collectors conference
-
నాలా చట్టం రద్దు
సాక్షి, అమరావతి: అభివృద్ధికి అడ్డంకిగా మారిన నాలా చట్టాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నాలా అనేది చాలా మందికి మనీ కలెక్షన్ సెంటర్‌గా మారిందని, దీనివల్ల అనుమతులు ఆలస్యం అవుతుండటంతో ఆభివృద్ధి నెమ్మదిస్తోందని, అందుకనే ఆదాయం నష్టపోతున్నా కూడా దీన్ని రద్దు చేస్తున్నానని స్పష్టం చేశారు. మంగళ, బుధవారం సచివాలయంలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ‘రియల్ ఎస్టేట్ రంగం, పరిశ్రమలకు అడ్డంకిగా ఉన్న నాలా చట్టాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి రద్దు చేస్తాం. ఇప్పటి వరకు ఉన్న బకాయిలు కడితే సరిపోతుంది. ఎటువంటి పెనాల్టీ, వడ్డీలు చెల్లించక్కర్లేదు. సంపద అనేది కొందరికే పరిమితం కాకూడదు. అందుకే ఉగాది నుంచి పీ4 పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కలెక్టర్లు అడిగినప్పుడు సమస్యలను చెప్పడం కాదు. ఆ సమస్యలను వారే పరిష్కరించాలి. గతంలో నేను మాత్రమే పరుగులు పెట్టే వాడిని. ఇప్పుడు నాతో పాటు మిమ్మల్నీ పరుగులు పెట్టిస్తా. 2047 వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ప్రతి కలెక్టర్ కృషి చేయాలి. ఇందులో భాగంగా ప్రభుత్వ, ఆర్అండ్బీ అతిథి గృహాలు ప్రైవేట్ వారికి ఇచ్చి, హోటల్స్‌గా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలి‘ అని చెప్పారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో ప్రైవేట్ రంగంలో పెట్టడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వెనుకబడిన జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు» శ్రీకాకుళంతో పాటు వెనుకబడిన జిల్లాలో వచ్చే ఏడాదిలోగా నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలి. » అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉద్యాన పంటలు నిలువ చేసుకునేందుకు కోల్డ్ చైన్ లింకేజీ సౌకర్యాలను పెంచాలి. » రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా పనిచేసేలా ప్రతి గృహానికి బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ సౌకర్యం కల్పించాలి. » గోదావరి పుష్కరాలకు సన్నాహక చర్యలు మొదలు పెట్టాలి. ఇందు కోసం ఐఏఎస్ అధికారులు వీరపాండియన్‌ను ప్రత్యేకాధికారిగా, విజయరామరాజును అదనపు అధికారిగా నియమిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. హామీలపై కార్యాచరణ ఏదీ?ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై కార్యాచరణ లేకుండానే ముగిసింది. ఈ సదస్సుతో పాటు తొలి, రెండవ సదస్సులోనూ సూపర్ సిక్స్ సహా ఇతర హామీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత సదస్సులో మే నెల నుంచి తల్లికి వందనం అమలు చేస్తామంటూ ముక్తాయింపు ఇచ్చారు తప్ప, కలెక్టర్లతో కూలంకషంగా చర్చించలేదు. ఆదాయం పెంచితేనే హామీలు అమలు చేయగలనని, భారం అంతా కలెక్టర్లపై మోపారు. ఏం చేస్తే వృద్ధి రేటు 15 శాతానికి పైగా సాధించవచ్చో చెప్పకుండా.. ఆ మేరకు లక్ష్యం విధించడం సీఎం చిత్తశుద్ధి లోపమేనని అధికార వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం ఎలా పెరుగుతుందో కలెక్టర్లు చెప్పక పోవడంతో రంగు రంగుల పీపీటీలతో తనను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. మంత్రులెవ్వరినీ మాట్లాడనివ్వలేదు. మొత్తంగా ఈ తొమ్మిది నెలలో ఏ పనులూ పూర్తి కాలేదని బహిర్గతమైంది. -
ఆదాయం పెంచాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు పెంచడం ద్వారా ఆదాయం పెంచాలని, అప్పుడే తాను చెప్పిన విధంగా సంక్షేమ పథకాలను సజావుగా అమలు చేయగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు. ఆదాయం పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒక శాతం వృద్ధి రేటు పెంచితే అదనంగా రూ.15 వేల కోట్లు, 3 శాతమైతే రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని.. అప్పుడైతేనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలనని పునరుద్ఘాటించారు. వచ్చే ఆర్ధిక ఏడాది 15 శాతం పైగా వృద్ధి రేటు సాధించేందుకు అనుగుణంగా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలలి, పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. మే నెలలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు చొప్పున ఇస్తామని, స్కూల్స్ తెరిచేలోగా ఈ మొత్తాన్ని పంపిణీ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు వాయిదాల్లో ఇస్తున్న మొత్తంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు, 5 వేలు, 4 వేలు చొప్పున మూడు వాయిదాల్లో రైతులకు ఇస్తామని తెలిపారు. (హామీ మేరకు రూ.6 వేలు+రూ.20 వేలు = రూ.26 వేలు ఇవ్వాలి. కానీ కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు). మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో సహా ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని చెప్పారు. ఏప్రిల్‌లో మత్స్యకారుల జీవనోపాధికి రూ.20 వేలు ఇస్తామని, 2027లో పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్లు సీఈవోలా పని చేయాలని, ఎప్పటికప్పుడు పనితీరుపై సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. రెవిన్యూ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు – రెవెన్యూ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కలెక్టర్లు వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం భూ సంబంధిత సమస్యలే 60–70 శాతం ఉన్నాయి. దీనిపై వర్క్‌షాప్ నిర్వహించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలిసిన కలెక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, నిపుణులు నెల రోజుల్లో నివేదికతో రావాలి. “వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్’ అనే నినాదంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. – ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు రూ.1,030 కోట్లు విడుదల చేశాం. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేస్తాం. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరముంది. అన్ని వర్క్ ప్లేసుల్లో చైల్డ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అంతర పంటలతో అరకు కాఫీని ప్రోత్సహించాలి. – బీసీల్లో వడ్డెర కులస్తులకు క్వారీలు ఇచ్చేలా, మత్స్యకార సొసైటీలకు చెరువులు అప్పగించి చేపలు పెంచుకునేలా తోడ్పాటు ఇవ్వాలి. కల్లు గీత కార్మీకులకు కేటాయించిన వైన్ షాపులు దుర్వినియోగం కాకూడదు. – రైతులు ఇచి్చన భూములను తాకట్టు పెట్టడం, విక్రయించడం ద్వారా వచ్చే నిధులతోనే అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. అనకాపల్లి వద్ద స్టీల్ ప్లాంట్, రామాయపట్నం కోసం భూములతో పాటు మిగతా ప్రాజెక్టులకు ఇదే నమూనాను అమలు చేయాలి. అనకాపల్లిలో టౌన్íÙప్, రామాయపట్నంలో మరో టౌన్ షిప్ వస్తాయి. – కలెక్టర్లు.. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన అన్ని అనుమతులను వచ్చేలా చూడాలి. సోలార్ రూఫ్ టాప్, సహజ సేద్యంను ముందుకు తీసుకెళ్లాలి. గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, వాట్సాప్ గవర్నెన్స్, పీ4 గేమ్ చేంజర్ కానున్నాయి. – వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి. పశువులకు మేతపై దృష్టి పెట్టాలి. వడగాడ్పుల వల్ల ఒక్క వ్యక్తి కూడా మృతి చెందకూడదు. కాల్ సెంటర్ నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా పచ్చి మేత పెంపకానికి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వలసలకు తావివ్వొద్దు. – మంత్రులు, శాఖాధిపతులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా, నియోజకవర్గ, మండల, సచివాలయాల స్ధాయిలో విజన్ ప్రణాళికలతో ముందుకు సాగాలి. శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్పీలతో కలిసి పని చేయాలి. సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయారని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కుర్చీ వేశారు. అయితే ఆయన రాకపోయినప్పటికీ ఆ చైర్‌ను అలాగే ఖాళీగా ఉంచి సదస్సు నిర్వహించారు. కాగా, 2025–26 ఆర్థిక ఏడాదిలో స్థూల ఉత్పత్తి లక్ష్యాలలో భాగంగా వృద్ధి శాతం 16, 17, 18 చొప్పున జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారు. -
Andhra Pradesh: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం నుంచి గురువారం వరకు జిల్లా కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చిస్తారని, స్వర్ణాంధ్ర విజన్–2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ఈ సదస్సులో 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులు పాల్గొంటారని, వారి అభిప్రాయాలను సీఎం తెలుసుకుని, రానున్న నాలుగున్నరేళ్లలో ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై చర్చిస్తారని తెలిపింది. తొలి రోజు ఉదయం ఆర్టిజీఎస్, వినతుల పరిష్కారం, గ్రామ, వార్డు సచివాలయాలు, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై, మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పశుసంవర్థకశాఖ, హార్టికల్చర్, పౌర సరఫరాలు, అడవులు, జలవనరులు, పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా, సెర్ప్, పట్టణాభివృద్ధి, సీఆర్డీఏ, శాంతిభద్రతలు వంటి అంశాలపై చర్చిస్తారని వివరించింది. -
21న కలెక్టర్ల కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈనెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గాను ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సీఎంవో వర్గాలు చెపుతున్నాయి. ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ధరణి పోర్టల్‌పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58, 59 అమలు, ప్రజా వాణి కార్యక్రమం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి.. తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. -
ధైర్యంగా ఉండండి.. ప్రతీ రైతునూ ఆదుకుంటాం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. సీఎం జగన్ కామెంట్స్.. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సహాయం వారికి అందించాలి రుణ సాయం ఎక్కువైనా ఫర్వాలేదు, వారికి మంచి సహాయం అందాలి ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి దెబ్బతిన్న ఇళ్ల విషయంలో కానీ, క్యాంపుల నుంచి ప్రజలు తిరిగి వెళ్తున్న సందర్బంలో కానీ, వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు పంట పొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలి అన్నిరకాల మానవ వనరులు దీనిపై దృష్టి పెట్టండి ధ్యాసంతా ఇప్పుడు దీనిపై పెట్టాలి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది వారు అధైర్యపడాల్సిన పనిలేదు ప్రతి రైతునూ ఆదుకుంటుంది పంటల రక్షణ, తడిసిన ధాన్యాన్ని, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్నిరకాలుగా తోడుగా ప్రభుత్వం ఉంటుంది. సబ్సిడీపై విత్తనాల సరఫరాకు రకాలుగా సిద్ధం కావాలి. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోండి దీన్నికూడా ప్రాధాన్యతగా తీసుకోండి వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. చెట్టుకూలి చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ కుటుంబానికి రూ.30 లక్షల సహాయాన్ని అందిస్తాం విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వలంటీర్ల దగ్గర నుంచి పైస్థాయి ఉద్యోగుల వరకూ ఈ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సమీక్షలో క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ సీఎస్ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండియన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు. -
జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. కోవిడ్ నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహహక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. రబీలో పంట ఉత్పత్తుల సేకరణపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►పీఆర్సీ అమలు సహా, ఉద్యోగులకోసం కొన్ని ప్రకటనలు చేశాం ►కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ►కారుణ్య నియామకాలు చేయమని చెప్పాం. యుద్ధ ప్రాతిపదికన వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలి ►గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలి ►ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి ►జూన్ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలి ►అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలి ►ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలి ►ఇందులో ఆలస్యానికి తావు ఉండకూడదు ►జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించాం ►ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలి ►వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి ►స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలి. దీనివల్ల డిమాండ్ తెలుస్తుంది ►మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌చేయాలి ►ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి ►డిమాండ్‌ను బట్టి.. వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ►స్థల సేకరణకు వీలు ఉంటుంది ►సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్ చేయాలి ►అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలి ►గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్‌చేయాలి ►జూన్ 30 నాటికి ఇది ఈ ప్రక్రియ పూర్తి కావాలి ►జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి ►మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి ►మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు ►వారికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు చెప్తున్నాం ►అలాగే ఉద్యోగుల సర్వీసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం ►ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసును పెంచాం. దీనికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాలి. ►కోవిడ్ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నాం ►మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు ►కచ్చితంగా ఈ ఆంక్షలను అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి ►ఆరోగ్యశాఖలో 39 వేలమందిని నియమిస్తున్నాం ►ఇప్పటివరకూ 27 వేలమందిని రిక్రూట్‌చేశాం ►మిగిలిన వారికి ఈనెలాఖరులోగా నియమించాలి ►డాక్టర్లు లేరు, నర్సులు లేరు, పారామెడికల్సిబ్బంది లేరనే మాట వినకూడదు ►మార్చి 1 నుంచి ఈవిషయంలో కలెక్టర్లను బాధ్యులుగా చేస్తాను ►అందుబాటులో ఉండడం, సమస్యలు చెప్పేవారిపట్ల సానుభూతితో ఉండడం అన్నది ప్రతి ఉద్యోగి బాధ్యత. దీనివల్ల చాలావరకు సమస్యలు తీరిపోతాయి ►జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంద్వారా పూర్తి హక్కలు వారికి లభిస్తాయి ►లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి ►డాక్యు మెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలి ►స్పందనకోసం కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించాం ►ఒకే అంశంపై మళ్లీ అర్జీజీ వస్తే..దాని పరిష్కారంపై నిర్దిష్ట ఎస్ఓపీని పాటించేలా చేయాలి ►సుస్థిర ప్రగతి లక్ష్యాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►43 సూచికలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►ఈరంగాల్లో ప్రగతి ఎస్డీజీ లక్ష్యాలను చేరుకోవాలి ►దీనివల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి ►దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం ►దేశంమొత్తం మనవైపు చూస్తుంది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అమలు చేయనున్న పథకాలు, కార్యక్రమాలు: ►జగనన్న చేదోడు ఫిబ్రవరి 8న ►వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ ( తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు..)– ఫిబ్రవరి 15న ►జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం) – ఫిబ్రవరి 22న ►మార్చి 8న విద్యా దీవెన ►మార్చి 22న వసతి దీవెన చదవండి: ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు మద్దతివ్వాలి -
తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంపై విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్లైన్ క్లాసుల నిర్వహణ లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేని చెప్పారు. పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్, కార్పొరేటర్, మేయర్‌లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతిగృహాల్లో ఐసోలేషన్ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు. -
11న కలెక్టర్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టించేందుకు ఐఏఎస్ అధికారుల బదిలీలతో శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీతో సహకార ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఏడాదిగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో పాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ల సదస్సు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశమై.. ప్రభుత్వ ప్రాధమ్యాలను తెలియజేయడంతోపాటు ముఖ్యమైన పథకాలు, కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అలాగే రెండో విడత ‘పల్లె ప్రగతి’లో సాధించిన పురోగతిని జిల్లాలవారీగా సమీక్షిస్తారు. ఇక ఈనెల 15వ తేదీ తర్వాత రాష్ట్రంలో ‘పట్టణ ప్రగతి’కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పారిశుద్ధ్యంతోపాటు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నవివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యకమంలో భాగంగా చేపట్టనున్న పనులను, వాటి లక్ష్యాలను కలెక్టర్ల్లకు వివరించనున్నారు. ప్రభుత్వం ఆదివారం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. వీరిలో చాలామంది తొలిసారిగా జిల్లా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉద్దేశాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అలాగే, రెవెన్యూ చట్టం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం.. ఆ చట్టం ఎలా ఉండాలనే అంశంపై కలెక్టర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. -
ఇసుక సమస్యకు చెక్
