సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంపై విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేని చెప్పారు.
పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్, కార్పొరేటర్, మేయర్‌లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతిగృహాల్లో ఐసోలేషన్ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment