుకావాలి. ►ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చర్యలు చేపట్టాలి. విద్యార్థులు విద్యా సంస్థలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒత్తిడి చేయొద్దు. 5 గంటలకల్లా నివేదిక ఇవ్వాలి... పాఠశాలల పరిస్థితిపై ఎంఈవోలు ప్రతి రోజూ 5 గంటల కల్లా ఆర్డీలకు నివేదిక ఇవ్వాలని మునిసిపల్ పరిపాలన విభాగం కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ.. కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, విద్యాసంస్థల పునరుద్ధరణ చేపడు తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలు, శానిటేషన్ విధానాలపై పాఠశాల విద్యాశాఖ జిల్లా అధికారులకు మార్గదర్శకాలు పంపింది. ఈమేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30లోగా ఉచిత పుస్తకాల పంపిణీ జరగాలని సూచించారు. -
తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంపై విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్లైన్ క్లాసుల నిర్వహణ లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేని చెప్పారు. పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్, కార్పొరేటర్, మేయర్‌లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతిగృహాల్లో ఐసోలేషన్ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు. -
సోలార్ పవర్లో మనం సూపర్..
సాక్షి, తుక్కుగూడ (హైదరాబాద్): సోలార్ విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ– సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ 750 మెగావాట్ల సోలార్ పీవీ సెల్స్, మాడ్యూల్స్ కంపెనీని గురువారం మంత్రి పి.సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఏడాది ఒకే సంవత్సరంలో రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులతో 17,000 పరిశ్రమలను తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. ఇందులో 80 శాతం కంటే ఎక్కువ ప్రస్తుతం పని చేస్తున్నాయన్నారు. కరోనా సమయంలో రూ.483 కోట్లతో ప్రీమియర్ కంపెనీని నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. మరో రెండేళ్లలో 2,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రూ.1,200 కోట్లను పెట్టుబడి పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో యువత నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆగస్టు 5న ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కంపెనీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ప్రీమియర్ ఎనర్జీస్ వ్యవస్థాపకుడు చిరంజీవ్ శాలుజా, జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మాజీ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, మున్సిపల్ చైర్మన్ కాంటేకర్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. మంత్రుల కాన్వాయ్ అడ్డగింత.. తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ఈ–సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభం కోసం వస్తున్న మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని బీజేపీ, బీజేవైఎం నాయకులు శ్రీశైలం జాతీయ రహదారిపై అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
1 నుంచి 9వ తరగతి విద్యార్థులందరూ ప్రమోట్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పాఠశాలలన్నీ మూతపడిన విషయం తెలిసిందే. 1 తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులుగా మంత్రి సబితా రెడ్డి ఆదివారం ప్రకటించారు. ఆ తెల్లారే సోమవారం విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేసవి సెలవులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్షలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రద్దు చేయగా తాజాగా ప్రాథమిక నుంచి ఉన్నత విద్య (1నుంచి 9వ తరగతి) విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే విద్యాలయాలన్నీ మూసివేయగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. త్వరలోనే మరిన్ని కరోనా కట్టడి చర్యలు తీసుకునే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ -
పెరిగిన కరోనా తీవ్రత.. తెలంగాణలో విద్యాసంస్థల మూసివేత
-
కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు మూత పడనున్నాయి. రేపటి నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. దీనిపై అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబిత వివరించారు. అయితే ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. అన్ని విద్యా సంస్థలు మూసి వేస్తూ ప్రకటించగా ఒక్క వైద్య కళాశాలలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య రీత్యా కరోనా వ్యాప్తి అరికట్టడంతో భాగంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మంత్రి సబిత వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతున్న కరోనా కేసులతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమవుతోంది. పాక్షిక లాక్డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
బడుల నిర్వహణకు ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల్లో బోధన మొదలు కాబోతోంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి రెండో వారం నుంచే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో కాస్త ఆలస్యంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఆన్లైన్ బోధనకు అనుమతిచ్చింది. ఈక్రమంలో ఆన్లైన్, వీడియో పాఠాలు, ఇతర నెట్వర్కింగ్ యాప్‌ల ద్వారా తరగతులను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ప్రారంభం కాబోతుండటంతో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మాన్యువల్ తరగతులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు మాన్యువల్ పాఠాలు బోధించాలని సూచిస్తూ వారి హాజరుకు సుముఖత తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పాల్గొననున్నారు. జిల్లాల్లో హడావుడి.. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాల్లో హడావుడి మొదలైంది. స్కూళ్ల మూసివేతతో వాటి ఆవరణలో పేరుకుపోయిన చెత్త, తుప్పలను తొలగించాలని, తరగతి గదులను శానిటైజేషన్ చేయాలని సూచిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మహ్మద్ అబ్దుల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు సంబంధించిన అప్డేట్స్ను విద్యాశాఖ వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలతో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ అందులో పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకే స్కూళ్లలో బోధనకు అనుమతినిచ్చిన నేపథ్యంలో మిగతా తరగతులకు ఆన్లైన్ బోధన, వీడియో పాఠాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు డిజిటల్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సైట్) డైరెక్టర్ ఏ.క్రిష్ణారావు సోమవారం విడుదల చేశారు. -
బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ప్రారంభం