సాక్షి, విజయనగరం : ఇసుక సమస్యకు ఇక చెక్ పడనుంది. ఇన్నాళ్లుగా ఇదో ఆయుధంగా మలచుకున్నవారి నోటికి తాళం పడనుంది. గురువారం ఉదయం నుంచే ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని జిల్లా సయుక్త కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల ఇసుక ర్యాంప్‌లు నీటితో తడిసిపోవడం వల్ల నెలరోజుల పాటు ఇసుక సరఫరా చేయలేదన్నారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో అధికారులు, ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులకు బుధవారం ఇసుక సరఫరాపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ప్రవేశపెట్టిందని, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా చెయ్యాలని ఆదేశాలు జారీచేశారన్నారు. జిల్లాలో 26 మండలాల్లో 70 ఇసుక రీచ్ లను గుర్తించామనీ, ఈ రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను 70 మంది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడమైందన్నారు. మిగిలిన మండలా ల్లో కూడా ఇసుక రీచ్ లను గుర్తిస్తామని, వీరికి ఇసుక అవసరమైతే గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా చేయ్యాలన్నారు. కార్యదర్శులు స్మార్ట్ ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఎస్3 ఫారం జనరేట్ చేసుకోవాలన్నారు. ఫారం జనరేట్ అయిన తర్వాత యూనిక్ నంబరు వస్తుందని దానిని ప్రింట్ తీసుకోని, 48 గంటల లోపు ఇసుకను తీసుకు వెళ్లాలన్నారు. ఒక టన్ను ఇసుక ధర రూ.375లు గా నిర్ణయించామనీ, ఇందులో రూ.285 లు ప్రభుత్వానికి, మిగిలిన రూ.90 లు లోడింగ్ చార్జీల కింద కార్మికులకు చెల్లించాలన్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుక సరఫరా చెయ్యాలని స్పష్టం చేశారు. ఒక ఎడ్ల బండికి అరటన్ను కు రూ.150లు, ఒక ట్రాక్టర్‌కు నాలుగున్నర టన్నుల ఇసుక పడుతుందని, రూ.1283 లు అవుతుందన్నారు. ఇసుకను యంత్రాలతో లోడ్ చేయవద్దని, కార్మికుల ద్వారా లోడింగ్ చేయించాలన్నారు. వాహనానికి ఎస్3 ఫారం అతికించాలని, అది లేకుండా ఇసుకను తరలిస్తే మొదటిసారి రూ.10 వేలు, రెండవసారి రూ.20 వేలు జరిమానా, మూడవ సారి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. రెండురోజుల తర్వాత నేరుగా నగదు స్వీకరించే అవకాశం కల్పిస్తామని వివరిచారు. జిల్లాకు 1,50,000 టన్నుల నుంచి 2లక్షల టన్నుల వరకు అవసరమని తెలిపారు. నీతి, నిజాయితీగా, పారదర్శకంగా పనిచెయ్యాలని, ఎటువంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా అర్హులైన వారికే ఇసుక కేటాయించాలన్నారు. కార్యక్రమంలో భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు పూర్ణ చంద్రరావు, సహాయ సంచాలకుడు ఎస్.వి.రమణారావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, ఎన్ఐసీ అధికారి నరేంద్ర కుమార్ , ఈఓపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మనం సేవకులం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘వినతులు ఇచ్చే ప్రజల పట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.. ఇలాంటి వాటిని సహించేది లేదు.. ప్రజలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం.. మనం సేవకులమే కాని, పాలకులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరించారు. ‘స్పందన’ కార్యక్రమంపై బుధవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పందనలో వచ్చిన వినతులను సీరియస్‌గా తీసుకోవాలని కింది స్థాయి అధికారులందరికీ చెప్పాలని సూచించారు. సరిగా స్పందించని కేసులు 2 నుంచి 5 శాతం వరకు ఉన్నాయన్నారు. వినతులు, సమస్యలు నివేదించే వారిని చిరునవ్వుతో ఆహ్వానించాలని, కలెక్టర్లు.. అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినవేనని అన్నారు. అయితే పని భారం వల్లో, మరే ఇతర కారణాలవల్లో ఇలాంటివి తలెత్తవచ్చునని, మరోసారి అలాంటి పొరబాట్లు జరగకుండా పరిశీలన చేసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. ఆ మేరకు యంత్రాంగాన్ని చురుగ్గా పని చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులకు మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు. ప్రతి చర్యలో మానవత్వం కనిపించాలి ‘స్పందన’లో సమస్యలు పరిష్కరించుకున్న వారిలో 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన 41 శాతం మంది మరింత మెరుగ్గా సమస్యలను పరిష్కరించవచ్చనే అప్రాయాన్ని వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి రాండమ్‌గా కాల్ చేసి అభిప్రాయాలు స్వీకరించామని చెప్పారు. ఈ విషయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొంతమంది అధికారులను పిలిపిస్తామని, వినతుల్లో భాగంగా ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామన్నారు. ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు.. అందర్నీ పిలిపించి ఈ తరహా ప్రక్రియ చేపడతామని చెప్పారు. మానవత్వం అనేది ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో కనిపించాలని, లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో.. అర్థంకాని పరిస్థితి వస్తుందన్నారు. దీనిపై కలెక్టర్లు.. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాల కారణంగా జ్వరాలు వస్తున్నాయని, వీటిపై ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య విభాగాలు దృష్టి పెట్టాలని.. ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం హెల్ప్ డెస్క్‌లు సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇచ్చే పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కలెక్టర్లకు మార్గదర్శకాలను వివరించారు. వాహన యజమాని భార్య అయినా, భర్త అయినా పర్వాలేదని, దరఖాస్తులు ఇవ్వడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 25గా నిర్ణయించామని, సెప్టెంబర్ 30 లోగా వెరిఫికేషన్, అప్ లోడింగ్ పూర్తి చేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు సౌకర్యం కోసం రవాణాశాఖ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, దరఖాస్తులు స్వీకరించేటప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని కౌంటర్లు పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడల్లో ఆటోలు, ట్యాక్సీలు ఎక్కువ కాబట్టి.. అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్లుకు సూచించారు. మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెట్ సదుపాయం ఉంటే ఎక్కడి నుంచైనా దరఖాస్తు నింపవచ్చనని, మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులు ఆమోదం పొందగానే అక్టోబరు 4 నుంచి డబ్బులు పంపిణీ చేయాలని, అక్టోబరు 5న రశీదులను వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇళ్ల స్థలాల పంపిణీపై దృష్టి సారించండి ఈ ఏడాది డిసెంబర్ నుంచి కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వైఎస్సార్ కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఈ కార్యక్రమం వల్ల కలెక్టర్లు, అధికారుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ఇన్ని లక్షల మంది జీవితాలను మార్చే అవకాశం ఉన్నందున దీనిపై అందరూ ఫోకస్ పెట్టాలని కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలోని 1,45,72,861 కుటుంబాలకు గాను 1,21,62,651 ఇళ్లలో వలంటీర్లు వెరిఫికేషన్ పూర్తి చేశారని, ఈ వారంతో పూర్తి స్థాయిలో పూర్తవుతుందని, ఇప్పటి వరకు 23,83,154 మంది ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో 3,772 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 25,822 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. అన్నీ పూర్తయ్యాక తుది గణాంకాలు నివేదిస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న వారందరికీ పారదర్శకంగా ఈ పథకం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వరదలు తగ్గగానే అందుబాటులోకి ఇసుక రీచ్‌లు వరదల కారణంగా ఇసుక రీచ్‌లు నిర్వహించడానికి ఇబ్బంది కలిగిందని, వరదలు తగ్గగానే ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. స్టాక్ యార్డుల్లో నిల్వలు పెంచేలా చూడాలన్నారు. ఇసుకలో మాఫియా, దోపిడీ లేకుండా చేశామని, వీలైనంత తక్కువ రేటుకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కొరత కారణంగా పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వరదలు తగ్గగానే చురుగ్గా ఇసుకను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్లు తెలిపారు. ప్రతి కలెక్టరేట్లో ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వీలైతే ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆ విభాగంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రూ.5 వేల ప్రత్యేక సహాయంపై సీఎం ఆరా తీశారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని, వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మళ్లీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కృష్ణా వరదలపై కూడా సీఎం ఆరా తీయగా విజయవాడ నగరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. -
ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు
సాక్షి, ఒంగోలు : రాష్ట్రంలో ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు పంపిణి చేసేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో గ్రామ సచివాలయాలు, స్పందన, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. దీనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఉగాది నాటికి ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇంటి స్థలాల పంపిణీ చేపట్టాలన్నారు. సొంత ఆటోలు, టాక్సీలు ఉన్న అర్హులైన వారికి సెప్టెంబర్ చివరి వారం నాటికి వారి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.10 వేలు జమచేస్తామన్నారు. అక్టోబర్ 2వ వారం నాటికి రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తామన్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశామన్నారు. నవంబర్ 21వ తేదీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లే వారి ఖాతాలో రూ. 10 వేలు జమ చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఇతర అధికారులు అదేవిధంగా మత్స్యకారులకు తక్కువ ధరకు డీజిల్ అందించేందుకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డీజిల్‌పై లీటరుకు రూ.6 నుంచి రూ. 9 వరకు సబ్సిడీ పెంచామన్నారు. గ్రామ వలంటీర్లు మత్స్యకారులకు ఈ విషయంపై అవగాహన కల్పించేలా చూడాలన్నారు. డిసెంబర్ 21 నాటికి మగ్గం ఉన్న ప్రతి చేనేకారుడికి రూ.24 వేలు ఇస్తామన్నారు. జనవరి 26 నాటికి అమ్మఒడి పథకం కింద పిల్లలను చదివించే ప్రతి తల్లికి రూ.15 వేలు తల్లి ఖాతాలో జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి షాపులున్న నాయిబ్రాహ్మణులకు, రజకులకు, టైలర్ల వారి ఖాతాల్లో రూ.10 వేలు జమచేస్తామన్నారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి వైఎస్సార్ పెళ్లికానుక ప్రోత్సాహకాన్ని పెంచి ఇస్తామన్నారు. మార్చి చివరి వారంలో దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలకు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమామ్‌లకు ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలాఖరుకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ చూపాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు విడతల వారీగా నగదు అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు రూ.1150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందకు ప్రభుత్వం సెప్టెంబర్ నుంచి దశల వారీగా నగదు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం నిర్వహించి వచ్చిన నగదును ప్రభుత్వం జమ చేసుకుంటుందన్నారు. రైతు భరోసా పథకం కింద కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని చేసినట్లు తెలిపారు. గ్రామ వలంటీర్లు రైతులకు, కౌలు రైతులకు మేలు జరిగే కార్యక్రమాన్ని తెలియజేయాలన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందన్నారు. గత ఐదేళ్ల నుంచి జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి రూ.4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.3 లక్షలు జాతీయ స్థాయిలో జూనియర్ క్రీడాకారులకు గోల్డ్‌మెడల్ సాధించిన వారికి రూ.1.25 లక్షలు, సిల్వర్ మెడ్ సాధించిన వారికి రూ.75 వేలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి రూ.50 వేలు లెక్కన నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలు సజావుగా జరగాలి సెప్టెంబర్‌లో నిర్వహించనున్న గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీకి గ్రామ, వార్డు సచివాలయ భవనాలను సిద్ధం చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, జెరాక్స్, లామినేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఇసుకను బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా స్టాక్ యార్డ్‌ల్లో ఇసుక నిల్వలు ఉంచాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అర్జీల పరిష్కారంలో తీసుకున్న చొరవను ఇతర జిల్లాల కలెక్టర్లు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీలను అభినందించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవని తెలిపారు. రైతులకు సంబంధించిన పట్టాభూమలను 23 ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో గ్రామ సచివాలయ ఏర్పాట్లకు భవనాలను సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయ ఉద్యోగ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను జిల్లా ఎస్పీతో కలిసి కొన్ని అంశాలను పరిశీలించి వేగవంతంగా పరిష్కరించామని వివరించారు. దీనిలో జాయింట్ కలెక్టర్ షాన్మోహన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటసుబ్బయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల జేడీలు శ్రీరామమూర్తి, రవీంద్రనాథ్ఠా>గూర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసింహులు, ఓఎంసీ కమిషనర్ నిరంజన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓటరు సవరణ
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సెప్టెంబర్ ఒకటి నుంచి ఇంటింటా ఓటరు సర్వే, జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 31 వరకు ఓటరు నమోదు, సవరణ చేపడతామని, సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకు బీఎల్వోలు, వివిధ రాజకీయ పార్టీల బూత్‌లెవల్ నాయకుల సహాయంతో ఇంటింటా పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుందని, ఇందులో స్థానికంగా ఉంటున్న వారు, ఇతర వార్డులో ఉన్నవారు, చనిపోయిన, ఓటరు జాబితాల్లో తప్పిదాలను సవరిస్తామని తెలిపారు. 2020 జనవరి ఒకటివరకు 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యంతరాలు స్వీకరణ అక్టోబర్ 15 నుంచి 30వరకు ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలో ఎక్కడైనా 1500 ఓటర్ల లోపు ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి జియోట్యాగింగ్ ఉంటుందని, ఆన్లైన్, మీసేవ, నేరుగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జాబితాలో వివరాలు ప్రత్యేక హెల్ప్‌లైన్ 1950 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. భూ సమస్యలకు రెవెన్యూ అధికారులు బాధ్యులు కారు జిల్లాలో నెలకొన్న వివిధ భూ సమస్యలపై గ్రామసభల ద్వారా రైతుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు రికార్డులు వారి ముందు ఉంచుతామన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్, ఫారెస్ట్, వారసత్వంగా వచ్చినవి, తదితర భూముల సమస్యలు నెలకొన్నాయని, ఇందులో రెవెన్యూ అధికారులు పరిష్కరించేవి కొన్నిఉంటే, సివిల్‌కోర్టు, రిజిస్ట్రేషన్ పరిధిలో ఉన్నాయన్నారు. భూ సమస్యలకు రెవెన్యూ అధికారులది బాధ్యత కాదని పేర్కొన్నారు. మే నెలలో మండల స్థాయిలో నిర్వహించిన భూ సమస్యల పరిష్కార వేదికలో 16వేల వరకు అర్జీలు రాగా అందులో 4 వేల సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. కొన్ని సివిల్ తగాదాలు, కోర్టు పరిధిలోనివి.. తాతలు, తండ్రుల నుంచి వస్తున్న భూములు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నా.. కాస్తులో వారిపేరు, ఇతర రికార్డులు వారివద్ద ఉంటే చూపించాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డులో ఉన్న వాటిని పరిశీలించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. వారసత్వ పంపకాలకు సరిహద్దులు చూపించడం కుదురదని, సర్వేనంబర్ల ఆధారంగా హద్దులు చెబుతామని తెలిపారు. కుటుంబంలో పెద్దకుమారుడికి భూమి మొత్తం ఇచ్చి.. ఇప్పుడు అన్నదమ్ములకు సమానంగా ఇవ్వాలని ఫిర్యాదు చేయడం సరికాదని, అలాంటివాటిని సబ్‌కలెక్టర్, సివిల్‌కోర్టులో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటివి సత్వరమే పరిష్కారం కావని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కూమర్ దీపక్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా మంచి సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు రెండవ రోజైన మంగళవారం సీఎం జగన్ ఎస్పీలు, కలెక్టర్లతో శాంతిభద్రతలపై సమీక్షలో భాగంగా పలు ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో యురేనియం కర్మాగారం కార్యకలాపాలవల్ల తాగునీరు కలుషితం అవుతోందన్న ప్రజల అభ్యంతరాలను సీఎం ప్రస్తావించారు. ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి, బుల్డోజ్ చేసే పద్ధతి వద్దని అధికారులను ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలని చెప్పారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తతతో ఉండాలన్నారు. ఇటువంటి వాటి వల్ల భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. కాలుష్య నియంత్రణపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చాక మిగతా విషయాలు చర్చిద్దామని చెప్పారు. యురేనియం కంపెనీ అధికారులు, సంబంధిత ప్రజలు, కడప ఎంపీతో సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోందని, ప్రజలకు కనీసం మంచి నీరు కూడా అందించలేకపోతే ఎలా అని ఆయన పశ్నించారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న తాగునీటి కష్టాలు చూశానన్నారు. నీరు కాలుష్యం బారిన పడకుండా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణకు కఠినమైన, కచ్చితమైన విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. సమాజానికి చేటు తెచ్చే వాటిపై జవాబుదారీతనం ఉండాలని, విశ్వసనీయత ఉన్న ఏజెన్సీతో తాగునీటి పరీక్షలు చేయించి నీటి కాలుష్యం నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధవళేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నీటిని తీసుకుని ప్రతి గ్రామంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూములు తీసుకుని పరిశ్రమ పెట్టకపోతే ఎలా? పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరుకు సమీపంలో గత ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు(కలువపూడి శివ)కు ఇచ్చిన 350 ఎకరాల్లో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదని ఆ జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. 2016లో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తే ఆయన ఆ భూమికి నామమాత్రపు ధర సుమారు రూ.ఏడు కోట్లు కూడా చెల్లించలేపోతే ఇంకా వందల కోట్లు పెట్టి పరిశ్రమలు ఎలా పెడతారని సీఎం ప్రశ్నించారు. మీరు చూసీచూడనట్టు వదిలేస్తే ఇదో ల్యాండ్ గ్రాబింగ్ అవుతుందని తప్పుబట్టారు. ఆయన ఏ పార్టీవారైందీ అనవసరమని, ఆ భూమిని తక్షణం వినియోగంలోకి తెచ్చి పరిశ్రమ పెడతారో? లేదో? తెలుసుకుని పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేఈ పవర్ ప్రాజెక్టుపై నివేదిక ఇవ్వండి.. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చెందిన పవర్ ప్రాజెక్టు విషయంలో దాదాపు 150 కుటుంబాల వారు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఆందోళన చేస్తున్నారని కర్నూలు జిల్లా అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కేఈ ప్రాజెక్టు కోసం ఎస్సీ కుటుంబాలను బెదిరించి ఖాళీ చేయించారని, ప్రత్యామ్నాయం కూడా చూపలేదని అధికారులు ప్రస్తావించారు. దీనిపై పూర్తి వివరాలతో తనకు నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడ సమస్యను పరిశీలించి అవసరమైతే ఆ ప్రాజెక్టును కూడా రద్దు చేయొచ్చన్నారు. ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను రానివ్వరా? అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రభోదానంద ఆశ్రమానికి భక్తులను ఎందుకు అనుమతించడంలేదని, ఆలయాలకు, ఆశ్రమాలకు భక్తులను రానీయకుండా అడ్డుకుంటే ఎలా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు మంచిది కాదన్నారు. ఆలయాలు, ఆశ్రమాలు ఎక్కడికైనా భక్తులు వెళ్లేలా ఉండాలన్నారు. ఏదైనా అసాంఘిక శక్తులు అక్కడకు వెళ్తున్నట్టు పోలీసులకు సమాచారం ఉంటే చర్యలు తీసుకోవచ్చని, అంతేగానీ సాధారణ భక్తులకు ఇబ్బందులు కలిగించడం సరికాదని చెప్పారు. స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామంటే వినలేదు.. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి వారి ఆట కట్టించే చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వం అనుమతివ్వలేదని ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతరావు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. స్మగ్లింగ్‌లో తమిళనాడు, కర్ణాటక ముఠాలు ఉన్నాయన్నారు. అక్కడి ఎస్పీలతో తాను మాట్లాడానని, జాయింట్ ఆపరేషన్‌కు వారు అంగీకరించారన్నారు. అయితే ఎన్నికల ముందు అదనపు పోలీసు బలగాలను ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినప్పటికీ అనుమతించలేదని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. పట్టుబడిన ఎర్రచందనం, వాహనాలు వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను కట్టడి చేసేందుకు చాపర్ (హెలికాఫ్టర్) కావాలని గ్రేహౌండ్స్ ఏడీజీ నళిన్ ప్రభాత్ సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. రాష్ట్రంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల పని తీరును వివరించిన ఆయన చాపర్ అవసరాన్ని ప్రస్తావించారు. చాపర్ కోసం కేంద్ర హోం శాఖకు లేఖ రాద్దామని సీఎం జగన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి గ్రేహౌండ్స్ హెడ్ క్వార్టర్ మంజూరు చేసిందని, దాన్ని విశాఖపట్నం రూరల్ జిల్లాలో నిర్మించాలని నిర్ణయించినట్టు నళిన్ ప్రభాత్ చెప్పారు. అయితే అక్కడ అటవీ ప్రాంతం ఢి నోటిఫైడ్ చేయడంలో సాంకేతిక సమస్య రావడంతో ఇంత వరకు గ్రేహౌండ్స్ హెడ్‌క్వార్టర్ నిర్మాణం చేపట్టలేదన్నారు. -
విజయవాడ: ముగిసిన కలెక్టర్ల సదస్సు
-
బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయనున్న ప్రభుత్వం
-
వైఎస్ జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తూ.. టీడీపీ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు తవ్వకాలు జరపడం సరికాదన్నారు. బాక్సైట్ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సీఎం ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. కాగా వైఎస్ జగన్ గతంలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని అనేక సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు నెలకోసారి తప్పనిసరి పర్యటించాలని సీఎం ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా రిత్యా... అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఒకేసారి ఆయా ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రజలందరికీ ప్రభుత్వం సేవలు అందుతున్నాయా.? లేదా అన్నదానిపై సమీక్ష నిర్వహించాలన్నారు. గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి అభిమానాన్ని చూరగొనాలని సీఎం ఆదేశించారు. -
రైతులపై అక్రమ కేసులు పెట్టారు
-
అక్రమాలకు నో చెప్పండి
-
హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయండి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ప్రత్యేకహోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి? గత సీఎం నివాసం సమీపంలో ఇసుక మాఫియా సాగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక దోపిడీ అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై ఓ ప్రజాప్రతినిధి జుట్టు పట్టుకుని దాడి చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా మన కళ్ల ఎదుటే జరిగాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది సరైన విధానమేనా? గుంటూరు జిల్లాలో అక్రమమైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భూ సమీకరణ పేరుతో పోలాలు ఇవ్వని రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఎమ్మెల్యేలే బహిరంగంగా దందాలకు పాల్పడ్డారు. గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్‌లకు ఎమ్మెల్యేలు సహకరించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు లేకుంటే నంబర్‌వన్ పోలీస్ ఎలా అవుతుంది. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ఎన్ని కేసులు నమోదయ్యాయి. ఎంత మందిని అరెస్ట్ చేశారు. మనమంతా కూర్చున్న ఈ వేదిక అక్రమ కట్టడమే. ఈ విషయం నిన్న కూడా చెప్పా. ఈ నిర్మాణం అక్రమమని జలవనరుల శాఖ నివేదిక కూడా ఇచ్చింది. మన కళ్లెదుటే మాజీ సీఎం అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వమే అక్రమ కట్టడాలను నిర్మిస్తే ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు? ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. మంచి పాలనపై మీరు తీసుకునే నిర్ణయాల పట్ల నా పూర్తి సహకారం ఉంటుంది. అప్పుడే సుపరిపాలన అందించగలం. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని మా నాన్న నేర్పించారు. నేను కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. దేశంలోనే తొలిసారిగా ఎక్కడా లేని విధంగా పోలీసులకు వీక్లీఆఫ్ అందించాలని నిర్ణయించాం. కుటుంబంతో గడపాల్సిన అవసరం పోలీసులకు ఉంది. దీనివల్ల మరింత ఉత్తేజంతో వారు విధుల్లోకి వస్తారు. డిపార్ట్మెంట్లో దిగువస్థాయికీ దీన్ని వర్తింపచేయండి. పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుదారులను గౌరవించేలా రిసెష్షన్ విభాగం ఉండాలి. ఎస్పీలు ఆకస్మీక తనిఖీలు చేయాలి నిన్న కలెక్టర్లకు డిస్ట్రిక్ పోర్టల్ ప్రారంభించమని చెప్పాను. అందులో ఎఫ్ఐఆర్ల నమోదు, లైసెన్స్‌లు, అనుమతులు ఇలాంటివన్నీ పెట్టమని చెప్పాను. వేగం, పారదర్శకత కోసమే ఈ విధానం. పోలీసులకు పనితీరుకు సంబంధించి నివేదిక ఉండాలి. థర్డ్‌పార్టీ ఇది చూడాలి. అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి. పోలీసు అధికారుల పనితీరుపై బాధితులు, ప్రజల నుంచి మనం ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. మండల స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకూ గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని నిన్నే కలెక్టర్లకు చెప్పాం. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పాం. ప్రతి గ్రీవెన్స్‌కు రశీదు ఇచ్చి, వారి ఫోన్ నంబర్‌ను తీసుకోమన్నాం. ఇలాంటి విధానమే పోలీసు వ్యవస్థలో కూడా అమలు చేయాలి. విశ్వసనీయత, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో వేగం ఉండాలి. ఎస్పీలు కూడా గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలి, ప్రజలతో మమేకంకావాలి. గ్రామాల్లో బలహీన వర్గాలు, ఎస్సీల కాలనీలకు వెళ్లి.. పోలీసుల తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. సైబర్ కేసులను పూర్తిగా అడ్డుకోలేకపోతున్నామన్న అభిప్రాయం ఉంది. మహిళల హక్కులను మనం కాపాడాలి. సైబర్ హెరాస్‌మెంట్‌ను కఠినంగా అణచివేయాలి. వీలైతే అధికారుల అందరికీ శిక్షణ ఇవ్వాలి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారో చూడాలి. సామాజిక అసమానతను నిర్మూలించాలి. ఈవ్‌టీజింగ్ పట్ల కఠినంగా ఉండాలి. మంచి ప్రభుత్వం, మంచి పాలన, సరైన విధానాలు, నంబర్‌ఒన్ పోలీసింగ్కోసం మనం కృషిచేయాలి’ అని వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. చదవండి: పాలకులం కాదు.. సేవకులం కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జగన్ సీరియస్ -
రెండో రోజు కలెక్టర్ల సదస్సు
-
కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. ఈ రాకెట్లో వైఎస్సార్సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి. బెల్ట్ షాప్స్ పూర్తిగా ఎత్తేయాల్సిందే.. అక్టోబర్ 1 నాటికి బెల్లుషాపులు పూర్తిగా ఎత్తేయాల్సిందే. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలి. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండవద్దు. దాబాల్లో మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. భద్రతా నిబంధనలు, నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలి. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలి. విజయవాడ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలి. దీనిపై సబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేయండి. గంజాయి సాగుని పూర్తిగా నియంత్రించాలి. గంజాయి నిర్మూలన దిశగా ఆగస్టులో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించి గంజాయి సాగు నుంచి దూరం చేయాలి. పోలవరం నిర్వాసితుల కోసం.. పోలవరం నిర్వాసితుల సమస్య పై శాశ్వతంగా గ్రీవెన్సు సెల్ పెట్టాలని నిర్ణయించాం. ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా ఇందుకోసం కేటాయించాం. నిర్వాసితుల ప్రతి సమస్యను వేగంగా పరిష్కరించాలి. పోలవరం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్. ఆర్థికంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోంది. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలకు తాగునీరు అందించలేకపోతే చాలా సమస్యలొస్తాయి’ అని వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం) -
మహిళలపై నేరాల సంఖ్య పెరిగింది
-
వారిపై నేరాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి : డీజీపీ
సాక్షి, విజయవాడ : మహిళలపై నేరాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, చిన్న పిల్లలపై జరగుతున్న నేరాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. వైట్ కాలర్‌నేరాలను నియంత్రించాల్సి ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలపై నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు. గతేడాది ఏడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన కల్పిస్తామని అన్నారు. గతేడాది సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. పోలీస్ అకాడమీ, ఫోరెన్సిక్ ల్యాబ్, ఉగ్రవాద వ్యతిరేక శిక్షణా కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని అన్నారు. వీక్లీఆఫ్ కమిటీ నివేదికను విడుదల చేసిన సీఎం పోలీసులకు పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఏపీ ప్రభుత్వం వీక్లీఆఫ్‌ను అమలుపరచనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ విడుదల చేశారు. -
ప్రారంభమైన రెండో రోజు కలెక్టర్ల సదస్సు
-
మహిళలపై నేరాలను అరికడతాం
-
మహిళలపై నేరాలను అరికడతాం: హోంమంత్రి సుచరిత
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. పారదర్శకత, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. బడుగు బలహీన, మైనార్టీ, సాధారణ ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు వీక్లీఆఫ్‌లను కల్పించామని పేర్కొన్నారు. మహిళలపై నేరాలను అరికడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. వాహనదారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం) -
కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. శాంతిభద్రతలు ప్రధాన అజెంగా సమావేశం జరుగుతోంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిశోర్‌కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. తర్వాత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశం ప్రాధాన్యతను వివరించారు. అనంతరం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రసంగించారు. శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్రంలో చేపడుతున్న చర్యల గురించి సభకు తెలిపారు. -
అది నా అదృష్టం: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తనకు మంచి అనుభవంగల ఉన్నతాధికారుల బృందం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. విజయవాడలోని బెరంపార్కులో ఐఏఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన గెట్ టు గెదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన ఐఏఎస్‌ల మార్గదర్శకత్వం, సహకారంతో ఏపీని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దగలననే నమ్మకం తనకు కలిగిందన్నారు. కలెక్టర్ల సదస్సులో తన మదిలో ఉన్న ఆలోచనలు అందరితో పంచుకున్నానన్న సీఎం వైఎస్ జగన్.. ఐఏఎస్ అధికారుల ప్రేమను, అభిమానాన్ని చూరగొనడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. సంఘం అధ్యక్షుడు మన్మోహన్సింగ్ ముఖ్యమంత్రికి మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ ఉదయలక్ష్మి ఈ కార్యక్రమంలో మాట్లాడారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం) -
వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం
-
కరువు రైతులకు రూ. 2620.12 కోట్ల బకాయిలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు గత ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని మొన్నటి వరకూ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శిగా పనిచేసి బదిలీ అయిన వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితిపై ఆయన కలెక్టర్ల సదస్సులో సోమవారం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2018–19 ఖరీఫ్ సీజన్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, రబీలో 13 జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా యన్నారు. అలాగే, 2019–20 ఖరీఫ్‌లో ఈనెల 21 వరకు 59.1 శాతం లోటు వర్షపాతం నమోదైందంటూ గణాంకాలతో వివరించారు. ‘2018–19లో ఖరీఫ్‌లో 347 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం రూ.900.40 కోట్లు విడుదల చేసింది. 16 లక్షల మంది రైతులకు రూ.1,832.60 కోట్ల పెట్టుబడి రాయితీ మొత్తాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే, రబీ సీజన్లో 257 కరువు మండలాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.644.97 కోట్ల కేంద్ర సాయం కోరింది. దీనిపై సీఎం హోదాలో మీరు మరోసారి లేఖ రాసి నిధులు విడుదలకు ప్రయత్నం చేయాలి. రబీ సీజన్లో రూ.787.52 కోట్లు, ఖరీఫ్ సీజన్లో 1832.60 కోట్లు కలిపి మొత్తం రూ.2620.12 కోట్ల పెట్టుబడి రాయితీని గత ప్రభుత్వం రైతులకు చెల్లించలేదు’.. అని వరప్రసాద్ వివరించారు. దీనికి స్పందించిన సీఎం జగన్.. గత ప్రభుత్వం అన్నీ ఇలాగే చేసిందని, అయినా మనం ప్రథమ ప్రాధాన్యం కింద రైతులకు పెట్టుబడి రాయితీ బకాయిలు విడుదల చేయాలి రావత్ అన్నా.. అని చెప్పారు. విత్తన కొరత పాపం టీడీపీ సర్కారుదే.. ఖరీఫ్ సీజన్లో విత్తనాల కొరత అంశంపై కలెక్టర్ల సదస్సులో ఎక్కువసేపు చర్చ జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి, రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కొరత ఉందని ప్రజాప్రతినిధులు ప్రధానంగా ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ఒక రకం వరి విత్తనం కొరత ఉందని మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. చిత్తూరు జిల్లాలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడంలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుని.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమని ఆరోపించారు. విత్తనాల సేకరణ కోసమున్న రూ.360 కోట్లను కూడా ఎన్నికల పథకాలకు గత ప్రభుత్వం మళ్లించిందని.. దీనివల్ల ఇప్పుడు విత్తనాలు కొనాలన్నా దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. వచ్చే ఐదేళ్లకు దీర్ఘకాలిక దృక్పథంతో విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తామన్నారు. ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ స్పందించి.. ఏటా అవసరాల కంటే పది శాతం ఎక్కువ బఫర్ స్టాక్ ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. జూన్ వరకూ వర్షపాత లోటు ఉన్న నేపథ్యంలో ఈ సీజన్లో వర్షాల అంచనా ఏమిటని ఆయన వాకబు చేశారు. ఒకవేళ వర్షాలు అనుకున్న స్థాయిలో కురవకపోతే ప్లాన్–బి’ సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. విత్తనాలు దొరక్కపోతే మిల్లెట్స్ అయినా ప్రత్యామ్నాయంగా అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు ఏదో మాట్లాడబోగా.. ‘గత ప్రభుత్వం రూ.360 కోట్లను మళ్లించింది. మనం ప్రభుత్వంలోకి వచ్చి నెల కూడా కాలేదు. అధికారులు సమస్య తీర్చడానికి కిందా మీద పడుతున్నారు. వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. లేనివి ఇప్పుడు సృష్టించలేరు కదా. రైతులు ఇబ్బంది పడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. రావత్ అన్నా.. మీరు డబ్బు విడుదల విషయంలో కొంచెం ఉదారంగా ఉండండి..’ అని ఆదేశించారు. కరువు నేపథ్యంలో ఉద్యాన పంటల పరిరక్షణకు కూడా నిధులు అవసరమైతే తక్షణమే విడుదల చేయాలన్నారు. అనంతరం, కరువు నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం లాభదాయకత గురించి వ్యవసాయ సలహాదారు విజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. బ్యాగుల్లో ఇంటింటికీ సన్న బియ్యం ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి జరిగిన చర్చలో ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ.. సర్కారు నిర్ణయం మేరకు ప్రజలకు వినియోగించుకునే బియ్యాన్నే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 10, 15 కిలోలుగా బ్యాగుల్లో ప్యాక్‌చేసి డోర్ డెలివరీ చేస్తామన్నారు. ధాన్యం ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల బకాయి ఉందని.. ఈ నిధులు విడుదల చేయాలని కోన శశిధర్ కోరారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న వివిధ రకాల ధాన్యం ఏడు జిల్లాల్లో పండదని, దీనివల్ల సేకరణ సమస్య రాకుండా చూడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ.. ‘ గత ప్రభుత్వం అందరికీ బకాయిలు పెట్టింది. రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా నిధులను ఎన్నికల పథకాలకు, చంద్రబాబుకు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు మళ్లించింది. ఇది ఎంత చెప్పినా తక్కువే. రావత్ అన్నా.. తక్షణమే వెయ్యి కోట్లు విడుదల చేయాలి. లేకపోతే ఈ సీజన్లో ధాన్య సేకరణకు రైతుల వద్దకు వెళ్తే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శికి సూచించారు. గ్రామ సచివాలయాల్లో సరుకుల నిల్వ గ్రామ సచివాలయాల్లోని ఒక గదిలో నిత్యావసర సరుకులను నిల్వ చేస్తారు. ఒకవేళ ఇక్కడ అదనపు గది లేనిపక్షంలో పక్కనే ఒక గదిని సమకూర్చుకుని అక్కడ నిల్వచేయాలి. అక్కడి నుంచి గ్రామ వాలంటీర్లు నిత్యావసర సరకులు తీసుకెళ్లి తమ పరిధిలోని 50 ఇళ్ల వారికి డోర్ డెలివరీ చేస్తారు. పట్టణాల్లోనూ ఇదే తరహాలో వార్డు సచివాలయాల నుంచి వార్డు వాలంటీర్లు ఇంటింటికీ అందజేస్తారు. ప్రతి పౌరుడూ ఒక మొక్క నాటాలి రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ ఒక మొక్కను నాటాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలనేది తన ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఇంటిలో, స్కూళ్లు, ఆస్పత్రులలో, ప్రతి ప్రభుత్వ స్థలంలో మొక్కల నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. రైతులకు పగలే తొమ్మిది గంటల విద్యుత్ రాష్ట్రంలోని 18.15 లక్షల పంపు సెట్లకు 6,663 ఫీడర్ల ద్వారా పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని సదస్సులో ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. 3,854 ఫీడర్ల ద్వారా ఉ.5 నుంచి సా.7 వరకూ పగటి పూటే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా ఈనెల 17 నుంచి ప్రారంభించామన్నారు. మరో 2,809 ఫీడర్ల ద్వారా కూడా విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను రూ.1,700 కోట్లతో పనులు చేపట్టామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో 57,450 వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని, వాటిని త్వరగా జారీ చేయడంతోపాటు ఏటా 50 వేల వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక అమలుచేస్తున్నామని వివరించారు. మరోవైపు.. రాష్ట్రంలో 1.7 కోట్ల మంది వినియోగదారులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని శ్రీకాంత్ చెప్పారు. విద్యుత్తు సరఫరాలో పగటిపూట అంతరాయాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉండి ఉండవచ్చని, సబ్స్టేషన్లు, ఫీడర్లు పెంచాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఒకేసారి కాకుండా రెండు విడతల్లో తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని, దీనివల్ల భూగర్భ జలమట్టం పడిపోకుండా ఉంటుందని కొందరు మంత్రులు సూచించగా.. ఇందులో తనకేమీ అభ్యంతరంలేదని పగలు తొమ్మిది గంటలు వ్యవసాయ విద్యుత్తు సరఫరా చేస్తామన్న హామీ అమలుచేయాలన్నదే తన లక్ష్యమని సీఎం చెప్పారు. ఐఏఎస్‌ల్లా కాదు... ప్రజాప్రతినిధుల్లా ఆలోచించండి అర్హులైన పేదలకు న్యాయం చేసే విషయంలో చట్టం అంటూ గిరిగీసుకోవద్దని, అవసరమైన చోట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అవినీతిని ఏమాత్రం సహించవద్దని, అయితే అదే సమయంలో పేదలకు న్యాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ఐఏఎస్ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల్లా ఆలోచించాలన్నారు. మనమూ, వాళ్లూ ఒక్కటే... ఇది మన ప్రభుత్వం ‘మనమూ, వాళ్లూ ఒక్కటే. ఇది మన ప్రభుత్వం. మనం ప్రతిపక్షంలో లేం. మనది అధికార పక్షం. అధికారులంతా మన ప్రభుత్వంలో భాగమే. మనమూ, వాళ్లూ ఒక్కటే. ఈ విషయాన్ని మొదట నీ బుర్రలోకి ఎక్కించుకోవాలి’ అని మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురక అంటించారు. కలెక్టర్ల కాన్ఫరెన్సులో చర్చ సందర్భంగా గిరిజా శంకర్‌ను ఉద్దేశించి మంత్రి అవంతి శ్రీనివాస్ అన్న మాటలపై సీఎం ఘాటుగా స్పందించి ఇలా వ్యాఖ్యానించారు. మంగళగిరి – చినఅవుటపల్లి రహదారి నిర్మిస్తే... గన్నవరం ఎయిర్‌పోర్టుకు స్థలం, విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి కలెక్టరు ఇంతియాజ్ ప్రస్తావించగా మంగళగిరి నుంచి చినఅవుటపల్లి వరకూ రహదారి నిర్మిస్తే విజయవాడలో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘విజయవాడలో మొదట నిర్మాణంలో ఉన్న రెండు ఫ్లైఓవర్లను కనీసం ఆరు నెలల్లో పూర్తి చేయండి. ఇవి పూర్తయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు గురించి చూద్దాం. మంగళగిరి నుంచి చిన్నఅవుట్పల్లి వరకూ రహదారి నిర్మాణానికి భూమి ఉంది. దీన్ని నిర్మిస్తే గుంటూరు నుంచి విజయవాడ నగరంలోకి రాకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు కడుతూనే... ఉన్నారంటూ సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్ ఇంతియాజ్ ఐకానిక్ వంతెన గురించి ప్రస్తావించగా.. ‘ఐకానిక్ కాదు, ముందు రోడ్డు పనులు ప్రారంభించి తర్వాత కలవండి’ అని సీఎం సూచించారు. -
టార్చ్‌లైట్ ఆపరేషన్లు పునరావృతం కారాదు
సాక్షి, అమరావతి: టార్చ్లైట్లు, సెల్ఫోన్ల వెలుతురులో పేద రోగులకు ఆపరేషన్లు నిర్వహించే పరిస్థితులు మళ్లీ రాకూడదని, ఎలుకలు కొరికి శిశువులు మృతి చెందిన ఘటనలు పునరావృతం కారాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై దిశా నిర్దేశం చేశారు. తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిల విడుదల గత 9 నెలలుగా పేరుకుపోయిన సుమారు రూ.450 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద మెరుగైన సేవలు అందించాలన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీల వద్ద ఉండే నిధులను కలెక్టర్లు జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ సొసైటీల అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను నియమిస్తున్నట్లు జీవో జారీ అయిందా? అని ఆరా తీశారు. దీనిపై కొందరు ప్రతికూలంగా మాట్లాడుతున్నా బాధ్యతలు పెరిగి మంచే జరుగుతుందన్నారు. మాతా శిశుమరణాలు తగ్గాలి.. మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. వర్షాల నేపథ్యంలో జ్వరాలు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. త్వరలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు: జవహర్‌రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నవారందరికీ త్వరలోనే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కె.జవహర్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన వైద్య ఆరోగ్యశాఖపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఇస్తున్న రూ.750 కోట్లతో సివిల్ నిర్మాణాలు చేపడతామన్నారు. భారతీయ వైద్యమండలి నిబంధనల మేరకు వైద్య కళాశాలల్లో వసతులు కల్పిస్తామని చెప్పారు. శిశుమరణాలను గణనీయంగా నియంత్రించి ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖను తీర్చిదిద్దుతామన్నారు. క్యాన్సర్ కేర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. మలేరియా, డెంగీ జ్వరాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. కంటి జబ్బులు, అసాంక్రమిక (ఎన్సీడీ) జబ్బుల నియంత్రణకు పక్కా వ్యూహంతో ముందుకెళతామన్నారు. ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్లు ఏమన్నారంటే... - ఏజెన్సీ ప్రాంతాల్లో 108 అంబులెన్సులు సరిపోవడం లేదు. వీటిని పెంచాలి. పాత వాహనాలను మార్చాలి. - ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల పనితీరు బాగా లేదు. వీటిని సరిదిద్దాలి. - పీహెచ్‌సీల నుంచి సీహెచ్‌సీలుగా ఉన్నతీకరించిన ఆస్పత్రులకు సిబ్బందిని సమకూర్చాలి. -
కొత్తగా పదేసి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు గ్రామ, వార్డు స్థాయిల్లో ఇప్పుడు పనిచేసే ప్రభుత్వ సిబ్బంది పదేసి మంది లేనిచోటే కొత్త నియామకాలు చేయాలని ప్రతిపాదనలు అందించగా.. ఇప్పుడు పనిచేస్తున్నవారు కాకుండా పదేసి మందిని కొత్తగా నియమిస్తామని సీఎం చెప్పారు. ఇప్పుడు పనిచేస్తున్నవారు వివిధ వ్యవహారాలపై బయట తిరుగుతూ ఉంటారని, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించే పదేసి మంది ఉద్యోగులు నిరంతరం సచివాలయాల్లోనే ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా ఉండే వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల నుంచి తీసుకొచ్చే వినతులను 72 గంటల్లో సంబంధిత శాఖలను సంప్రదించి పరిష్కరించడమే పదేసి మంది ఉద్యోగుల ప్రధాన కర్తవ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తమ గ్రామంలో నాణ్యమైన ఐఎస్ఐ విత్తనాలు కొనుగోలు చేసేలా పరీక్షల ద్వారా నిర్ధారించడం వంటివి వీరి విధుల్లో ఒకటిగా ఉంటాయన్నారు. కింది స్థాయిలో ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలనే.. కనీసం రెండు వేల జనాభా ఉండే ప్రతి ఊరిలో గ్రామ సచివాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొందరు కలెక్టర్లు ప్రతి 5,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని గ్రామ పంచాయతీలుగా వర్గీకరించి, అక్కడ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. దీనిపై స్పందించిన సీఎం ప్రభుత్వంలో ఈ అంశంపైనా లోతుగా చర్చ జరిగిందని, చాలా కింది స్థాయిలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలనే లక్ష్యంతోనే గ్రామ సచివాలయానికి కనీస జనాభా 2000 మంది ఉండేలా నిర్ణయించినట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు పెద్ద ప్రాంతంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ఏ ప్రాతిపదికన పట్టణాల్లో వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలనేది మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు కలిపి దాదాపు లక్షన్నర మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశముందన్నారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యం అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి కాకుండా, అభ్యర్థుల్లో సేవాదృక్పథం, నిజాయతీ ప్రాతిపదికన వలంటీర్ల ఎంపిక ఉండాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వలంటీర్ల నియామకంపై కలెక్టర్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. మండల స్థాయిలో ఎంపీడీవో నేతృత్వంలో ముగ్గురు కమిటీ సభ్యులు నిర్వహించే వలంటీర్ల ఇంటర్వూ్యల్లో అభ్యర్థిలో సేవా దృక్పథాన్ని, నిజాయతీని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అక్షరభారత్ వంటి కార్యక్రమాల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగించడం వల్ల ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి వలంటీర్ల నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో వంద కుటుంబాలకు ఒక వలంటీర్ అనే నిబంధన అన్ని చోట్ల ఒకే విధంగా అమలు చేయొద్దన్నారు. పేదల కుటుంబాలు కొద్ది దూరంలో విస్తరించి ఉన్నప్పుడు అలాంటి చోట పట్టణాల్లో 50 ఇళ్లకే వలంటీర్‌ను నియమించాలని ఆదేశించారు. -
వైఎస్ జయంతి.. ఇక రైతు దినోత్సవం
సాక్షి, అమరావతి: అన్నదాతల ఆపద్బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రతి ఏటా వైఎస్ జయంతి అయిన జూలై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ సోమవారం కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. పంటల బీమా, రైతులకు వడ్డీలేని రుణం తదితరాలకు సంబంధించిన చెల్లింపుల అంశాలను ఆ రోజుకు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు పండుగలా నిర్వహించాలని సూచించారు. ఇక చౌక ధరల దుకాణాలు ఉండవు ‘గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చౌక ధరల దుకాణాలు ఉంటాయా? ఉండవా? చాలా చోట్ల డీలర్లు లేరు. ఖాళీలు భర్తీ చేయాలా? అవసరం లేదా? మార్గనిర్ధేశం చేయండి’ అని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ హరికిరణ్ కోరగా ‘డీలర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం లేదు. గ్రామ వలంటీర్లే ఇంటింటికీ నిత్యావసర సరకులు సరఫరా చేస్తారు’ అని సీఎం స్పష్టం చేశారు. ఒకే రోజు రైతులందరికీ పెట్టుబడి రాయితీ వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.12,500 పెట్టుబడిని అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రమంతా ఒకేరోజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ప్రతి రైతు కుటుంబానికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు, పెట్టుబడి రాయితీ, పంటల బీమా తదితర సంక్షేమ పథకాల ఫలాలు పక్కాగా అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని నొక్కి చెప్పారు. -
ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలి : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని మొత్తం 5 కోట్ల మంది ఐదు కోట్ల మొక్కలను నాటాలని తన ఆలోచన అన్నారు. మొక్కలను నాటే కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లను భాగస్వాములుగా చేయాలని కలెక్టర్లకు సూచించారు. స్కూళ్లు, ఆస్పత్రులలో చెట్లను నాటేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్ఆర్ కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొక్కలు నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలి రైతులకు ఉచిత విద్యుత్ అంశాన్ని ప్రాధన్య అంశంగా భావించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జనన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చించారు. ఉచిత విద్యుత్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫీడర్ల వారిగా ప్రణాళిక ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 57వేలకు పైగా పంపుసెట్లకు కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు సీఎంకు తెలిపారు. నిర్ణిత సమయంలో వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్ ఆధికారులను ఆదేశించారు. -
ఆ స్కాంలపై విచారణ జరుపుతాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ఎంత భూమి ఉందో అంచనా వేసి.. దానిలో ప్రభుత్వ భూమిని గ్రామాల వారిగా లెక్కలు తీయండని సీఎం సూచించారు. ప్రభుత్వ భూమి లేని చోట ప్రైవేటు భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పేదలకు అపార్టుమెంట్లు రూపంలో ఇచ్చేటప్పుడు దానిపై వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలన్నారు. గతంలో అర్బన్ హౌసింగ్ నిర్మాణంలో మొత్తం దోపిడీ చేశారని, వెయ్యి రూపాయలు దాటని వ్యయాన్ని 2 వేలకు పైగా పెంచేసి అవినీతికి పాల్పడ్డారని సీఎం వివరించారు. గతంలో జరిగిన పట్టణ ఇళ్ల నిర్మాణాల స్కాంపై విచారణ జరుపుతామన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ళు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. కాగా పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని సీఎం వైఎస్ జగన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అర్హులందరికీ పెన్షన్లు... రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అనర్హులుంటే వారిని వెంటనే తొలగించాలని కలెక్టర్లతో సమావేశంలో వివరించారు. అభయ హస్తం పెన్షన్ వస్తోందని.. పెన్షన్ ఇవ్వకపోవడం సమంజసం కాదని అన్నారు. దీనిపై సరైన పరిష్కారం కనుగొనాలని కలెక్టర్లకు సూచించారు. ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్ -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రుల బకాయిలు చెల్లించాలి
-
విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
-
ఆ నిధుల విడుదలలో ఉదారంగా వ్యవహరించాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో విత్తనాల కొరతపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. విత్తనాలకు సంబంధించిన రూ.360 కోట్లను గత ప్రభుత్వం దారిమళ్లించిందని, దాని వల్లే ప్రస్తుతం సమస్యలు తలేత్తాయని సీఎం ఆరోపించారు. విత్తనాల నిధుల విడుదలలో ఉదారంగా ఉండాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రత్యామ్నాయ విత్తనాలైనా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వచ్చే ఐదేళ్లకు సరిపడ విత్తనాలపై సరైన ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన సేవలందాలి : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఇక మీదట ప్రభుత్వాస్పత్రుల్లో ఎలుకలు వచ్చి పిల్లల్ని కొరకడం.. టార్చిలైట్ల వెలుగులో ఆపరేషన్లు చేయడం వంటి సంఘటనలు పునరావృతం కాకుడదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్ప్రత్రులకు రూ. 450 కోట్ల బకాయిలున్నాయి అన్నారు. గత ప్రభుత్వం 9 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని.. వీలైనంత త్వరగా వాటిని చెల్లించాలని జగన్ ఆదేశించారు. కుష్టువ్యాధి వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తున్నారని జగన్ ప్రశ్నించారు. కుష్టువ్యాధి మళ్లీ విజృంభిస్తున్నట్లు పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందన్నారు. కుష్టువ్యాధి నివారణ, మందులు, చికిత్స తదితర అంశాలపై సీరియస్‌గా దృష్టిపెట్టాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు. -
అందుకే ‘అమ్మ ఒడి’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం. ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్రూమ్స్ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫారాల్లో స్కాంలు జరగకూడదు. మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్ స్కూల్‌కు పోవాలనే ఆలోచన రాకూడదు. ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం. ప్రైవేట్ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.(చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) సన్న బియ్యం ఇస్తాం.. పౌరసరఫరాల శాఖలో ప్రజలు వాడే వస్తువులనే ఇవ్వాలి. ఇప్పుడిస్తున్న బియ్యం నాణ్యత బాగోలేదు. ఆ బియ్యాన్ని తిరిగి డీలర్‌కే అమ్మేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తిరిగి అవే బియ్యం పాలిష్ చేసి, మళ్లీ ప్రజల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది. ప్రజలు వినియోగించే వాటినే మనం ఇవ్వాలి. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ, మరోవైపు క్వాలిటీ బియ్యం ప్రజలకు చేరాలి. దీనికి కలెక్టర్లు కీలకమైన పాత్ర పోషించాలి. గత ప్రభుత్వం రైతులకు రూ.1000 కోట్లు బకాయి పడింది. ఈ డబ్బులను ఎన్నికల స్కీంలకు మళ్లించారు. ఈ వెయ్యి కోట్లను రైతులకే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ కలెక్టర్లకు తెలిపారు. (చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
ఉగాదికి ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేదవారి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికారులు సమాయత్తం కావాలని, భూమి లభ్యత లేనిచోట కొనుగోలు చేయాలని సూచించారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాదు, స్థలం ఎక్కడుందో లబ్ధిదారులకు స్పష్టం చూపించాలన్నారు. ఉగాది రోజున ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ ఒక పండుగ లాగ చేయాలన్న ఆకాంక్షను సీఎం జగన్ వెలిబుచ్చారు. అధికారులు విశ్వసనీయత కాపాడుకోవాలని.. ఏ విధానమైనా అందరికీ ఒకేలా ఉండాలని తర, తమ భేదం వద్దని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు వెబ్ పోర్టల్‌కు అనుసంధానం చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఇందులో అందరికీ అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ పనుల వివరాలను కూడా వెబ్ పోర్టల్‌లో ఉంచాలన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయ గోడలకు అతికించాలని, ఎవరెవరికీ లబ్ధి జరుగుతుందో గ్రామస్తులకు తెలియాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితా పంచాయితీల స్థాయిలో తయారు కావాలని దీనివల్ల పాదర్శకత పెరుగుతుందన్నారు. జాబితాలో ఎవరు ఉండాలి, ఉండకూడదన్న దానిపై అవగాహన ఉంటుందని తెలిపారు. అధికారులకు వలంటీర్లు కళ్లు, చెవులుగా ఉంటారని.. గ్రామ సచివాలయం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు. విధులను ఇష్టంతో నిర్వర్తించాలని, తమదైన ముద్ర వేసేలా పని చేయాలని కలెక్టర్లకు ప్రేరణ ఇచ్చారు. (చదవండి: ‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) -
ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదు ఇవ్వాలి. పై అధికారులు కూడా ఆ రోజు మీకు ఫోన్లు చేయరు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వినండి. మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి. లేదంటే నా దృష్టికి తీసుకురండి. మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం. మన దగ్గర పనిచేసే వాళ్లనే సంతోషపెట్టకుంటే ప్రజలను ఎలా సంతోషపెడ్తాం? (చదవండి : ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం) వారంలో ఒక రోజు.. ఐఏఎస్ అధికారులు ప్రతి వారం ఒక రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలి. మీరు వస్తున్నట్లు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వద్దు. హాస్టళ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీల పరిస్థితిని ఫొటో తీయండి. రెండేళ్ల తర్వాత తీసే ఫొటోలో మన అభివృద్ధి కనపడాలి. వాటి అభివృద్దికి కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తా. ఒక జిల్లా కలెక్టర్‌గా మీరు పనిచేసి వెళ్లిన తర్వాత ప్రజలు మంచిగా గుర్తు చేసుకోవాలి. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కలెక్టర్లు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. అధికారులను అప్యాయంగా పలకరించాలి. సంక్షేమ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలను పట్టించుకోవద్దు’ అని వైఎస్ జగన్ సూచించారు.( చదవండి : మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) -
‘ప్రజావేదిక’పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని అడిగారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు సాగుతున్నాయని, దీనికి చెక్ పెట్టాల్సిన అవరసముందన్నారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని వెల్లడించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రజావేదికను పూర్తిగా అవినీతి సొమ్ముతో నిర్మించారని సీఎం జగన్ ఆరోపించారు. (చదవండి: మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్ జగన్) కాగా, ప్రజావేదికపై ఇప్పటికే ప్రభుత్వానికి సీర్‌ఆర్‌డీఏ నివేదిక సమర్పించింది. ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నివేదికలో పేర్కొంది. అధికారంలో ఉండగా తన అక్రమ నివాసం పక్కన చంద్రబాబు అనధికారికంగా కట్టించిన ప్రజావేదిక అక్రమాలు, దుర్వినియోగాలకు వేదికగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ చంద్రబాబు సహా ఆయన కుమారుడు, టీడీపీ నేతలు దాన్ని యథేచ్ఛగా దుర్వినియోగం చేశారు. పేరుకు ప్రభుత్వ భవనమే అయినా ఇన్నాళ్లు దానిని టీడీపీ కార్యాలయంగా వాడుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ ఇష్టానుసారం వినియోగించుకున్న చంద్రబాబు.. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదలకుండా వేలాడుతుండడం విమర్శలకు దారితీసింది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా దాన్ని తనకే ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
-
సీఎం వైఎస్ జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించనున్నారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సీఎం వైఎస్ జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టో అమలులో చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పథకాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి వారం తాను కూడా కలెక్టర్లతో సమీక్షిస్తానని చెప్పారు. డైనమిక్ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో అధికారులు, కలెక్టర్లు సమర్థవంతంగా పని చేయాలన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటల తరబడి సమీక్షలు పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టకూడదని సీఎం భావించినట్లు తెలిపారు. సృజనాత్మక ఆలోచనలు చేయటానికి అధికారులకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించారని చెప్పారు. అందుకే షెడ్యూల్‌ని అవసరమయిన సమయం మేరకు మాత్రమే నిర్థేశించారని తెలిపారు. అందుకే ఇంత గొప్ప తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇంత గొప్ప తీర్పును ఇచ్చారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చెందిన ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలు ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం, అధికారులు పని చేయాలని సూచించారు. ప్రజల గ్రీవెన్స్ పరిష్కారం వేగంగా జరగడం లేదన్నారు. కలెక్టర్లు అంతా దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సూచించారు. నవరత్నాలతో రాష్ట్రంలో గొప్ప మార్పురాబోతోందని అన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి లేని, పారదర్శకమయిన పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందించాలని చెప్పారు. భూముల రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ రైతులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీలన్ని భర్తీ చేసి సమర్థంగా పనిచేస్తామని చెప్పారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రైతుల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. -
రేపు, ఎల్లుండి కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాడ్డక జరుగుతున్న తొలి కలెక్టర్ల సమావేశం కావడంతో.. దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలిపేందుకు స్పష్టమైన కార్యచరణతో ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళికలను కలెక్టర్లకు వివరించనున్నారు. అలాగే నవరత్నాల అమలు, అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన ప్రధాన అజెండాగా ఈ కాన్ఫరెన్స్ సాగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరుకానున్నారు. -
24న సీఎం జగన్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు
సాక్షి, అమరావతి : ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. గతానికి భిన్నంగా సచివాయలంలోనే దీనిని నిర్వహించనుంది. గత ప్రభుత్వం ఈ సదస్సును మొదట ప్రయివేటు (ఎ-1) కన్వెన్షన్ సెంటర్లోనూ, తర్వాత కరకట్టవద్ద నిర్మించిన గ్రీవెన్సు హాలులోనూ నిర్వహించింది. అయితే కొత్త సర్కారు మాత్రం కలెక్టర్ల సదస్సును రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శక పాలన, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రజారోగ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ, పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం సరఫరా, వ్యవసాయ రంగం స్థితిగతులు, కరువు, తాగునీటి ఎద్దడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో సమీక్షిస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం నిర్వహించనున్న తొలి కలెక్టర్ల సదస్సులో పారదర్శక పాలన, సర్కారు ప్రాధాన్యాలు, కొత్తగా అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలకు ఏర్పాట్లు తదితర ప్రధానమైన అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం అజెండా రూపొందించి పంపించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం అయిదో బ్లాక్ కాన్ఫరెన్సు హాలులో 24వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సమావేశం ప్రారంభమవుతుందని డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) తొలి పలుకులతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. -
రెవెన్యూపై సీఎం ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల క్రతువు పూర్తికావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో వివిధ ఎన్నికలు జరుగుతుండటంతో గత 9 నెలలుగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. శనివారంతో ఈ కోడ్ ముగిసిపోతుండటంతో పరిపాలనకు పదునుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చేవారం ఆయన కలెక్టర్లతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఇది. ఈ సమావేశంలో రెవెన్యూ సంబంధిత అంశాలే ప్రధాన ఎజెండా కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మ్యూటేషన్లు, డిజిటల్ సంతకాలు, భూ రికార్డుల ప్రక్షాళన పురోగతిపై చర్చించే అవకాశం ఉంది. రెవెన్యూ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తానని కేసీఆర్.. లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో ఫోన్లో చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు తెస్తామని, వీటిని జూన్‌లో మొదలు పెడతామని ప్రకటించారు. స్థానిక సంస్థల కోడ్ కూడా రేపటితో ముగియనుండటంతో పూర్తిస్థాయిలో పాలనా వ్యవహారాలపై ఫోకస్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల నవీకరణలో జాప్యం, ధరణి వెబ్సైట్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, మ్యూటేషన్లు, పాస్‌పుస్తకాల జారీ పెండింగ్‌పై స్పష్టమైన వివరాలు పంపాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయం కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. చట్టంలో పొందుపరచాల్సిన అంశాలు, రెవెన్యూ శాఖ రద్దు, విలీనం, సంస్కరణలు ఇతరత్రా అంశాలపై కీలక అడుగు వేసే వీలుంది. 4.56 లక్షలు పెండింగ్ భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదరహిత ఖాతాలకు కూడా ఇంకా పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీకాకపోవడంతో రైతాంగంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. 4.56 లక్షల ఖాతాలకు సంబంధించి తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు కాకపోవడంతో పాస్‌పుస్తకాల జారీ నిలిచిపోయింది. ఇవేగాకుండా సెప్టెంబర్ అనంతరం క్రయ విక్రయాలు జరిగిన భూముల మ్యూటేషన్లు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఒక కారణమైతే.. ధరణి వెబ్సైట్ పుణ్యమా అని రోజుకో ఆంక్షతో రికార్డుల అప్డేషన్ ముందుకు సాగడంలేదు. మరోవైపు వివాదాస్పద/అభ్యంతరకర భూముల జాబితా(పార్ట్–బీ)లో చేర్చిన భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు వెలువరించకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష అనంతరమైనా.. వీటికి మోక్షం కలుగుతుందేమో వేచి చూడాలి. -
హడావుడిగా హైకోర్టును విభజించారు
సాక్షి, అమరావతి: సమయం ఇవ్వకుండా హైకోర్టును హడావుడిగా విభజించారని సీఎం చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక సమావేశ మందిరంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఉద్యోగులు వచ్చేందుకు సంసిద్ధంగా లేకుండానే విభజించారని చెప్పారు. అయినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. కోర్టులు వస్తున్నందున సరిపడా విమానయాన సర్వీసులు వెంటనే కల్పించాలని అందరూ కోరుతున్నారని తెలిపారు. కాంక్రీట్ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సచివాలయం ర్యాఫ్ట్ పనులకు రెండు రోజుల కిందట శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఎయిర్‌షో చివరి నిమిషంలో రద్దు చేసి కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం డబ్బులు సకాలంలో ఇస్తే పోలవరం ప్రాజెక్టును వేగంగా నిర్మించవచ్చని, 2019లో పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ డ్వాక్రా మహిళలకు.. అధికారులు ఏం చేసైనా సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్లో 90 శాతంపైగా సంతృప్త స్థాయి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే నెల 2 నుంచి నిర్వహించనున్న ‘జన్మభూమి మా ఊరు’ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డులు అర్హులందరికీ ఇవ్వాలని, అదేవిధంగా కార్డుల విభజనను అడిగిన వారందరికీ ఇవ్వాలని సూచించారు. రేషన్ డీలర్లకు కమీషన్ వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపు పరిధిలోని రేషన్ కార్డుల సంఖ్యలో 5 శాతం కార్డులకు డీలర్ వేలి ముద్రతో సరుకులు తీసుకొని వేలి ముద్రలు పడని లబ్ధిదారులకు ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని పౌరసరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్‌కు సీఎం ఆదేశించారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ.. ఆ విధంగా అనుమతి ఇస్తే అవినీతిని ప్రోత్సహించినట్లు అవుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల్లో ఇటు గ్రామీణ అటు పట్టణాల్లో నిర్మిస్తున్న వాటిపై సరైన లెక్కలు లేవని, 4 లక్షల ఇళ్ల వరకు తేడాలు కన్పిస్తున్నాయని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణను డ్వాక్రా గ్రూపు సభ్యులకు అప్పగించాలని సూచించారు. దీనికి వారికి పారితోషికం ఇవ్వాలన్నారు. ఇళ్లు అడిగిన వారికి మొదట జన్మభూమి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లు ఎప్పుడు నిర్మించాలనేది తర్వాత చూద్దామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాల వివరాలన్నీ ఒక స్టిక్కర్ రూపంలో తయారు చేసి ఇళ్ల వాకిళ్లకు అతికించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంసహకరించకున్నా 10.52 శాతం గ్రోత్... కేంద్రం సహకరించకున్నా 10.52 శాతం గ్రోత్ రేటు సాధించామని చంద్రబాబు చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశామన్నారు. ఇచ్చిన కొద్ది నీటితోనే అనంతపురం జిల్లా రైతులు ఉద్యానవన రంగంలో అద్భుత ఫలితాలు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారని చెప్పారు. సాంకేతికతతో అవినీతిని చాలావరకు నియంత్రించగలిగామన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్రం 3 స్థానంలో ఉందన్నారు. నాలుగేళ్లుగా వృద్ధి ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2014 నుంచి జాతీయస్థాయి కంటే ఎక్కువగా వృద్ధి ఫలితాలను సాధిస్తూ వస్తున్నామని తెలిపారు. రూ. 2864 కోట్ల పంట నష్టం... రాష్ట్రంలోని 347 మండలాల్లో ఖరీఫ్‌లో రూ. 2,864 కోట్లు పంటనష్టం జరిగిందని కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు రూ.1,900 కోట్లు ఇన్పుట్ సబ్సిడి ఇవ్వాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. చుక్కల భూముల సమస్యపై సబ్ కమిటీ రాష్ట్రంలో ఉన్న చుక్కల భూములు, గ్రామ కంఠక భూముల సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కమిటీలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఉంటారని తెలిపారు. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. -
ఎన్నికల ముచ్చట్లు.. తలలు పట్టుకున్న కలెక్టర్లు
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కంటే తానే సీనియర్ అని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిచోటా సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఆఖరికి ఉన్నతాధికారులనూ వదలడం లేదు. చంద్రబాబు నాయుడు మరోసారి తనకు అలవాటైన విద్యను ప్రదర్శించారు. శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ వేదికగా తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని పరిస్థితుల గురించి, ప్రభుత్వ కార్యక్రమాల అమలు గురించి కలెక్టర్లతో చర్చించాల్సింది పోయి రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచార విశేషాలను సమావేశంలో ఏకరువు పెట్టారు. హైదరాబాద్ ప్రగతి, అభివృద్ధి, పురోగతి తన వల్లే జరిగిందని అన్నారు. సైబరాబాద్ సృష్టికర్తను తానేనని కలెక్టర్లకు ఉద్భోద చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం తమతో చర్చిస్తారని భావించిన కలెక్టర్లు చంద్రబాబు ప్రసంగంతో విస్తుపోయారు. అత్యున్నత స్థాయి అధికారుల సమావేశంలో రాజకీయ ఉపన్యాసం ఏమిటంటూ అక్కడున్నవారు గుసగుసలాడుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తుంటే నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపైనే ఉందని చంద్రబాబు అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు అని తనవేనని వ్యాఖ్యానించారు. తాను తీసుకున్న చర్యల వల్లే తెలంగాణకు హైదరాబాద్ పెద్ద ఆస్తిగా మారిందని గొప్పలకు దిగారు. ఇంకా విచిత్రంగా ప్రతిసారి తనను విమర్శించే కేసీఆర్.. సీఎం అయ్యాక ఏం కట్టారని కలెక్టర్లను ప్రశ్నించారు. సీఎం అలా మాట్లాడుతుంటే ఎలా స్పందించాలే అర్థం కాక కలెక్టర్లు.. ఫామ్‌హౌస్ తప్ప ఏం కట్టలేదంటు వివరణ ఇచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై అధికారులు, రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబే తర్వాతే ఎవరైనా అంటూ జనం జోకులు వేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయన మారరంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
అడిగిన వెంటనే పరిశ్రమలకు భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అడిగిన వెంటనే భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు కోరగానే ప్రభుత్వ భూములను అప్పగించాలన్నారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసిన తక్షణమే వారికి ఏపీఐఐసీ భూములు కేటాయించాలని, ఏమాత్రం జాప్యం చేయరాదని పేర్కొన్నారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దనున్న గ్రీవెన్స్ హాల్లో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. సంక్షోభ సమయంలో ఆంధ్రప్రదేశ్ అద్భుత ఫలితాలు సాధించిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే 2029 కంటే ముందే మన రాష్ట్రం తిరుగులేని శక్తిగా ఆవిష్కృతమవుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలో వంద శాతం డిజిటల్ లిటరసీ సాధించాలని సూచించారు. ‘‘పరిశ్రమలు ఏర్పాటు చేసేవారు వచ్చి మనల్ని భూములు, సౌకర్యాలు అడగడం కాదు. మనమే వారి వద్దకు వెళ్లి మేం ఇవి ఇస్తాం, మీరు పరిశ్రమలు పెట్టండి అని పిలవాలి’’ అంటూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విడుదలలో జాప్యం చేయరాదన్నారు. చంద్రబాబు ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘‘రాష్ట్రంలో లక్ష హోటల్ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలి. హోటల్ గదులు మనం నిర్మించాలి. నిర్వహణ బాధ్యతలను ప్రముఖ సంస్థలకు అప్పగించాలి. మనం కష్టపడి రూపొందించిన ఈ–ప్రగతి, ఫైబర్ నెట్ లాంటి వాటిని మేధో హక్కుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరిపాలనపై ప్రజల సంతృప్త స్థాయిని ప్రస్తుతం ఉన్న 75 శాతం నుంచి 80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, ఎయిర్‌స్ట్రిప్, పరిశ్రమ కోసం 5,000 ఎకరాలు సేకరించాలి. విజయవాడ శివారులోని జక్కంపూడిలో 106 ఎకరాలు, నున్నలో 70 ఎకరాలు, త్రిలోచనపురంలో 40 ఎకరాలను సేకరించండి. టౌన్‌షిప్‌లు నిర్మిద్దాం. గోదావరి జిల్లాలోని తిమ్మాపురంలో ఎకనామిక్ సిటీ నిర్మిద్దాం. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి వెంటనే భూసేకరణకు వెళ్లండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణపై దృష్టి పెట్టండి. కేవలం పథకాలను అమలు చేస్తే సరిపోదు. వాటి గురించి ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం డబ్బు ఖర్చు అవుతుందని వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ 2019 మార్చి నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆ తరువాత మరో 20 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దేవాదాయ స్థలాలను వేలం వేసి, పేదలకు ఇవ్వాలి. భవిష్యత్‌లో ఎండోమెంట్ భూములను కాపాడలేం. ఇప్పుడే పేదలకు పంపిణీ చేస్తే బాగుంటుంది. పట్టణాల్లో పేదలు ప్రైవేట్ స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి 200 గజాల వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి గృహాలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. క్రీడలు నిరంతర ప్రక్రియగా ప్రజల జీవన విధానంలో భాగం కావాలి. గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలి. నిరుద్యోగ భృతిని వచ్చే నెల నుంచి అందించాలని నిర్ణయించాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. చెరువులను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి ప్రయోజనార్థం చెరువు భూమిని వేస్ట్‌ల్యాండ్‌గా మార్చడం సరికాదేమో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సూచించారు. అయితే గత ఏడాది మా జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అర్బన్ హౌసింగ్‌పై చర్చ జరుగుతున్నప్పుడు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని మునిసిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శి కరికాలవలవన్ చెప్పగా మంత్రి ఈ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. 2016–17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గృహాలను జిల్లాకు కేటాయించలేదన్నారు. మద్యం బెల్ట్ షాపులను నియంత్రించాలి రాష్ట్రంలో మద్యం బెల్ట్ దుకాణాలు ఇంకా కొనసాగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు నొక్కి చెప్పారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించేందుకు ఎక్సైజ్, పోలీసు అధికారులతోపాటు కలెక్టర్లు కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ల సదస్సులో, తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షలోనూ సాంబశివరావు ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆధార్ డేటా వాడితే క్రిమినల్ చర్యలు విశిష్ట గుర్తింపు సంఖ్య (ఆధార్) డేటాను బహిర్గతపరచడం చట్టరీత్యా తీవ్ర నేరమని ఆధార్ అథారిటీ ఛైర్మన్ జె.సత్యనారాయణ తెలిపారు. ‘‘ఆధార్‌కు సంబంధించిన డేటా ఎక్కడైనా వెబ్సైట్లలో ఉంటే వెంటనే తొలగించండి. ఆధార్ వివరాలు వెబ్సైట్లో ప్రదర్శించినా, బహిరంగ పరిచినా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని కలెక్టర్ల సదస్సులో సత్యనారాయణ స్పష్టం చేశారు. -
15వ ఆర్థికసంఘం నిర్ణయాలపై చంద్రబాబు ఆసంతృప్తి
-
ప్రగతిశీల రాష్ట్రాలకు చేటు
సాక్షి, అమరావతి: ‘‘2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటామని 15వ ఆర్థిక సంఘం ప్రకటించడం దారుణం. దీనివల్ల దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇది ప్రగతిశీల రాష్ట్రాలకు అన్యాయం చేయడమే అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్లో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజల సంతృప్తే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అన్ని విషయాల్లోనూ ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని పూర్తిగా మటుమాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘క్షేత్రస్థాయి పర్యటనలు, పల్లె నిద్రల ద్వారా ప్రత్యక్షంగా జనంతో మాట్లాడితే ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి? ఎక్కడెక్కడ ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ప్రజలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాలు అధికారులకు తెలుస్తాయి. అందుకే పర్యటనలు, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 47 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. మరో 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించాం. నాలుగేళ్ల క్రితం రాష్ట్ర విభజన వల్ల మనకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాలుగేళ్లు కష్టపడి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని సాధించాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా సమానంగా దృష్టి పెట్టాం. 6,000 వర్చువల్ తరగతి గదులు ఈ ఏడాది 6,000 వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నాం. ఐఐటీలో మన పిల్లలకు 12 శాతం ర్యాంకులు వచ్చాయి, ఇది మనకు గర్వకారణం. జీఎస్డీపీలో వెనుకబడి ఉన్నా, తెలివితేటల్లో శ్రీకాకుళం జిల్లా ముందుంది. అక్టోబర్ 2 నాటికి నూరు శాతం గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చాలి. తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలతో 11 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా(ఎంఎస్ఎంఈ) పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. యువత టెక్నాలజీ ద్వారా ప్రయోజనం పొందాలే గానీ చెడిపోయే పరిస్థితి రాకూడదు. టెక్నాలజీ వల్ల మంచితోపాటు చెడు కూడా ఉంటుంది. మనం మంచినే వినియోగించుకోవాలి. లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కాలానుగుణంగా మార్చుకోవాలి. స్థూలంగా చూస్తే మనమంతా బాగానే పనిచేశాం. మన పనితీరును సూక్ష్మస్థాయిలో ఇంకా మెరుగు పర్చుకోవాల్సి ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమల్లో నిర్లక్ష్యం వద్దు సాధించాలనే తపన, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధ్యమే. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూసినట్లే మనం ప్రతి మూడు నెలలకోసారి పనితీరును సమీక్షించుకుని ముందుకెళుతున్నాం. జూన్ 2వ తేదీకి నవ్యాంధ్రప్రదేశ్‌లో పాలనకు నాలుగేళ్లు నిండుతాయి. ప్రతిఏటా అదేరోజు నవనిర్మాణ దీక్షను అందరిలో స్ఫూర్తి కలిగించేలా నిర్వహిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదు’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి: మంత్రి యనమల రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు రెండంకెల స్థాయికి చేరిందని, టెక్నాలజీని ఉపయోగించుకోవడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుకుంటేనే తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ‘‘వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకుంది. ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదు. అయినా ఏ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి సమర్థంగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు’’ అని వివరించారు. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు: కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ శాఖలో ప్రభుత్వం పలు సంస్కరణలు తెచ్చినా అధికారులు ప్రభుత్వ ఆశయాల మేరకు పని చేయడం లేదని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం కోసం వచ్చిన చాలా అర్జీలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. వివాదం లేని ప్రైవేట్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలన్న ఆదేశాలను కూడా అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని కేఈ కృష్ణమూర్తి సూచించారు. ఎస్సీలు, మహిళలపై దాడులు ఆందోళనకరం: సీఎస్ రాష్ట్రంలో ఎస్సీలు, మహిళలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీలపై నేరాల విషయంలో దేశంలోనే ఏపీ ఏడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. మహిళలపై నేరాల విషయంలో తొమ్మిదో స్థానంలో ఉందన్నారు. 2017–18లో రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 7,910 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి ప్రాంతంలో భూగర్భ జలమట్టం కలుషితం కావడం ఆందోళనకర పరిణామమని వివరించారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్ర పునేత ప్రారంభోపన్యాసంతో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సంక్షేమం తదితర శాఖల ప్రగతిని సంబంధిత అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా విద్య, వైద్యంపైనే ఎక్కువ చర్చ జరిగింది. పిల్లల్లో కొందరు పోషకాహార లోపంతో తక్కువ బరువు, ఎదుగుదల లోపం, రక్తహీనత వంటి సమస్యలతో అల్లాడుతుంటే మరికొందరు ఊబకాయంతో బాధ పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పౌరసరఫరాల శాఖ ద్వారా పాలిష్డ్ బియ్యం బదులు బ్రౌన్ రైస్, రాగులు, కొర్రలు పంపిణీ చేసే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లల్లో ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతుండటం సరైన పరిణామం కాదన్నారు. ఉద్దానం బాధితులకు ఉచితంగా మందులు ఇస్తామని ప్రకటించి ఆరు నెలలైనా ఇవ్వడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరణ పోర్టల్, విద్యాశాఖ యాప్, ఆర్టీజీఎస్ మొబైల్ యాప్, స్మార్ట్ ఆంధ్రతోపాటు పలు పుస్తకాలను, క్యాలెండర్లను ఆవిష్కరించారు. -
కేసీఆర్ మాటలు బాధించాయి
సాక్షి, అమరావతి: అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు పోలిక లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండవ రోజు శుక్రవారం నాడు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ తెలంగాణను ఆంధ్ర పాలకులు ధ్వంసం చేశారని అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఒక ఇల్లును పార్టిషన్ చేసినప్పుడు కూడా వివిధ రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, ఆవిధంగా ఆలోచించకుండా రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు విభజించారన్నారు. 1995 ముందు, 1995 తర్వాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే వాస్తవాలు ఏమిటో తెలుస్తాయన్నారు. విభజన గాయం నుంచి కోలుకోవడానికి నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పంతో అందరిలో చైతన్య స్ఫూర్తిని రగిలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే సమస్యల నుంచి బయటపడుతోందని, మిగిలిన రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి చేరాలంటే ముందు నిలదొక్కుకోవాల్సి వుందని పేర్కొన్నారు. -
మీవల్లే ఫెయిలయ్యాం
►కలెక్టర్లు, అధికారుల సదస్సులో సీఎం చంద్రబాబు ఆగ్రహం ►అధికారుల తీరువల్లే మిషన్ల అమల్లో వైఫల్యం ►పాఠశాల విద్యకు నిధులిచ్చినా పనులు కావడంలేదు ►అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే ఏమి చేస్తాం? ►సీఎం తీరుపై అధికార వర్గాల మండిపాటు సాక్షి, అమరావతి: సామాజిక సాధికారత, సేవారంగ మిషన్ల అమలులో ఫెయిలయ్యామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మిషన్లపై గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సు నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారైనా సమావేశం పెట్టారా? కనీసం కూర్చున్నారా? కూర్చుంటే కదా మాట్లాడేది.. అంటూ కలెక్టర్లు, ఇతర ఐఏఎస్‌లను ప్రశ్నించారు. గురువారం రెండో రోజు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఏడు మిషన్లలోని సామాజిక సాధికారత, సేవారంగ మిషన్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు ఒక్క అధికారి కూడా సమాధానం చెప్పకపోవడంతో సీఎం కాస్త ఘాటుగా మాట్లాడారు. అధికారుల తీరు వల్లే ఆ మిషన్ల అమలులో ఫెయిలయ్యాం అని అన్నారు. ప్రాథమిక విద్యపై కనీస బాధ్యత లేకుండా ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యను ఫెయిల్ చేయటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ చేస్తున్నారని ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను ఉద్దేశించి సీఎం వ్యంగ్యంగా మాట్లాడారు. గ్యాస్ తెప్పించు కోలేరా? బయోమెట్రిక్ పెట్టించుకోలేరా? అంటూ విద్యాశాఖ కార్యదర్శి, కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీ ఆన్సర్ సరిగాలేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియకపోతే ఏమి చేస్తాం, యాన్యుటీ కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ. 5 వేల కోట్లు ఇచ్చాం, ఏమి చేస్తున్నారు’ అంటూ ప్రిన్సిపల్ కార్యదర్శిపై మండిపడ్డారు. రాష్ట్రంలో 47 శాతం విశ్వవిద్యాలయాలు నాక్ అక్రెడిటేషన్ పొందాయని, 13 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉన్నాయన్నారు. లక్షా 62 వేల మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రూ. 15,800 కోట్లతో కొత్తగా రాష్ట్రంలో 11 వర్సిటీలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఆ శాఖల మధ్య సమన్వయం లేదు గర్భిణులకు సరైన పోషకాహరం ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని సీఎం చెప్పారు. అయితే ఈ విషయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు పడటంలేదన్నారు. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రక్తహీనత, నియంత్రణలేని రక్తపోటు కారణంగా పెద్దసంఖ్యలో మహిళలు మృతి చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. శాఖల మధ్య సమన్వయం లేక పౌష్టికాహారం అందకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఉద్దేశించి సీఎం అన్నారు. సీఎం నవరాత్రి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాల్లోని తెలుగు వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు ఈ ఉత్సవాలు ఆరంభసూచకమన్నారు. మీడియా కథనాలపై స్పందించండి ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాలపై స్పందించాలని అధికారులకు సీఎం సూచించారు. సమస్యలపై ప్రజలు ఫోన్ చేస్తే తక్షణం స్పందించి పరిష్కారం చూపాలన్నారు. మీడియా కథనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. పంచాయతీ కార్యాల యాల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కాగా, సీఎం తీరుపై అధికార వర్గాలు మండిపడుతున్నాయి. నేతల వైఫల్యాలను తమపైకి నెట్టడానికి సీఎం ప్రయత్నించారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల లేమితో పాటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పాలన కుంటుపడుతోందని విమర్శించారు. -
రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడ: విజయవాడలో సీఎం అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల సదస్సు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా విధానాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ-ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సదస్సులో మధ్యాహ్నం నుంచి శాంతి భద్రతలపై సమీక్ష జరుగుతుంది. ఈ సదస్సుకు జిల్లా ఎస్పీలు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఈ ఏడాదిని ‘ఈ-ప్రగతి’ సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. ‘ఈ-ప్రగతి’ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాన్నారు. అన్ని జిల్లాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి రావాలని అన్నారు. ఏదైనా ఒక కళాశాల తీసుకుని విద్యార్థులకు ఈ-ప్రగతిపై శిక్షణను ఇవ్వాలన్నారు. -
పనికిరాని శాఖలను పీకేస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలేని శాఖలను మూసేస్తామని, వాటి స్థానంలో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘టెక్నాలజీ అనుగుణంగా కొత్త శాఖలను సృష్టించాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల్లో పాతతరం చట్టాలు ఉన్నాయి. ఉద్యోగులు, అధికారులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. ఎన్ని గంటలు ఉద్యోగులు ఆఫీసులో ఉంటున్నారో నమోదు కావాల్సిందే’ అని అన్నారు. తన పాలనలో 58శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశంలో వృద్ధిరేటు పడిపోయిందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.72 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ‘ఏపీ గ్రోత్ రేటు 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కలెక్టర్ల సదస్సులో సీఎం... ‘పీపుల్ ఫస్ట్’ యాప్‌ను ఆవిష్కరించారు. 1100 నెంబర్‌కు ఫోన్‌చేసి ప్రభుత్వ సేవలు, పథకాల అమలుపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు
సాక్షి,అమరావతి: విజయవాడలో నేడు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో డిపార్ట్మెంట్లవారీగా ముఖ్యకార్యదర్శులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడారు. ప్రజలంతా ఏకపక్షంగా ఉన్నారని, ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే ఆరోపణలను వారు తిప్పికొట్టారని చెప్పారు. జలసిరికి హారతితో నదులకు హారతి ఇవ్వడం వినూత్న కార్యక్రమం అని తెలిపారు. 7 మిషన్లు, 5 గ్రిడ్లతో రాష్ట్రం అభివృద్ధిలో ఉందని, రెవెన్యూ శాఖలో సంస్కరణలతో ప్రజలకు చేరువయ్యామని అన్నారు. విశాఖ భూ అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, సిట్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తదనంతరం ఇది 13వ కలెక్టర్ల సదస్సు అని అన్నారు. రాష్ట్రంలో ఉత్పాదకత పెంపునకు, పారదర్శక పాలనకు ఉత్తమ అభ్యాసాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, ఇ-ప్రగతి, ప్రజలే ముందు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు రాత్రివేళల్లో గ్రామాల్లో నిద్రించాలని, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. -
బెజవాడ– వైజాగ్ రూ. 19,332..
రూ.4 వేల విమాన టిక్కెట్ ధర భారీగా పెంపు.. ఒకే ఒక్క సర్వీసు కారణంగా రద్దీ సాక్షి, అమరావతి: విజయవాడ– విశాఖపట్నం మధ్య విమానం టిక్కెట్ ధర శుక్రవారం అమాంతంగా ఆకాశానికి ఎగబాకింది. సాధారణ రోజుల్లో నాలుగు.. నాలుగున్నర వేలకు లోపే ఉండే టిక్కెట్ ధరను ఏకంగా రూ.19,332కు పెంచేశారు. రెండు నగరాల మధ్య ఒకే ఒక విమాన సర్వీసు నడుస్తుండడంతో పాటు శనివారం నుంచి విశాఖపట్నంలో మహానాడు కార్యక్రమం మొదలవుతున్నందున శనివారం మధ్యాహ్నం వెళ్లే విమానానికి రద్దీ పెరిగిందని తెలుస్తోంది. శుక్రవారం వరకు విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహానాడుకు హాజరయ్యేందుకు గాను విమాన ప్రయాణానికి మొగ్గుచూపడంతో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఇలావుండగా విశాఖ విమానం టిక్కెట్ ధరను ఐదు రెట్లు దాకా పెంచడాన్ని నిరసిస్తూ శనివారం తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రకటించారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రద్దీ పేరుతో ధర ఇలా పెంచడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ‘సాక్షి’వద్ద వ్యాఖ్యానించారు. -
విజయవాడలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడ: విజయవాడలో గురువారం ఉదయం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షిస్తారు. దీనిలో ప్రధానంగా ఏడు మిషన్లపై చర్చించనున్నారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. శుక్రవారం సాధికార మిషన్, వృద్ధిరేటు, టాస్క్‌ఫోర్స్, మౌలిక వసతుల మిషిన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వివిధ జిల్లాల కలెక్టర్లు, పాల్గొన్నారు. -
కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా
అమరావతి: ఈనెల 17, 18వ తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగి 23, 24 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు జీఎస్టీపై అవగాహన కల్పించనున్నారు. -
క్యాష్‌లెస్ లావాదేవీలపై చంద్రబాబుకు షాక్
చాలామంది మంత్రులు, అధికారులు నగదురహిత లావాదేవీలు చేయకపోవడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాక్ తిన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్సు వద్ద ఐడీఎఫ్సీ బ్యాంకు ఆధార్ ఆధారిత కొనుగోలు సెంటర్‌ను ఏర్పాటుచేసింది. కొంతమంది మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులు జీడిపప్పు, బిస్కట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా క్యాష్‌లెస్ లావాదేవీలపై మంత్రులను, ఐఏఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కానీ, చాలామంది ఏటీఎం కార్డులతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు తప్ప మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ యాప్‌ను వినియోగించలేదని తెలిసింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు షాక్ తిన్నారు. 40 శాతం కూడా క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. 40 రోజుల నుంచి చెబుతున్నా మీరే చేయకపోతే ఎలాగని మండిపడ్డారు. అయితే తమ బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ లేదని, అందుకే ఆన్లైన్ వ్యవహారం జరగడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. తాము ఏటీఎం కార్డుల ద్వారా లావాదేవీలు చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. -
జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
-
జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
కలెక్టర్లకు అన్ని అంశాలపై అవగాహన అవసరం 14న జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలుండాలని, ప్రతి జిల్లాకు ఒకేరకమైన పద్ధతి అవలంబించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కలెక్టర్లు విధుల్లో చేరి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో జిల్లాలపై వారికి కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో అధ్యయనం చేసేలా వారికి మార్గదర్శకం చేయాలన్నారు. నెల 14న హైదరాబాద్‌లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారులు బి.పాపారావు, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీనియర్ అధికారులు ఎన్.నర్సింగరావు, సోమేష్‌కుమార్, శాంతికుమారి, నవీన్‌మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు హాజరయ్యారు. నో యువర్ డిస్ట్రిక్ట్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్... జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికల రూపకల్పన, అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ’’నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’’ కార్యక్రమాలను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు వివరించారు. దీంతో జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారుచేసేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఎన్ని కుటుంబాలున్నాయి? వాటి ఆర్థిక, సామాజిక స్థితిగతులేమిటి? రహదారుల పరిస్థితి ఎలా ఉంది? రైల్వే లైన్ల వ్యవస్థ తీరు..? నీటి పారుదల ప్రాజెక్టుల స్థితి..? ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ.. మిషన్ భగీరథ పనులు ఎలా నడుస్తున్నాయి..? బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరణ ఎలా ఉంది..? నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలు...లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగం, ఉద్యానసాగు, పరిశ్రమల ఏర్పాటు, అస్పత్రుల నిర్వహణ, వైద్య, ఆరోగ్య శాఖలో లోపాలు, విద్యారంగం పరిస్థితి, పాఠశాలల్లో పిల్లల చేరిక, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అసైన్డ భూముల వినియోగం, అటవీ భూముల పరిస్థితి, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వినియోగం, భవన నిర్మాణాలకు అనుమతులు, గురుకుల విద్యాసంస్థల పనితీరు, విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ అధికారులు కూడా ఈ అంశాలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించేలా చూడాలన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు, వనరులు, బలాలు, బలహీనతలు ఉంటాయని, వీటిని బేరీజు వేసుకుని జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. జనాభా వారీగా రాష్ట్రంలోని 31జిల్లాలను నాలుగు భాగాలుగా విభజించి వేర్వేరు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, పండ్లు, కూరగాయలు, తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించాలని, ఇందుకు జిల్లా పరిపాలనా విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని, సంక్షోభంలో ఉన్న విద్యుత్‌రంగాన్ని మెరుగుపర్చడమే ఇందుకు ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన సంస్థలు, కేంద్రంనుంచి రావాల్సిన నిధులకు సంబంధించి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. -
పరిశ్రమలకు అనుకులమైన ప్రాంతం
నెల్లూరు(పొగతోట) : పరిశ్రమల ఏర్పాటుకు నెల్లూరు జిల్లా ఎంతో అనుకూలమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు ఉందని, త్వరలో దగదర్తిలో విమానాశ్రయం వస్తుందని తెలిపారు. జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో పరిశ్రమలు అధికంగా ఏర్పాటుచేసే అవకాశం ఉందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు 40 వేల ఎకరాల అనుకులమైన భూములను గుర్తించి బ్యాంకింగ్ చేయడం జరిగిందన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో 70 రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. వాటిన్నింటిని ఒకేచోటకు తరలిస్తే కాలుష్కం తగ్గుతుందన్నారు. రైస్‌మిల్లుల ఏర్పాటుకు 500 ఎకరాల భూములు అవసరమవుతాయని కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఫార్మసి కంపెనీలు ఏర్పాటుకు ప్రతిపాదనలు వస్తున్నయని తెలిపారు. దగదర్తి విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియ రెండు వారాల్లో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. -
సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకోవాలి: చంద్రబాబు
విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత అనేక కష్టాలు వచ్చాయని, అన్నింటిని అధిగమిస్తూ ముందుకు పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంక్షోభాన్ని సవాల్‌గా తీసుకుని అవకాశంగా మార్చుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఈ ఏడాది త్రైమాసిక ఫలితాలు సమీక్షించుకుంటూ వృద్ది సాధనలో ముందడుగు వేస్తున్నామని, వివిధ స్థాయిల్లో అధికారుల పనితీరు మెరుగు పరుస్తున్నామని తెలిపారు. మొదటి త్రైమాసికంలో 12.26 శాతం వృద్ది రేటు సాధించామని, ఇది ఇండియా వృద్ది రేటు 7.31 శాతం కన్నా ఎక్కువ అని చంద్రబాబు అన్నారు. మొదట భూగర్భ జల వనరులను కాపాడుకుంటున్నామని, రెండో ప్రయత్నంగా నదుల అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమంగా జల వనరులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి నాబార్డు అంగీకరించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని, ఇప్పుడు కావాల్సింది నిర్ణీత సమయలోగా పనులు పూర్తీ చేసేందుకు కార్యాచరణ చేపట్టడమేనని ఆయన తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితేనే ఆశించిన వృద్ది సాధన సాధ్యపడుతుందన్నారు. ఇక ప్రపంచానికే సముద్ర ఆహారోత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని, 2018 నాటికీ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ గ్రామలుగా మారాలని, దోమలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని సూచించారు. ప్రజలు సంతృపిగా ఉండాలంటే సమస్యలు లేకుండా చూడాలని, అక్టోబర్ 15 కల్లా ప్రజాసాధికార సర్వే పూర్తి కావాలని చంద్రబాబు ఆదేశించారు. -
వర్షపు నీటి సంరక్షణకు చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: ‘‘ముఖ్యమంత్రి అనుమతితో త్వరలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. శాఖలవారీగా రెండంకెలవృద్ధి నివేదికలను, పవర్ పాయింట్ ప్రజంటేషన్ స్లైడ్లను సిద్ధం చేయండి.’’ అని కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ ఆదేశించారు. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోన శశిధర్‌ని ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరువుని అధిగమించేందుకు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, ఉద్యన పంటల సాగుని అభివృద్ధి చేయాలని రాయలసీమ కలెక్టర్లకు సూచించారు. -
20 మండలాలకో జిల్లా
కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా నాడే కొత్త జిల్లాలు కొలువుదీరాలి 40 వేల నుంచి 50 వేల జనాభాతో ఒక మండలం ఉండాలి జిల్లాల కసరత్తులో ప్రస్తుత నియోజకవర్గాలను పట్టించుకోకండి ఒత్తిళ్లను పక్కనపెట్టి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోండి బలవంతంగా వేరేచోట కలిపారన్న భావన ప్రజల్లో రావద్దు {పజాభిప్రాయం తీసుకోండి.. ప్రజాప్రతినిధులతో మాట్లాడండి జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ ఖరారు రోడ్‌మ్యాప్ ఇలా... జూన్ 20 లోపు సీసీఎల్ఏకు జిల్లా కలెక్టర్ల నివేదికలు జూన్ 30లోపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ జూలై 5న కలెక్టర్లతో సీఎం సమీక్ష జూలై 10 లేదా 11న అఖిలపక్ష సమావేశం ఆగస్టు 4-10 జిల్లాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అక్టోబర్ 11న కొత్త జిల్లాల ఆవిర్భావం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసింది. దసరా నాటికి కొత్త జిల్లాల ఆవిర్భావం జరుగుతుందని మరోమారు స్పష్టం చేసింది. అదే రోజున జిల్లా కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగమంతా బాధ్యతలు స్వీకరిస్తుందని ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. డ్రాఫ్ట్ ప్రకటన జారీ అయిన తేదీ నుంచి నిర్ణీత గడువు (నెల రోజులు) లోపు వచ్చే అభ్యంతరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు క్రోడీకరించి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్మి, సీసీఎల్ఏకు అందజేయాలని సూచించింది. వాటిని పరిశీలించిన తర్వాత జిల్లా ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. అక్టోబర్ 11 (విజయదశమి) నాటికి నూతన జిల్లాల ఆవిర్భవిస్తాయని ప్రకటించింది. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో జరిగిన కలెక్టర్ల వర్క్‌షాప్‌లో రెండో రోజైన బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుపై పలు కీలకమైన నిర్ణయాలను వెల్లడించారు. అందుకు సంబంధించి వివిధ దశల్లో అనుసరించేకార్యాచరణ షెడ్యూలును ప్రకటించారు. ‘‘జూన్ 20 లోపు అన్ని జిల్లాల కలెక్టర్లు సమగ్ర నివేదికను సీసీఎల్ఏ రేమండ్ పీటర్‌కు అందజేయాలి. సీసీఎల్ఏ, సీఎస్ వాటిని ఫైనలైజ్ చేయాలి. జూన్ 30 లోపు స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ, చర్చలు, తదితర రాజకీయ ప్రక్రియను పూర్తి చేయాలి. జూలై 5న కలెక్టర్లతో మరోమారు సమావేశం కావాలి. జూలై 10 లేదా 11 తేదీల్లో ప్రభుత్వం అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు. ఆగస్టు 4 నుంచి 10వ తేదీలోపు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తయారీ.. జారీ ప్రక్రియ ఉంటుంది..’’ అని సీఎం వెల్లడించారు. ‘‘40 వేల నుంచి 50 వేల జనాభాతో ఒక మండలం, సుమారు 20 మండలాలతో ఒక జిల్లా, సుమారు లక్షన్నర జనాభాతో అర్బన్ మండలాల ఏర్పాటు ఉండాలి. ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 నుంచి 12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 6 మండలాలు ఉండేలా కసరత్తు జరగాలి..’’ అంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలు, సలహాలు సూచనల ఆధారంగా ఈనెల 20వ తేదీలోపు కలెక్టర్లు సమగ్ర నివేదిక తయారు చేసి సీసీఎల్ఏ రేమండ్ పీటర్‌కు అందజేయాలని ఆదేశించారు. ఉద్యోగుల లెక్క తేల్చండి.. దసరా రోజున కొత్త జిల్లాల్లో కలెక్టర్ సహా యంత్రాంగమంతా కొలువుదీరేలా సన్నాహాలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ తదితర ప్రభుత్వ విభాగాలు, వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను అన్ని విభాగాల నుంచి ఈ నెల 20లోపే తెప్పించుకోవాలని, ఫర్నీచర్, వాహనాలు, బిల్డింగుల వివరాలను నేరుగా సంబంధిత అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలన్నారు. ‘‘జిల్లా కార్య నిర్వహణ యంత్రాంగం పనితీరును పరిశీలించాలి. జేసీలు, డీఆర్వోలు, పీడీలు, పీవోలు, ఈడీ, డీడీ తదితర ఉన్నతాధికారులు, వారి కింద పని చేస్తున్న అధికారులు, ఉద్యోగుల వివరాలు లెక్క తేల్చాలి. వీరిలో అనుభవం ఉన్నవారిని నూతనంగా ఏర్పడే జిల్లాలకు కేటాయించాలి. అధికారులు తక్కువ సంఖ్యలో ఉంటే పాత జిల్లాల్లో వీలైనంత మేరకు సర్దుబాటు చేసుకోవాలి..’’ అని సూచించారు. 20వ తేదీన జరిగే సమావేశానికి ఈ వివరాలన్నీ తీసుకురావాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్నారా? ‘‘మండలాల్లో నివసిస్తున్న ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి? వారితో మాట్లాడారా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించారా?’’ అని సీఎం కలెక్టర్లను ప్రశ్నించారు. మండల కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలను దగ్గర్లో ఉన్న మండల కేంద్రంలో కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం ముఖ్యమన్నారు. ‘‘ప్రస్తుతం జిల్లా నుంచి పక్క జిల్లాకు పోయే మండలాలు ఏమైనా ఉన్నాయా? ఒక నియోజకవర్గం ఒకటికి మించిన జిల్లాల్లో విస్తరించి ఉందా? అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏంటి? అనే విషయాలను సమీక్షించాలి. ఇది పూర్తిస్థాయి మండలాల సంఖ్యను అంచనా వేయడానికి సాధ్యపడుతుంది’’ అని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధిని అందుకుంటేనే తెలంగాణ ప్రగతి సాధ్యమవుతుందని, అభివృద్ధి చేసుకోవాలంటే కఠిన వైఖరితో కార్యాచరణ ఉండాలని స్పష్టంచేశారు. ‘‘కింది స్థాయి ఉద్యోగులతో పద్ధతిగా పని చేయించుకోవాలని, అవినీతిని తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జి.జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ, ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలు ‘‘కొత్త జిల్లాల కసరత్తులో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాన్ని పట్టించుకోవాల్సిన అవస రం లేదు. బలవంతంగా తమను ఇతర మం డలాల్లో కలిపారన్న భావన ప్రజలకు రాకుం డా చూడాలి’’ అని సీఎం చెప్పారు. గ్రామాలను వివిధ మండలాలలో కలుపుతున్న, తొలగిస్తున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ‘‘వ్యక్తుల అభిప్రాయాలు, రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమమే ధ్యేయంగా నిర్ణయాలుండాలి. ముందుగా మీ కసరత్తు పూర్తి చేయండి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కూర్చొని చర్చించి ఓ ఐడియాకు వస్తే అభ్యంతరాల స్వీకరణకు ప్రజా ప్రకటన ఇద్దాం. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతుంది’’ అని పేర్కొన్నారు. కొత్త జిల్లాల డిమాండ్లపై చర్చ వివిధ ప్రాంతాలను జిల్లాలుగా చేయాలం టూ వస్తున్న డిమాండ్లపై సదస్సులో చర్చ జరిగింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. అటవీ ప్రాంతంలో ఉండే మండలాల విషయంలో భౌగోళిక విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, స్వేచ్ఛగా ఆలోచించి జిల్లాలు, మండలాల పునర్విభజనపై నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచిం చారు. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రాలు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా మారాలన్నారు. మండలాల వ్యవస్థను అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలని, మండ లం కేంద్రంగా జరగబోయే అభివృద్ధిలో కేవలం సాంకేతికతే కాకుండా మానవీయ కోణం ఉండాలన్నారు. -
కొత్త మండలాలపైనే ఫోకస్
కలెక్టర్ల సదస్సులో తొలిరోజు వీటిపైనే చర్చ కొత్త జిల్లాలకు పరిధి ఖరారు.. చుట్టూ 65-70 కి.మీ. మించకుండా జిల్లాల పునర్విభజన జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా హద్దుల గుర్తింపు మ్యాప్‌లు, ముసాయిదాలను ప్రజెంట్ చేసిన కలెక్టర్లు నేడు ముఖ్యమంత్రి, సీఎస్ ఆధ్వర్యంలో తుది కసరత్తు సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను 23 లేదా 24 జిల్లాలుగా పునర్విభజన చేసేందుకు తుది కసరత్తు చేసింది. ఒక్కో జిల్లా కేంద్రం నుంచి ఆ జిల్లా పరిధి 65-70 కిలోమీటర్ల దూరం మించకుండా ఉండేలా పునర్విభజన జరగాలని దిశానిర్దేశం చేసింది. అదే ప్రధాన గీటురాయిగా ఏయే మండలాలను ఎందులో కలపాలన్న ప్రతిపాదనలు రూపొందించాలని సూచించింది. దీంతో సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు సైతం జిల్లా కేంద్రం అందుబాటులో ఉంటుందని, అన్ని మండలాలకు పరిపాలన సౌలభ్యం ఉంటుందని నిర్దేశించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనను సైతం దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన రెండ్రోజుల వర్క్‌షాప్ మంగళవారం ఉదయం ఎంసీహెచ్ఆర్డీలో ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగింది. భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా తొలిరోజు సదస్సును ప్రారంభించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితర అధికారులు సదస్సులో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం తిరిగి వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాయంత్రం సదస్సుకు హాజరయ్యారు. ఇప్పటికే నిర్దేశించిన విధివిధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు సమర్పించిన కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాల ప్రతిపాదనలపై ఈ సందర్భంగా ప్రధాన చర్చ జరిగింది. జిల్లాల వారీగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తమ ప్రతిపాదనలు, మ్యాప్‌లతో సహా కలెక్టర్లు విశ్లేషించారు. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏయే మండలాలు ఏయే రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండాలి.. జిల్లా సరిహద్దులు ఎలా ఉండాలి.. ఏయే మండలాలను ఏ జిల్లాలో చేరిస్తే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందన్న వివరాలను ప్రదర్శించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధితోపాటు అందులో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు, మండలాల హద్దులపై సమగ్ర నివేదికలు సమర్పించారు. తొలిరోజు సదస్సులో కొత్త రెవెన్యూ మండలాల ఏర్పాటుపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. జనాభా, మండల పరిధి, భౌగోళిక స్వరూపం, రవాణా సదుపాయాలను బట్టి కొత్త మండలాల కసరత్తు జరగాలని నిర్ణయం తీసుకున్నారు. జనాభా, వైశాల్యం, పట్టణాలకు ఆనుకొని ఉన్న మేజర్ గ్రామాలు.. వీటన్నింటిని పరిశీలించి రాష్ట్రంలో దాదాపు 70-80 కొత్త మండలాలు ఏర్పాటు కానున్నట్లు కలెక్టర్లు ఇచ్చిన నివేదికలతో లెక్క తేలింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మండలాలకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పెద్ద పట్టణాల్లో అర్బన్, రూరల్ మండలాల ప్రతిపాదనలు అన్ని జిల్లాల నుంచి అందాయి. మండల కేంద్రానికి గ్రామాల దూరం ఎక్కువగా ఉండకుండా నిర్ణీత పరిధి ఉండేలా చూడాలని సీసీఎల్ఏ.. కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా భూపరిపాలన, రెవెన్యూ అధికారులు ముందే రూపొందించిన ప్రశ్నావళిని కలెక్టర్లకు అందజేశారు. వాటికి సంబంధించి అధికారులు రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా తమ జిల్లాల సరిహద్దులో ఉండి.. ఇతర జిల్లాల్లో విలీనమయ్యే గ్రామాలు, రెవెన్యూ సరిహద్దులను ఎలా సవరించాలనే అంశంపై వివరణ కోరినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా మండలాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్ల పరిధి, అధికార వికేంద్రీకరణతో పాటు కావాల్సిన సిబ్బంది, అధికారుల సంఖ్యతో కూడిన వివరాలను సైతం అందించారు. జీఐఎస్ మ్యాపింగ్‌తో కసరత్తు భూపరిపాలన విభాగం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మండలాలు, కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మ్యాపింగ్(జీఐఎస్) ద్వారా శాస్త్రీయంగా కసరత్తు చేసింది. దీంతో ఏ కేంద్రం నుంచైనా 65-70 కిలోమీటర్ల పరిధిలో చుట్టూరా సరిహద్దు గీయటం.. ఆ పరిధిలో ఏయే ప్రాంతాలున్నాయి? ఎంత జనాభా ఉంది? ఏయే మండలాలు ఆ పరిధిలో ఉన్నాయి? సరిహద్దుల్లో ఉన్న మండలాలను ఎందులో కలపాలనేది అప్పటికప్పుడే చూపించింది. కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను తమ దగ్గరున్న జీఐఎస్ మ్యాపింగ్‌తో చేసిన నమూనా మ్యాప్‌లను సరిపోల్చి సలహాలు సూచనలు చేసింది. నదులు, వాగులు, వంకలున్న చోట జీఐఎస్ మ్యాపింగ్‌కు, క్షేత్రస్థాయిలో ఉన్న భౌగోళిక పరిస్థితులకు తేడాలుంటాయని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా వస్తున్న డిమాండ్లను సీఎంకే వదిలేయాలని ఈ సందర్భంగా అధికారులు నిర్ణయించారు. కొత్త జిల్లాలపై కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నారు. జిల్లాలకు సంబంధించిన మరింత స్పష్టతను ఇచ్చేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు సీఎస్ కలెక్టర్లతో సమావేశం కానున్నారు. -
అద్దెలు పెంచితే కఠిన చర్యలు: చంద్రబాబు
► ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు పెంచితే కఠిన చర్యలు ► జూన్ 27 లోగా అమరావతి నుంచే పరిపాలన సాగించాలి ► కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని, అద్దె నియంత్రణ చట్టాన్ని ప్రయోగిస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం రెండోరోజు కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ జూన్ 27 నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత రాష్ట్రం నుంచే పరిపాలన సాగించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎల్ఈడీ బల్బుల వాడకం మొదలుపెట్టాలని, ప్రభుత్వ సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. బకింగ్‌హామ్ కెనాల్ ప్రాజెక్టు అభివృద్ధికి సీఈవో స్థాయి అధికారిని నియమించాలని సూచించారు. ఇకపై వారానికోసారి గృహ నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తానన్నారు. 15 రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యేక యూత్ పాలసీని రూపొందించి మంత్రివర్గం ఆమోదానికి సమర్పించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు జపాన్‌లో రోడ్‌షో నిర్వహిస్తామన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి భవిష్యత్తులో ఎదురయ్యే కొత్త తరహా సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖకు సూచించారు. రెండోరోజు గురువారం కలెక్టర్ల సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్షించారు. ప్రభుత్వం, పోలీసులు మెతగ్గా ఉన్నారనే అభిప్రాయం వస్తే అసాంఘిక శక్తులు విజృంభిస్తాయన్నారు. శ్రీశైలం దేవస్థానానికి ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు వెహికల్ స్కానర్లు, డ్రోన్లు ఉపయోగించాలని సూచించారు. -
నా మాటలను వక్రీకరించారు: చంద్రబాబు
విజయవాడ: దేవుడు, దేవాలయాలపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చుకున్నారు. తన మాటలను వక్రీకరించారని, దేవుడు అంశాలపై తాను పాజిటివ్‌గానే మాట్లాడనని ఆయన అన్నారు. కాగా తప్పులు చేసేవారే ఎక్కువగా గుళ్లకు వెళుతున్నారని, ఎక్కువ తప్పులు చేసి హుండీలో ఎక్కువ డబ్బులు వేస్తున్నారని చంద్రబాబు నిన్న విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రెండోరోజు కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. పరిపాలనలో నూతనత్వం చాలా అవసరమని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజలకు వేధింపులు లేని, అవినీతి లేని పాలన అందించాలని ఆయన అన్నారు. కలెక్టర్లకు విశేషమైన అధికారాలు ఉన్నాయని, ప్రజారంజక పాలన అందించడంలో కలెక్టర్లదే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారుల్లో పోటీ తత్వం పెరిగేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. -
చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుళ్లు, మసీదులు, చర్చిలు లేకుంటే జనాలకు పిచ్చి పట్టేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ...కష్టం వస్తే జనాలు దేవుడిని నమ్ముకుంటారని, అందుకే ఎక్కువ తప్పులు చేసి, ఎక్కువ డబ్బులు హుండీల్లో వేస్తున్నారన్నారు. దీంతో ఆ శాఖ ఆదాయం పెరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మద్యం తాగకుండా ఉండటం కోసమే కొంతమంది దీక్షలు తీసుకుంటున్నారని, దీక్షలు తీసుకున్న ఆ 40 రోజులు లిక్కర్ అమ్మకాలు తగ్గుతున్నాయని ఆయన లెక్కలు చెప్పారు. ఏపీలో దేవాదాయశాఖ ఆదాయం బాగా పెరిగిందని, ఆ శాఖ ఆదాయ అభివృద్ధికి అధికారులు కష్టపడి పనిచేయకపోయినా, 27శాతం ఆదాయం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. పక్కరాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే బాగా పని చేయడం కోసం ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందన్నారు. ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అధికారులు, రాజకీయ నేతలంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అధికారులు పనిచేయరనే అభిప్రాయం వారిలో నెలకొందని, ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చాలన్నారు. అభివృద్ధిలో జిల్లాల మధ్య పోటీతత్వం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలన్నారు. గత రెండేళ్లలో కలెక్టర్ల పనితీరు అభినందనీయంగా ఉందంటూ చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని చంద్రబాబు తెలిపారు. తలపకి ఆదాయంలో ఉత్తరాంధ్ర జిల్లాలే తొలి, చివరి స్థానాల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దాలని, ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. -
24, 25 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
26న కేబినెట్ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఈనెల 24, 25 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్, 26న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మొదటి వారంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని మొదట భావించినప్పటికీ మహా నాడుకు ముందే అన్ని పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. దీంతో కలెక్టర్ల కాన్ఫరెన్సు 24, 25 తేదీల్లోనూ, కేబినెట్ సమావేశం 26న నిర్వహించాలని అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు. వర్షాకాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో విపత్తులు - సన్నద్ధత, ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక, ఎరువులు, విత్తనాల పరిస్థితి, వర్షాకాలం వ్యాధులు.. నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమలకు భూ సేకరణ, రెవెన్యూ అంశాలు, నాలా పన్ను, భూ వినియోగ మార్పిడి తదితర అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చిస్తారు. కేబినెట్ సమావేశంలో... వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనానికి ఉద్యోగుల తరలింపు, 2015లో వరదలు, కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.990 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిల విడుదల, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, రాష్ట్ర పునర్వ్యవవస్థీకరణ చట్టంలోని హామీలపై ప్రధాని, కేంద్ర మంత్రులతో సీఎం జరిపిన చర్చలు, కేంద్రం వైఖరి తదితర అంశాలు మంత్రి వర్గ సమావేశం అధికారిక, అనధికారిక ఎజెండాలో ఉండనున్నాయి. -
2018కి అమరావతి అడ్మిన్ సిటీ పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అడ్మిన్ సిటీ నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తి చేసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం నాడు విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయనీ విషయం వెల్లడించారు. ఇంకా ఆయనేమన్నారంటే... 2029కి ఏపీ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ గమ్యస్థానంగా ఏపీ పేదలకు తప్పనిసరిగా సంక్షేమ ఫలాలు అందాలి సృష్టించిన సంపద పేదలకు అందాలి పెన్షన్లపై ప్రజలలో సంతృప్తిగా ఉన్నారు ఇ-పాస్ విధానం వల్ల నిత్యావసర వస్తువుల పంపిణీ సక్రమంగా జరుగుతోంది ఇంకా సాంకేతిక సమస్యలున్నాయి, వాటిని అధిగమించి ప్రజాపంపిణీలో ఏపీని రోల్ మోడల్‌గా ఉంచుదాం రుణ ఉపశమనం కింద ఇప్పటివరకు రూ. 8,400 కోట్లు అందించాం మరో విడత చెల్లింపులు చేయనున్నాం బ్యాంకర్లు ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం రుణాలిస్తున్నారా లేదా అనేది కలెక్టర్లు పర్యవేక్షించాలి పేదరిక నిర్మూలన ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం సమ్మిళిత వృద్ధి సాధన సాధించాలి దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పనిచేయాలి రహదారుల నిర్మాణంకోసం రూ.65వేల కోట్ల కేంద్రం కేటాయింపులు ఆరోగ్యం, విద్యారంగాలలో వృద్ధి సాధిస్తే తప్ప అనుకున్న లక్ష్యాలకు చేరుకోలేం ఉపాధి హామీ కార్యక్రమాన్ని డిమాండ్ డ్రివెన్ కార్యక్రమంగా తీసుకోవాలి అధికారులు దృష్టిపెట్టిన చోట స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు కార్యక్రమం మెరుగైన ఫలితాలు సాధించింది 8.2 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం 2,400 కోట్ల రూపాయల విలువైన పంటను కాపాడుకున్నాం 8 లక్షల హెక్టార్లలో పంటను కాపాడుకోగలిగా -
2018కి అమరావతి అడ్మిన్ సిటీ పూర్తి
-
పెళ్లికి ముందే డబ్బులు ఇవ్వండి: కేసీఆర్
హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల కింద దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు పెళ్లికి ముందే డబ్బులు అందివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. లబ్ధిదారులు నేరుగా తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దళితులకు భూమి ఇవ్వడంతో పాటు వ్యవసాయం చేసుకునేలా దారి చూపాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చేలా పోటీ పరీక్షలు సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు వివిధ సందర్భాల్లో ఆర్థిక సాయం చేయడానికి కలెక్టర్ వద్ద కోటి రూపాయల నిధి ఉండాలని చెప్పారు. సంక్షేమ హాస్టళ్లలో అవినీతిని సహించరాదని కేసీఆర్ ఆదేశించారు. హాస్టళ్లలో మౌళిక సదుపాయాల మెరుగుదల కోసం నెలలో ఒక రోజును హాస్టల్ డేగా నిర్వహించాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ సూచించారు. -
గిరిజనులకూ మూడెకరాలు
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: దళిత కుటుంబాలకు పంపిణీ చేస్తున్న తరహాలో... పేద గిరిజన కుటుంబాలకు కూడా మూడెకరాల భూమిని పంపిణీ చేసే ఆలోచన ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. ‘గతంలో భూపంపిణీ అశాస్త్రీయంగా జరిగింది. కొద్దిపాటి భూమిని ఎక్కువ మందికి పంచడంతో ఎవ్వరికీ ఉపయోగపడలేదు. ఇప్పటివరకు 20 లక్షల ఎకరాల భూమిని పంచారు. నిరుపయోగంగా ఉన్న ఆ భూమిని వినియోగంలోకి తీసుకురావాలి. ప్రతి వ్యవసాయ దళిత కుటుంబానికి మూడెకరాలు ఇవ్వాలి. బోరు, కరెంటు మోటర్ అమర్చాలి. ఏడాది పెట్టుబడి కూడా సమకూర్చాలి. గ్రామాల వారీగా దళితులకు ఎంత భూమి ఉంది.. ఇంకా ఎంత భూమి కావాలి.. అనే విషయాలు పరిశీలించాలి. భూపంపిణీకోసం తగిన భూమి కొనుగోలు చేయాలి’ అని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో భూకమతాల ఏకీకరణ చట్టం తెస్తామన్నారు. అనంతరం సీఎం సూచనతో మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు గోదాములు, రైతు బజార్లపై అధికారులకు సూచనలు చేశారు. రాష్ర్టంలో రూ.వెయ్యికోట్లతో గోదాముల నిర్మాణం చేపడతామని అన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండలానికో గోదాం, మరో ఆరు జిల్లాల్లో మొత్తం 45 చోట్ల గోదాములను నిర్మిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజారును నిర్మించాలని సూచించారు. -
రూ.100కోట్ల అత్యవసర నిధి
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్ల సదస్సు తొలిరోజున శుక్రవారం రాష్ర్ట ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పనులకు, తక్షణావసరాలు తీర్చేందుకు ప్రతి జిల్లా కలెక్టరు వద్ద రూ. 10 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఇందుకోసం మొత్తం రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రణాళిక విభాగం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. సదస్సులో సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆసరా పెన్షన్లు అర్హులందరికీ అందిస్తూ, అనర్హులను తొలగించాలి. బోగస్ కార్డులను తీసేయాలి. పట్టణాలకు తరలించిన గ్రామీణ బ్యాంకులను మళ్లీ గ్రామాల్లోనే నెలకొల్పాలి. పట్టణ, గ్రామీణ అంశాల సమగ్ర సమీక్షకు నెలలో ఒక రోజు అర్బన్ డే, మరోరోజు రూరల్ డే పాటించాలి. పట్టణాల్లోని ప్రభుత్వ భూములను ప్రజావసరాలకే వాడాలి. ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో ప్రత్యేక తహశీల్దార్‌ను నియమించాలి. పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంటు ఇవ్వాలి. ప్రతి ఇంటిలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తి పలకాలి. కమ్యూనిటీ టాయిలెట్లు నిర్మించాలి. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేలు, సామూహిక మరుగుదొడ్లకు రూ.65 వేల వరకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. రాష్ర్టంలో ప్రస్తుతం 41.6 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార, చేపల మార్కెట్లు నిర్మించాలి. రైతు బజార్లు, పార్కులను ఏర్పాటు చేయాలి. పట్టణాల్లోని ప్రతి ఇంటికి ప్రభుత్వం తరఫున తడి, పొడి చెత్తను సేకరించడానికి డస్ట్ బిన్స్‌ను కొనివ్వాలి. ఇళ్ల నుంచే చెత్తను సేకరించాలి. కామన్ డంప్ యార్డ్సు సంఖ్యను పెంచాలి. మురికి కాల్వల నిర్వహణ, వీధిలైట్ల నిర్వహణ సరిగా ఉండాలి. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాల్లో వేర్వేరు చోట్ల డంప్ యార్డును ఏర్పాటు చేయాలి. అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను వెంటనే పంపాలి. 33% పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు అందేలా చూడాలి. హరితహారం వారోత్సవాన్ని జూలై రెండో వారం లో ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించాలి. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు పెట్టాలి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతోపాటు రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలి. వాటి కోసం బోర్లు వేయాలి. హరిత హారానికి ఎమ్మెల్యేలు రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధిని కేటాయించాలి. హైదరాబాద్‌ను 400 జోన్లుగా విభజించి మొక్కలు నాటాలి. గవర్నర్, సీఎంతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కో జోన్లో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. జిల్లాల్లోనూ అదే పద్ధతి పాటించాలి. అటవీ శాఖ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలి. గుడుంబా, కల్తీ కల్లు నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. గుడుంబా వాడకానికి దారి తీస్తున్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి. అరికట్టే చర్యలకు రెవెన్యూ, ఎక్సైజ్ విభాగాలు ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపించాలి. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్లు నిర్మించాలి. మహిళలను వేధిస్తున్న ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. అంగన్వాడీ కేంద్రాలు గ్రామం మధ్యలో ఉంచాలి. ప్రభుత్వం వంట పాత్రలు కొనివ్వాలి. హైదరాబాద్‌లో పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్తు, నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలి. నూతన పారిశ్రామిక విధానం రూపొం దించాలి. జిల్లాల్లో పరిశ్రమలకు అనువుగా ఉన్న భూములను గుర్తించి.. ప్రభుత్వానికి వెంటనే వివరాలు పంపాలి. సదస్సు సైడ్ లైట్స్ గుడుంబాపై గంటసేపు చర్చ కలెక్టర్ల సదస్సులో గుడుంబాపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. నిజామాబాద్ ఎస్పీ మాట్లాడుతూ, గుడుంబాతోనే కాకుండా కల్తీ కల్లుతో ప్రాణాలు పోతున్నాయన్నారు. ‘‘ఇటీవల కొందరు కల్తీకల్లు బానిసలను స్టేషన్లకు తీసుకొస్తే సాయంత్రం ఐదవగానే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించారు. వాళ్లను నియంత్రించేందుకు మేమే కల్లు తెప్పించి పోయాల్సి వచ్చింది’’ అని చెప్పారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుడుంబా తయారీదారులపై దాడులు చేస్తుంటే, తమ బతుకుదెరువు మాటేమిటంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. తమ జిల్లాలో కల్తీ కల్లుతో చాలామంది చనిపోతున్నారని మంత్రి పోచారం కూడా చెప్పారు. దాంతో, గుడుంబా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వమే చౌక ధరకు మద్యం విక్రయించాలా అంటూ దాదాపు గంట సేపు గుడుంబాపైనే చర్చ జరిగింది. ట్రై టు స్పీక్ ఇన్ తెలుగు కలెక్టర్ల సదస్సులో తెలుగు మాటలు సరదా పుట్టిం చాయి. సదస్సు ప్రారంభంలో పలువురు కార్యదర్శులు ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని అంతా తెలుగులోనే మాట్లాడాలన్నారు. దాంతో వచ్చీ రాని తెలుగులో మాట్లాడేందుకు పలువురు ఉన్నతాధికారులు నానా తంటాలు పడ్డారు. దాంతో సదస్సులో పలుమార్లు నవ్వులు విరిశాయి. మరోసారి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి మీనా ‘ప్లీజ్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు..’ అని ఇతర అధికారులనుద్దేశించి అన్నారు. మంత్రి హరీశ్‌రావు కల్పించుకుని, తెలుగులో మాట్లాడమని కూడా ఇంగ్లిష్‌లోనే చెప్పాలా అనడంతో అంతా నవ్వుకున్నారు. -
పేదల సంక్షేమమే ఎజెండా
కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సమన్వయంతో పని చేయండి మంచి పనులు చేసి జనం మదిలో ఉండండి ప్రజలతో పాలునీళ్లలా కలసిపోతేనే ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ‘పదవులు వస్తుంటాయి. పోతుంటాయి... ఎంత బాగా పని చేశామన్నదే జీవితంలో సంతృప్తినిస్తుంది. మనకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలుగా పనిచేశారు. మంచి పనులు చేస్తే పాతికేళ్ల కిందట పని చేసిన కలెక్టర్లను నేటికీ ఆయా జిల్లాల ప్రజలు మరిచిపోని సందర్భాలున్నాయి. మనకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామనేదే కీలకం. మంచి పనులు చేయటం, ప్రజల ఆశలకు తగ్గట్లుగా పని చేయటంలో ఉన్నంత సంతృప్తి ఇంకెక్కడా లభించదు. హోదాలు, గౌరవాలకు మించి అన్నార్తులు, దీనార్థులైన నిరుపేద ప్రజలకు అందించే సేవలో నుంచి వచ్చే తృప్తి అమూల్యమైనది...’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు హితబోధ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని...అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగు స్థాయి వరకు చేరాలని, పూర్తి పారదర్శకతతో వేగవంతంగా పనులు జరగాలని చెప్పారు. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు. గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలకు రూ. 8,700 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం సంక్షేమానికి రూ. 27 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సదస్సులో మంత్రులు, పార్లమెంటరీ సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. తొలి రోజున పురపాలకశాఖ, వాటర్‌గ్రిడ్, ఆసరా పింఛన్లు, స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. సదస్సులో వివిధ అంశాలపై కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... పేదరిక నిర్మూలనే ఎజెండా... పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రప్రథమ కర్తవ్యం. దానికి అనుగుణంగానే టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక తయారు చేసుకున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ రెండో ప్రాధాన్యం. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వాటర్‌గ్రిడ్ ఓ చాలెంజ్... వచ్చే ఎన్నికల్లోగా రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు అందించకపోతే మళ్లీ ప్రజలను ఓట్లు అడగమని చెప్పాం. అందుకే దీన్ని చాలెంజ్‌గా తీసుకున్నాం. డ్రింకింగ్ వాటర్‌గ్రిడ్ పనులను మీరు (కలెక్టర్లు) పర్యవేక్షించాలి. రైట్ ఆఫ్ వేకు చట్టం తెచ్చినందున పైపులైన్ల నిర్మాణానికి ఆటంకాలు రాకుండా చూడాలి. శాఖల మధ్య సమన్వయం కుదర్చాలి. వ్యవసాయ భూముల్లో ఆరు అడుగుల లోతున పైపులైన్లు నిర్మించాలి. చెరువులకు పునర్వైభవం కాకతీయ రెడ్డి రాజులు తెలంగాణకు అందించిన గొప్ప వరం చెరువులు, చిన్ననీటి పారుదల వ్యవస్థ. 1956కు ముందు తెలంగాణలో సాగులో ఉన్న 20 లక్షల ఎకరాల్లో 15 లక్షల ఎకరాలకు చిన్ననీటి పారుదల ద్వారానే నీరందేది. ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ 1974లో జస్టిస్ బచావత్ నీటి కేటాయింపులు జరిపారు. అప్పటికే నిర్మితమైన చెరువులకు గోదావరి బేసిన్లో 175 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో 90 టీఎంసీల నీటిని కేటాయించారు. అంత మొత్తం నీరు నిండితే మూడేళ్లపాటు కరువు మన ఛాయల్లోకి రాదు. కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ చెరువులు కబ్జాలకు గురికావడంతోపాటు పూడిక నిండి ఆనవాళ్లు కోల్పోయాయి. అందుకే నాటి చెరువుల పునర్వైభవానికి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టాం. పక్కాగా ల్యాండ్ బ్యాంక్ ఆధునిక ప్రపంచ పోకడలకు అనుగుణంగా రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ రంగం వృద్ధి చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మనకు భూమి అందుబాటులో ఉంది. మరోసారి సమగ్రంగా సర్వే చేయించి ల్యాండ్ బ్యాంక్‌ను స్థిరీకరించండి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్ వివరాలుండాలి. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులు వేగంగా చేపట్టాలి. ప్రజలతో మమేకమవండి పరిపాలనా సౌలభ్యానికి వీలుగా వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్నా అందరం కలసి పని చేయాలి. అందరం ఏకతాటిపై ఉంటేనే ఫలితాలు వస్తాయి. ప్రజలకు ప్రభుత్వమంటే దూరమనే భావన ఉంది. పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వంలో పనులు జరగవనే అభిప్రాయాన్ని పారదోలాలి. మనం ప్రజల్లో పాలునీళ్లలా కలసిపోవాలి. కరెంటు కోతలుండవు దామరచర్ల తదితర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే కరెంటు కోతలు ఇంచుమించుగా ఉండవు. ఈ ఏడాది విద్యుత్ కొనుగోళ్లతోపాటు పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకోవటంతో కరెంటు సమస్యను అధిగమించాం. కొత్త విద్యుత్ ప్లాంట్లు, లైన్ల నిర్మాణానికి అవసరమైన సందర్భాల్లో విద్యుత్‌శాఖకు మీరు (కలెక్టర్లు) పూర్తి సహకారం అందించాలి. జిల్లాల్లోనూ ‘షీ టీమ్స్’ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మహిళల భద్రత, రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో అమలుచేస్తున్న ‘షీ టీమ్స్’ను అన్ని జిల్లాల్లోనూ ప్రారంభించాలి. అమ్మాయిలు, విద్యార్థినులపై ర్యాగింగ్‌ను ఉపేక్షించొద్దు. బాధిత మహిళలకు సకాలంలో వైద్యం, ఇతర సహాయ చర్యలు తీసుకునేందుకు ప్రతి జిల్లాలో వన్ స్టాప్ రిసోర్స్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆహార కార్డులపై నేడు స్పష్టత రాష్ట్రంలో జనవరి నుంచి అమలు చేస్తున్న ఆహార భద్రతా పథకం కార్డుల జారీ, అమలుపై సీఎం కేసీఆర్ శనివారం కలెక్టర్ల సదస్సుల్లో అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు. అనర్హుల తొలగింపు, కార్డుల జారీకి నిర్ణీత గడువు విధింపు, దీపం పథకం లబ్ధిదారుల ఎంపిక, లెవీ ఎత్తివేత తదితరాలపై స్పష్టత ఇవ్వనున్నారు. సదస్సు దృష్టికి తేవాల్సిన అంశాలపై పౌర సరఫరాలశాఖ అధికారులు ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు. -
17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
⇒ పాల్గొననున్న సీఎం కేసీఆర్, అన్ని శాఖల మంత్రులు సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం(ఎంసీఆర్ హెచ్ఆర్డీ) వేదికగా ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ మేర కు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 9, 10 తేదీల్లోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనల నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ హామీలు, నెరవేర్చేం దుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. -
9, 10 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఎంసీఆర్హెచ్ఆర్డీలో చకచకా ఏర్పాట్లు పాల్గొననున్న సీఎం, అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణ అంశాలే ప్రధాన ఎజెండా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విబాగం(ఎంసీఆర్ హెచ్ఆర్డీ) వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ఉన్నతాధికారులు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పటికే రెవెన్యూ శాఖ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల క్రమబద్ధీకరణ, భూ సేకరణకు సంబంధించిన అంశాలే ప్రధాన ఎజెండాగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాస్తవ పరిస్థితులపై రెండ్రోజుల పాటు సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ విభాగాల కమిషనర్లు, కార్పొరేషన్ల మేనేజింగ్ డెరైక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. చర్చకు రానున్న అంశాలివే.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల క్రమబద్ధీకరణకు మూడున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినా.. ఎంపికైన లబ్ధిదారుల సంఖ్య 30 శాతానికి మించకపోవడం పై సర్కారు దృష్టి సారించనుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక నెమ్మదిం చడం, క్రమబద్ధీకరణ అడ్డంకులపై సమగ్రంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ, రైల్వే , శిఖం భూముల్లో నివాసముంటున్న వారికి స్థలాలను క్రమబద్దీకరించడంపై చర్చించనున్నారు. ‘మిషన్ కాకతీయ’ అమలు, ఇబ్బందులను అధిగమించేందుకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ‘వాటర్‌గ్రిడ్’కు అవసరమైన భూసేకరణపైనా విస్తృతమైన చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టులో పైప్‌లైన్ ఏర్పాటు నిమిత్తం భూసేకరణ కోసం ఇప్పటికే ‘రైట్ టు యూజ్, రైట్ టు వే’ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో చట్టాల అమలుకు అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గనిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసే సంస్థలకు భూముల కేటాయింపు, గతంలో సంస్థలకు కేటాయించిన వినియోగంలోకి రాని భూ ములను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో, పట్టణాల్లో మంచినీటి ఎద్దడిపై చర్చించే అవకాశం ఉంది. పంచాయితీరాజ్, ఆర్అండ్బీ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రహదారుల ని ర్మాణం పురోగతి, ఆయా రహదారుల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల విని యోగంపై కూడా చర్చించనున్నారు. ‘పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు’ పథకం పదినెలలైనా కార్యరూపం దాల్చకపోవడంపై విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నందున ఈ విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఆసరా పింఛన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, బీడీ కార్మికులందరికీ భృతి అందకపోవడం, ఆహార భద్రతా చట్టం, ఎక్సైజ్ పాలసీ, టూరిజం అభివృద్ధి, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, నిరుద్యోగులకు ఉద్యోగాల క ల్పన.. తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. -
‘ప్రగతి’ దారులు చూపండి
* కలెక్టర్ల సమావేశంలో సీఎం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సూచించారు. సమావేశం అనంతరం కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లాకు సంబంధిం చిన వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి తగు ప్రతిపాదనలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కింద ఇంటింటికీ నల్లా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. దీంతోపాటు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువులు, కుంటల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. రూ. 3.35 కోట్లతో చేపట్టనున్న హరితహారం కార్యక్రమంలో జిల్లా అంతటా మొక్కలు నాటాలి. రహదారులు, భవనాల శాఖ పరిధిలో ని రోడ్ల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధిం చిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలి. సొంత భవనాలు లేని ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థలో ఉన్నవాటిని మరమ్మతులు చేయాలి లేదా కొత్త భవనాలు నిర్మించాలి. ఆహార భద్రతా పింఛన్ల జాబితా రూపకల్పనలో, పింఛన్ల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి జిల్లా సమగ్రాభివృద్ధికి కావల సిన పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.